- Telugu News Photo Gallery Cricket photos IND vs AUS test series top 5 Indian Batsmen who have scored most runs against Australia in Test Cricket Sachin Tendulkar Rahul Dravid and more
IND vs AUS: టెస్టుల్లో ఆసీస్‌పై అత్యధిక పరుగులు చేసిన టాప్-5 భారత ఆటగాళ్లు వీళ్లే..
IND vs AUS: భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఎప్పుడు టెస్టు సిరీస్ జరిగినా.. ఇరువైపుల అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంటుంది. నాలుగు టెస్టుల సిరీస్ ఆడేందుకు భారత పర్యటనకు ఇప్పటికే వచ్చేసిన ఆస్ట్రేలియా జట్టు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తుంది. ఫిబ్రవరి 9న తొలి టెస్ట్ కూడా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాపై జరిగిన టెస్ట్ మ్యాచ్‌లలో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 టీమిండియా ఆటగాళ్ల గురించి తెలుసుకుందాం..
Updated on: Feb 06, 2023 | 11:32 AM

ఆస్ట్రేలియాతో ఇప్పటివరకు జరిగిన టెస్టు మ్యాచ్‌ల్లో సచిన్ టెండూల్కర్ అత్యధిక పరుగులు చేశాడు. ఆ జట్టుపై 39 మ్యాచ్‌లు ఆడిన క్రికెట్ గాడ్ మొత్తం 3630 రన్స్ బాదేశాడు. విశేషమేమంటే ఇందులో 11 సెంచరీలు కూడా ఉన్నాయి.

భారత వెటరన్ బ్యాట్స్‌మ్యాన్ వీవీఎస్ లక్ష్మణ్ ఆస్ట్రేలియాపై అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో 2వ స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియా జట్టుపై 28 మ్యాచ్‌లు ఆడిన వీవీఎస్.. 6 సెంచరీలతో సహా 2434 పరుగులు చేశాడు.

భారత జట్టు మాజీ కెప్టెన్, ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్‌ను టెస్ట్ మ్యాచ్‌ల్లో ‘ది వాల్’ అని పిలుచుకుంటారు. అందుకు ఆస్ట్రేలియాపై జరిగిన 32 టెస్టు మ్యాచ్‌ల్లో 2143 పరుగులు చేయడం కూడా ఒక కారణమని చెప్పుకోవాలి.

భారత్ తరఫున ఆస్ట్రేలియాతో ఆడిన 20 మ్యాచ్‌లలో నయా వాల్ ఛెతేశ్వర్ పుజారా 1893 పరుగులు చేశాడు. ప్రస్తుతం పుజారా అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతున్నాడు.

టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసీస్‌పై 22 టెస్టులు ఆడి.. మూడు సెంచరీలతో సహా 1738 పరుగులు చేశాడు. భారత్ తరఫున టెస్టు క్రికెట్‌లో సెహ్వాగ్ ట్రిపుల్ సెంచరీ సాధించిన మొదటి బ్యాట్స్‌మ్యాన్ కూడా.




