AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Video: రైలు పట్టాల కింద ఉండిపోయిన ఈ కుక్క సమయస్ఫూర్తి అద్భుతం.. వీడియోను చూస్తే దానికి హ్యాట్సాఫ్ కొట్టాల్సిందే..

మానవ జాతికి ఎంతో విశ్వాసపాత్రమైన జంతువులుగా మెలిగే కుక్కలు.. వాటితో అలవాటైన వారి మాటలను ఇట్టే అర్థం చేసుకోగలవు. ఇంకా ఎంతో సమయస్ఫూర్తి..

Trending Video: రైలు పట్టాల కింద ఉండిపోయిన ఈ కుక్క సమయస్ఫూర్తి అద్భుతం.. వీడియోను చూస్తే దానికి హ్యాట్సాఫ్ కొట్టాల్సిందే..
Dog Resting On Railway Tracks
శివలీల గోపి తుల్వా
|

Updated on: Feb 06, 2023 | 11:00 AM

Share

కుక్కలు చాలా తెలివైనవి. మానవ జాతికి ఎంతో విశ్వాసపాత్రమైన జంతువులుగా మెలిగే కుక్కలు.. వాటితో అలవాటైన వారి మాటలను ఇట్టే అర్థం చేసుకోగలవు. ఇంకా ఎంతో సమయస్ఫూర్తి కలిగినవి కూడా. అందుకే మనలో కూడా చాలా మంది కుక్కలను పెంచుకోవడానికి ఇష్టపడుతుంటారు. మరి అలాంటి కుక్కలకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వైరల్ వీడియోలో ఒక కుక్క తృటిలో మరణం నుంచి తప్పించుకున్న దృశ్యాలను మనం చూడవచ్చు. ఈ వీడియో ఫుటేజీలో చూసినట్లుగా.. ఒక కుక్క రైలు పట్టాల మధ్య పడి నలిగిపోకుండా.. కదులుతున్న ఆ రైలు పూర్తిగా వెళ్లిపోయేవరకూ వేచి ఉంది. ఆ రైలు వెళ్లిపోయిన తర్వాత ఏమి జరగలేదన్నట్లుగా దర్జాగా బయటకు వస్తుండడాన్ని కూడా మనం చూడవచ్చు.

ఇంత సాధారమైన జంతువు అంత సమయస్ఫూర్తితో ఎలా ఆలోచించగలిగిందని వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇక వీడియోకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. Avinash Shishoo అనే ట్విట్టర్ ఖాతా నుంచి పోస్ట్ అయింది. ‘గాడ్, ది అల్టిమేట్ సేవియర్’ అనే కాప్షన్‌తో పోస్ట్ అయిన ఈ వీడియోను చూసిన నెటిజన్లు దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందనేది ఇంకా తెలియరాలేదు.

ఇవి కూడా చదవండి

నెట్టింట వైరల్ అవుతన్న వీడియోను ఇక్కడ చూడండి.. 

కాగా, 2021లో కూడా ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. ఆ సంఘటనలో రైల్వే ట్రాక్‌లపై కూర్చున్న కుక్క కొల్లం-చెన్నై ఎగ్మోర్ ఎక్స్‌ప్రెస్‌ నుంచి బయటపడింది. తెన్‌కాసి జంక్షన్ నుంచి పయనించే వేగవంతమైన ఆ రైలు మార్గం నుంచి నిష్క్రమించిన తర్వాత.. కుక్క ట్కాక్ నుంచి బయటకు వెళ్లింది. అప్పట్లో ఆ వీడియో చూసినవారంతా ఆ కుక్కను ‘బ్రేవ్ డాగ్’ అని అభివర్ణించారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం  ఈ లింక్ క్లిక్ చేయండి..