Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gayatri Mantra: గాయంత్రీమంత్రం అర్థం, ప్రాముఖ్యత ఏమిటో మీకు తెలుసా..? ఈ దివ్య మంత్రం గురించి ఇక్కడ తెలుసుకోండి..

సనాతన హిందూ ధర్మంలో గాయత్రీ మంత్రానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ గాయత్రి మంత్రం ఎంతో శక్తివంతమైనదని నమ్మడమే కాక ఇప్పటికీ తమ..

Gayatri Mantra: గాయంత్రీమంత్రం అర్థం, ప్రాముఖ్యత ఏమిటో మీకు తెలుసా..? ఈ దివ్య మంత్రం గురించి ఇక్కడ తెలుసుకోండి..
Gayathri Manthra
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Feb 03, 2023 | 6:50 AM

సనాతన హిందూ ధర్మంలో గాయత్రీ మంత్రానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ గాయత్రి మంత్రం ఎంతో శక్తివంతమైనదని నమ్మడమే కాక ఇప్పటికీ తమ పిల్లలతో పఠిస్తుంటారు వైదికులు. ప్రతిరోజూ ఈ మంత్రాన్ని జపించడం వల్ల మనిషికి కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని, జీవితమంతా సంతోషం ఉంటుందని నమ్ముతారు హిందువులు. మొదటిసారిగా ఋగ్వేదంలో ప్రస్తావించబడిన ఈ గాయత్రీ మంత్రం.. సంస్కృతంలో లిఖించి ఉంటుంది. ఇక గాయత్రీ మంత్రలోని “వ్యాహృతులు” అనేవి దివ్యశక్తిని కలిగి ఉంటాయి. ఇవి 3 కాలాలను సూచిస్తాయి. ఇంకా గాయత్రి మంత్రంలో 24 భీజాక్షరాలు ఉంటాయి. ఈ 24 భీజాక్షరాలను ఆధారం చేసుకొని ఆలయాలను కూడా నిర్మించారు మన పూర్వీకులు.  మరి హిందూ ధర్మంలో ఇంతటి మహిమ కలిగిన గాయత్రీ మంత్రం అర్థం, దానిని జపించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో మనం ఇప్పడు తెలుసుకుందాం..

గాయత్రీ మంత్రం అర్థం: 

‘ఓం భూర్భువస్సువ: తత్ సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి, ధియోయోన: ప్రచోదయాత్’

తాత్పర్యం: ‘మేము దైవిక జీవి, సృష్టికర్త ప్రకాశాన్ని ధ్యానిస్తాము. ఆ భగవంతుని తేజస్సు మన మేధస్సును సన్మార్గంలో నడవడానికి ప్రేరేపిస్తుంది’. హిందూ ధర్మ విశ్వాసాల ప్రకారం ఈ మంత్రం గాయత్రీ దేవికి అంకితం. ఇంకా గాయత్రీదేవిని వేదాలకు తల్లి అని కూడా అంటారు. ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ మంత్రాన్ని ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో ప్రజలు జపిస్తారు. గాయత్రీ మంత్రాన్ని స్వచ్ఛమైన మనసుతో పఠించాలని శాస్త్రాలు పేర్కొన్నాయి. ఈ మంత్రాన్ని అన్ని సమయాలలోనూ పఠించవచ్చు.

ఇవి కూడా చదవండి

గాయత్రీ మంత్రం ప్రయోజనాలు

  1. ప్రతిరోజూ గాయత్రీ మంత్రాన్ని జపించడం వల్ల జీవితంలో విజయం, ఆనందం లభిస్తాయని హిందువులు నమ్ముతారు.
  2. గాయత్రీ మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించడం మనస్సును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఈ మంత్రం మన మేధస్సును పదునుగా చేస్తుంది.
  3. ఈ మంత్రాన్ని జపించడం ద్వారా ఏకాగ్రతను కాపాడుకోవచ్చు.
  4. ఈ మంత్రాన్ని పఠించడం వల్ల శరీరంలోని విషపదార్థాలు బయటకు వస్తాయి. ఇంతే కాకుండా, ఇది నాడీ వ్యవస్థ, శ్వాస, పనితీరులో సహాయపడుతుంది.
  5. ఈ మంత్రం ఒత్తిడి, ఆందోళనను తగ్గించడం ద్వారా మనస్సును ప్రశాంతపరుస్తుంది.
  6. గాయత్రీ మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించడం వల్ల మనస్సు ప్రశాంతంగా ,ఏకాగ్రతతో ఉంటుంది.
  7. ఈ మంత్రాన్ని పఠించడం వల్ల దుఃఖం, బాధలు, దారిద్య్రం, పాపం మొదలైనవి తొలగిపోతాయి.
  8. సంతానం కోసం గాయత్రీ మంత్రం కూడా జపిస్తారు.
  9. పనిలో విజయం, వృత్తిలో పురోగతి మొదలైన వాటి కోసం కూడా గాయత్రీ మంత్రాన్ని జపిస్తారు.
  10. ప్రత్యర్థులు లేదా శత్రువుల మధ్య మీ ఆధిపత్యాన్ని నెలకొల్పడానికి, నెయ్యి ,కొబ్బరికాయతో హవనం చేయవచ్చు.
  11. పితృ దోషం, కాల సర్ప దోషం, రాహు-కేతు ,శని దోషాల శాంతి కోసం శివగాయత్రీ మంత్రాన్ని జపించాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..