Friday Don’ts: శుక్రవారం రోజున పొరపాటున కూడా చేయకూడని పనులివే.. చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురైనట్లే..

సనాతన ధర్మంలో శుక్రవారం రోజున లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పాటించడం వల్ల సిరిసంపదలు ప్రాప్తిస్తాయని నమ్ముతారు. ఇంకా ఈ రోజున లక్ష్మీ దేవిని ప్రసన్నం..

Friday Don'ts: శుక్రవారం రోజున పొరపాటున కూడా చేయకూడని పనులివే.. చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురైనట్లే..
List Of Things Not To Do On Friday
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Feb 03, 2023 | 6:23 AM

సనాతన ధర్మంలో శుక్రవారం రోజున లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పాటించడం వల్ల సిరిసంపదలు ప్రాప్తిస్తాయని నమ్ముతారు. ఇంకా ఈ రోజున లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడం కూడా చాలా సులభం. మత విశ్వాసాల పరంగా శుక్రవారానికి ముందు నుంచి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. శుక్రవారం నాడు లక్ష్మీ దేవిని పూజించి, లక్ష్మీ స్తోత్రాన్ని పఠించిన ఇంటిలో ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఈ రోజున ఏ శుభ కార్యాన్ని తలపెట్టినా కూడా మంచి జరుగుతుంది. శుక్రవారం నాడు లక్ష్మీ అమ్మవారిని నిష్టతో పూజించినవారి ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి, సంపదలు కొలువుదీరతాయి. శుక్రవారం రోజున మంచి పనులు చేయడంతో పాటు, పొరపాటున కూడా ఎవరూ చేయకూడని పనులు ఉన్నాయి. అవి అశుభమైనవిగా పరిగణించడం జరిగింది. శుక్రవారం రోజున ఆ పనులు చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవడం ఖాయం. మరి శుక్రవారం రోజున ఏయే పనులు చేయకూడదో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

దేవతామూర్తులను తీసివేయకూడదు: శుక్రవారం లక్ష్మి దేవి శాశ్వతంగా ఇంటికి వచ్చే రోజు. అమ్మవారిని ఈ రోజున అస్సలు బయటకు తీయకూడదు. ఇంట్లో ఏదైనా పాత లేదా విరిగిన అమ్మవారి విగ్రహాన్ని శుక్రవారం నాడు అస్సలు నిమజ్జనం చేయకూడదు. అది అశుభ శకునం. ఎందుకంటే.. విగ్రహ నిమజ్జనం చేయడం అంటే దేవతకు వీడ్కోలు పలుకడమే. అందుకే శుక్రవారం రోజున ఇంట్లో నుంచి పాత విగ్రహాన్ని బయటకు తీయకండి. వీలైతే శుక్రవారం నాడు ఇంట్లోకి కొత్త విగ్రహాన్ని తీసుకురావాలి. అలాగే ఇంట్లోని మరే ఇతర దేవతా విగ్రహాన్ని తీయవద్దు. అలా చేస్తే లక్ష్మీ దేవి ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. తద్వారా ఆ ఇంటిలో ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి.

తలుపులు తెరిచి ఉంచాలి: సాయంత్రం సమయంలో కొద్దిసేపు ఇంటి ప్రధాన ద్వారా తెరిచి ఉంచాలని అనేక శాస్త్రాలలో పేర్కొనడం జరిగింది. సాయంత్రం వేళ లక్ష్మీ దేవి తన భక్తుల ఇళ్ళకు వెళ్తుందని, ఇంటి తలుపులు మూసి ఉంచితే అమ్మ వారు బయటికి వెళ్లిపోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే.. ముఖ్యంగా శుక్రవారం సాయంత్రం ఇంటి ప్రధాన తలుపులు తెరవాలని మన పెద్దలు చెబుతుండేవారు. పూజా మందిరంలో దీపం వెలిగించడం ద్వారా కూడా అమ్మవారి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది.

ఇవి కూడా చదవండి

అప్పు ఇవ్వకూడదు: శుక్రవారం రోజున ఎవరికీ అప్పు ఇవ్వకూడదు, ఎవరి నుంచి అప్పు తీసుకోకూడదు. ఈ విషయాన్ని పక్కాగా గుర్తుంచుకోవాలి. ఇలా చేస్తే మీ ఇంటి ఐశ్వర్యం తగ్గుతుంది. శుక్రవారం ఎవరైనా రుణం అడిగితే వారికి సహాయం చేయండి కానీ, అప్పుగా మాత్రం ఇవ్వకండి. ఆ రోజు రుణాలు ఇవ్వడం మీ ఆర్థిక పరిస్థితిని బలహీనపరుస్తుంది.

స్త్రీలను కొట్టకూడదు: ఇంటి లక్ష్మి అయిన స్త్రీ.. సృష్టికి మూలమైన ఆదిపరాశక్తి స్వరూపం. వారిని గౌరవించి పూజించిన చోట స్వయంగా దేవతలు తిరగాడతారని మన శాస్త్రాలు చెబుతున్నాయి. అందువల్ల వారిని బాధించడం, అగౌరవపరచడం, వేధించడం చేయకూడదు. ముఖ్యంగా శుక్రవారం నాడు కొంతమంది స్త్రీలు లక్ష్మీ దేవి ఉపవాసం పాటిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజున పొరపాటున కూడా వారిని అవమానించకూడదు. బదులుగా మీకు వీలైనంత వరకు వారిని గౌరవించండి. అంతే కాకుండా శుక్రవారం రోజున ఇంటి లక్ష్మిని అంటే ఇంట్లోని స్త్రీలను దూషించకూండా ఉండండి.

దేవతా విగ్రహాన్ని ఎవరికీ ఇవ్వవద్దు: శుక్రవారం నాడు ఎవరికీ కూడా లక్ష్మిదేవి విగ్రహాన్ని ఇవ్వకూడదు. అలా చేస్తే స్వయంకృతాపరాధం చేసినట్లే అవుతుంది. శుక్రవారం నాడు మీ ఇంటికి లక్ష్మీ దేవి విగ్రహాన్ని తీసుకురావచ్చు, కానీ ఇతరులకు ఎవరికీ ఇవ్వకూడదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..