AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: ఈ మొక్కలు ఇంట్లో ఉంటే.. దరిద్రం నెత్తిమీద తాండవిస్తున్నట్టే.. కారణం అదే అంటున్న వాస్తు నిపుణులు..

కొన్ని రకాల మొక్కలు ఆర్థిక సమస్యలను దూరం చేస్తే.. మరి కొన్ని మొక్కలు ఆర్థిక సమస్యలను తీసుకురావడంతో పాటు దరిద్రం వెంటాడేలా..

Vastu Tips: ఈ మొక్కలు ఇంట్లో ఉంటే.. దరిద్రం నెత్తిమీద తాండవిస్తున్నట్టే.. కారణం అదే అంటున్న వాస్తు నిపుణులు..
Vastu Tips
శివలీల గోపి తుల్వా
|

Updated on: Feb 01, 2023 | 7:55 AM

Share

సాధారణంగా ఇంటి చుట్టూ లేదా ఇంటి పరిసరాలలో ఎన్నో రకాల మొక్కలు, చెట్లను పెరుగుతుంటాయి. వాటిలో కొన్ని మనం నాటినవి అయితే మిగిలినవి సహజంగా పెరిగినవిగా ఉంటాయి. అయితే ఇందులో కొన్ని రకాల మొక్కలను వాస్తు ప్రకారం కూడా నాటతారు. మరికొన్ని మొక్కలు తెలిసి తెలియక నాటుతూ ఉంటారు. అయితే కొన్ని రకాల మొక్కలు ఆర్థిక సమస్యలను దూరం చేస్తే.. మరి కొన్ని మొక్కలు ఆర్థిక సమస్యలను తీసుకురావడంతో పాటు దరిద్రం వెంటాడేలా చేస్తాయి. ఒకవేళ మీ ఇంటి చుట్టూ కీడు కలిగించే ఈ చెట్లు ఉంటే వెంటనే వాటిని తొలగించాలని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే ఇంట్లో అనేక అనర్థాలు, ఇబ్బందులు కలుగుతాయని వారు పేర్కొంటున్నారు. మరి ఇంటి ఆవరణలో ఎటువంటి మొక్కలు చెట్లు ఉండకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

  1. ఇంటి పరిసరాల్లో తుమ్మ చెట్లు ఉండకూడదు. ఈ చెట్టు ఇంటి ఆవరణలో ఉంటే నెగెటివ్ ఎనర్జీ ప్రవహిస్తుంది. ఇంటి సభ్యుల ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది. దీని కారణంగా ఇంటి వాతావరణం కూడా గందరగోళంగా మారుతుంది.
  2. ఇంటి చుట్టుపక్కల కాక్టస్ మొక్కలను నాటకూడదు. ఇంట్లో ఆ మొక్కలు ఉంటే ఉద్రిక్త వాతవరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. చాలామంది అలంకరణ కోసం ఈ మొక్కలు నాటుతారు. కానీ అస్సలు ఈ మొక్కలను నాటకండి. నాటితే ఇంట్లో బాధలు, చికాకులు పెరుగుతాయి.
  3. రేగు చెట్టున్న ఇంట్లో కష్టాలు కలుగుతాయి. రేగు చెట్టులోని ముళ్ల కారణంగా ఇంట్లో ప్రతికూలత పెరుగుతుంది. ఆర్థిక సంక్షోభం తీవ్రం అవుతుంది. రేగు చెట్టు ఉన్న ఇంట్లో లక్ష్మీ దేవత నివసించదని వాస్తు పండితులు చెబుతున్నారు.
  4.  నిమ్మ, ఉసిరి చెట్లు లేకుండా చూడాలి. ఇలాంటి చెట్లు ఉంటే ఇంట్లో కష్టాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరుగుతాయి. అశుభాలు కలుగుతాయని చాలామంది అంటుంటారు. ముళ్ళున్న పూలు, పండ్ల చెట్లు ఇంట్లో ఉంటే ఏది కలిసి రాదన్న విషయం గుర్తుంచుకోవాలి.
  5. చాలా మంది చింత, గోరింటాకు చెట్లను ఇంటి ప్రాంగణంలో పెంచుతుంటారు. అయితే అవి మీ ఇంటికి కాస్త దూరంగా ఉంటేనే మంచిది. మీరు నివసించే ఇంటికి మరీ దగ్గర్లో అవి ఉంటే దరిద్రం వెంటాడే అవకాశం ఉంది. గోరింటాకు మొక్కలు ఇంట్లో ఉండటం ఏ మాత్రం శ్రేయస్కరం కాదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. గోరింటాకు మొక్క ఇంట్లో ఉంటే ప్రతికూల ఆలోచనలు వస్తాయని, ఆ గృహస్తులు ప్రశాంతంగా జీవించ లేరని అంటున్నారు. కాబట్టి అలాంటి మొక్కలను ఇంటి ఆవరణలో కాకుండా ఇంటికి దూరంగా పెంచటం మంచిది. ఇంటి చుట్టూ చింతచెట్లు పెంచడం వల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వస్తుంది.
  6. కొందరు పూజకు పత్తి పనికొస్తుందనే ఉద్దేశంతో ఇంట్లోనే పత్తి మొక్కలను పెంచుకుంటుంటారు. అయితే వాటిని వీలైనంత వరకు పెంచుకోకుండా ఉండడమే మంచిది. పత్తి మొక్కలు ఇంట్లో ఉంటే పలు రకాల అనర్ధాలకు దారితీస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..