AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lucky Zodiac Signs: అదృష్టమంటే ఈ 6 రాశుల వారిదే.. ఎల్లప్పుడూ లక్ష్మీ దేవి అనుగ్రహం ఉంటుంది..

మానవుడు ప్రస్తుతం అవలంభిస్తున్న ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతీ ఒక్కటీ డబ్బుల కోసమే. వివరంగా చెప్పుకోవాలంటే సిరిసంపదలకు మూలమైన లక్ష్మీదేవిని తమ ఇంటికి..

Lucky Zodiac Signs: అదృష్టమంటే ఈ 6 రాశుల వారిదే.. ఎల్లప్పుడూ లక్ష్మీ దేవి అనుగ్రహం ఉంటుంది..
Zodiac Signs That Have Lakshmi Devi Blessings
శివలీల గోపి తుల్వా
|

Updated on: Feb 03, 2023 | 6:05 AM

Share

మానవుడు ప్రస్తుతం అవలంభిస్తున్న ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతీ ఒక్కటీ డబ్బుల కోసమే. వివరంగా చెప్పుకోవాలంటే సిరిసంపదలకు మూలమైన లక్ష్మీదేవిని తమ ఇంటికి ఆహ్వానించేందుకే. అయితే ఐశ్వర్యానికి అధిదేవత లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే ఎవరి జీవితమైనా సుఖ సంతోషాలతో సాగుతుంది. అందుకే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎంతోమంది ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఒక వైపు ఉద్యోగ వాపారాదులను కొనసాగిస్తూనే లక్ష్మీకటాక్ష ప్రాప్తి కోసం పరిహారాలు, యాగాలు, పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అయితే జోతిష్య శాస్త్రం ప్రకారం ఇవేవీ చేయకపోయినా రాశిచక్రంలోని 6 రాశుల వారిపై ఆ లక్ష్మీ కృప ఎల్లప్పుడూ ఉంటుందని జోతిష్య పండుతులు అంటున్నారు. మరి ఆ 6 రాశులేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

  1. వృషభం : వృషభరాశి వారి పట్ల లక్ష్మి దేవి కృప ఎప్పుడూ ఉంటుంది. ఈ వ్యక్తులు విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తారు. సిరి సంపదలు పొందుతారు. ఈ రాశికి చెందిన వారిలో కష్టపడి పనిచేసే తత్వం ఉంటుంది. స్వతహాగా చాలా తెలివైనవారు.. అదృష్టవంతులు కూడా. తమ జీవితంలో ఉన్నత స్థానాన్ని పొందుతారు. లక్ష్మీ దేవి అనుగ్రహం వల్ల వారికి డబ్బుకు లోటు ఉండదు.
  2. మిథునం : మిథున రాశి వారిని చాలా అదృష్టవంతులని తప్పక చెప్పుకోవాలి. మహాలక్ష్మి అనుగ్రహం వలన వారు చాలా సంపదలను పొందుతారు. జీవితంలో విజయం, గౌరవం పొందుతారు. ఈ వ్యక్తులు కూడా కష్టపడి పనిచేసేవారు, వారి స్వభావం కూడా సంతోషకారకంగా ఉంటుంది. కాబట్టి ప్రజలు వారితో ఉండటానికి ఇష్టపడతారు.
  3. సింహం: సింహ రాశి వారు పుట్టుకతోనే అదృష్టవంతులు. ఈ రాశిలో పుట్టినవారికి డబ్బుకు ఎప్పుడూ కొదువ ఉండదు. జీవితంలో ఎటువంటి ఆటుపోట్లు ఉండవు. వారు సంతోషంగా ఉంటూనే ఇతరులను సంతోషంగా ఉంచేందుకు ప్రయత్నిస్తారు.
  4. తుల: తులారాశి వ్యక్తులు తమ వ్యక్తిత్వం ద్వారా గౌరవ మర్యాదలు పొందుతారు. ఎదుటివారిని సులువుగా ఆకట్టుకోగలరు. ఈ వ్యక్తులు ఎల్లప్పుడూ ఖరీదైన వస్తువులను ఇష్టపడతారు. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. లక్ష్మీ దేవి అనుగ్రహంతో జీవితంలో అపారమైన సంపద, సకల సౌఖ్యాలను పొందుతారు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.
  5. ఇవి కూడా చదవండి
  6. మీనం: మీన రాశి వారికి లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బుకు లోటు ఉండదు. కృషిని నమ్ముకుని విజయాలు సాధిస్తారు. మీన రాశి వారికి అదృష్టం వెన్నంటే ఉంటుంది. కలలు నెరవేర్చుకునేందుకు తగిన కృషి చేస్తారు.
  7. కర్కాటక రాశి: ఈ రాశికి అధిపతి చంద్రుడు. వీరిపై లక్ష్మీమాత ఆశీస్సులు ఉంటాయి. ఈ రాశివారి జీవితంలో సుఖం, సంపద, శ్రేయస్సుకు అస్సలు లోటు ఉండదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..