AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Neeti: విజయం కోసం ఎదురుచూస్తున్నారా..? చాణక్యుడు సూచించిన ఈ 4 మార్గాలను పాటిస్తే జయం మీదే..

చాణక్యుడు రచించిన నీతిశాస్త్రం చాణక్య నీతి పేరుతో ప్రసిద్ధి చెందింది. ఈ గ్రంధంలో అనేక అంశాలను ఆచార్యుడు ప్రస్తావించారు. ఆయన రాసిన చాణక్య నీతి ఇప్పటికీ ప్రజలకు సరైన మార్గాన్ని..

Chanakya Neeti: విజయం కోసం ఎదురుచూస్తున్నారా..? చాణక్యుడు సూచించిన ఈ 4 మార్గాలను పాటిస్తే జయం మీదే..
Chanakya Neeti
శివలీల గోపి తుల్వా
|

Updated on: Jan 25, 2023 | 7:54 PM

Share

ఆచార్య చాణక్యుడు మంచి వ్యూహకర్త, ఆర్థికవేత్త. అంతే కాదు.. నిజ జీవితంలో ఎలా వ్యవహరించాలో వివరిస్తూ చాలా పుస్తకాలను రచించారు. అతను చెప్పిన నీతి సూత్రాల కారణంగా ఆయనకు కౌటిల్యుడు అని పేరు వచ్చింది. చాణక్యుడు రచించిన నీతిశాస్త్రం చాణక్య నీతి పేరుతో ప్రసిద్ధి చెందింది. ఈ గ్రంధంలో అనేక అంశాలను ఆచార్యుడు ప్రస్తావించారు. ఆయన రాసిన చాణక్య నీతి ఇప్పటికీ ప్రజలకు సరైన మార్గాన్ని చూపిస్తుంది. మానవ జీవితంలో విజయం సాధించాలంటే ఎటువంటి మార్గాలను అనుసరించాలో కూడా సూచించాడు. మరి విజయం కోసం ఆచార్య చాణక్యుడు సూచించిన 4 మార్గాలేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

  1. ధర్మమార్గం: విజయాన్ని సాధించడానికి అధర్మ మార్గాన్ని ఎప్పటికీ ఎంచుకోరాదని ఆచార్య చాణక్య సూచించారు. అటువంటి విజయం ఎంత త్వరగా వస్తుందో అంతే త్వరగా వెళ్లిపోతుందని చెప్పారు. మతం మార్గం కొంచెం కష్టమైనది కావొచ్చు కానీ అది మీ కీర్తిని చాలా దూరం తీసుకువెళుతుంది.
  2. క్రమశిక్షణ: క్రమశిక్షణ లేని వ్యక్తులు జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆచార్య చెప్పారు. విజయం సాధించాలనుకుంటే ప్రతి ఒక్క నిమిషాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సమయాన్ని అస్సలు వృథా చేయరాదన్నారు. క్రమశిక్షణ లేకుంటే జీవితంలో విజయం సాధించడం అసాధ్యమన్నారు.
  3. ఓటమికి భయపడకపోవడం: ఒక వ్యక్తి లక్ష్యాన్ని సాధించే క్రమంలో చాలాసార్లు ఓటమిని ఎదుర్కోవలసి వస్తుంది కానీ దాని గురించి ఎప్పుడు భయపడవద్దని ఆచార్య చాణక్య సూచించారు. ఓడిపోవడం కూడా మీ అభ్యాస ప్రక్రియలో ఒక భాగమని చెప్పారు. జీవితంలో సరైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి దానికోసం నిత్యం కష్టపడాలని తెలిపారు.
  4. సోమరితనం విడనాడడం: సోమరితనం ఉన్న వ్యక్తి పనిని పలుమార్లు వాయిదా వేస్తాడు. కానీ అది సరైన పద్దతి కాదని ఆచార్య చాణక్య సూచించారు. మీరు జీవితంలో విజయం సాధించాలంటే సోమరితనం విడనాడాలని చెప్పారు. సోమరితనం వల్ల ఒక వ్యక్తి ఎప్పుడు విజయం సాధించలేడని తెలిపాడు. అంతేకాదు సోమరితనాన్ని అతి పెద్ద శత్రువుగా భావించారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..