Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాత్రిపూట చెట్టు దగ్గరికి ఎందుకు వెళ్లకూడదు? దెయ్యాలు ఉన్నాయనేది నిజమేనా?

అందుకే రాత్రిపూట ఏ చెట్టు కిందకు వెళ్లకూడదని, చెట్టు కింద నిద్రించకూడదని చెబుతారు. ఈ చెట్లు నిజంగా రాత్రి వేళల్లో వెంటాడుతున్నాయా? లేక మరేదైనా కారణం ఉందా? రాత్రి పూట చెట్లపైన దెయ్యాలు ఉంటాయా..?

రాత్రిపూట చెట్టు దగ్గరికి ఎందుకు వెళ్లకూడదు?  దెయ్యాలు ఉన్నాయనేది నిజమేనా?
Ghosts In Tree At Night
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 25, 2023 | 1:49 PM

రాత్రిపూట ఏ చెట్టు దగ్గరకు వెళ్లకూడదని, దానిని ముట్టుకోకూడదని పెద్దలు తరచూ చెబుతుంటారు. ఇలా చేయడం వల్ల మనకు ఏదైనా అశుభం జరుగుతుందని అంటారు. మన మతాల్లో అనేక నమ్మకాలు, సంప్రదాయాలు ఉన్నాయి. ఈ నమ్మకాలు, సంప్రదాయాల వెనుక కొన్ని కారణాలు ఖచ్చితంగా దాగి ఉన్నాయి. కానీ వాటి గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అలాంటి ఒక నమ్మకం ఏమిటంటే ఎవరూ రాత్రిపూట పొరపాటున కూడా ఏ చెట్టు దగ్గరకు వెళ్లి దానిని తాకకూడదు, అలా చేస్తే దుష్టశక్తుల బారిన పడే ప్రమాదం ఉందంటారు. అందుకే రాత్రిపూట ఏ చెట్టు కిందకు వెళ్లకూడదని, చెట్టు కింద నిద్రించకూడదని చెబుతారు. ఈ చెట్లు నిజంగా రాత్రి వేళల్లో వెంటాడుతున్నాయా? లేక మరేదైనా కారణం ఉందా? రాత్రి పూట చెట్లపైన దెయ్యాలు ఉంటాయా..? రాత్రిపూట చెట్టు కింద పడుకోవడం ఎందుకు మంచిది కాదు.. దీని వెనుక ఉన్న కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం…

చెట్లు కూడా మనుషుల్లాగే ఊపిరి పీల్చుకుంటాయి. కార్బన్ డై ఆక్సైడ్‌ని పీల్చుకుని ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయని ఇప్పటికే శాస్త్రీయ పరిశోధనల ద్వారా తెలిసింది. కానీ చెట్లు పగటిపూట మాత్రమే ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి. రాత్రి పూట కాదు. చెట్ల శ్వాసక్రియ కిరణజన్య సంయోగక్రియ ద్వారా జరుగుతుంది. ఈ కిరణజన్య సంయోగక్రియకు సూర్యకాంతి అవసరం. రాత్రిపూట సూర్యరశ్మి అందుబాటులో ఉండదు కాబట్టి, ఈ సమయంలో చెట్లు కార్బన్ డై ఆక్సైడ్‌ను గ్రహించలేవు. ఇది చెట్టు చుట్టూ ఆక్సిజన్ స్థాయిని తగ్గిస్తుంది. కార్బన్-డయాక్సైడ్ స్థాయి పెరుగుతుంది.

ఈ క్రమంలోనే ఎవరైనా రాత్రిపూట చెట్టు కింద ఎక్కువసేపు నిలబడితే, ఆక్సిజన్ తక్కువగా ఉండటం వల్ల అతను మూర్ఛపోవచ్చు. లేదంటే, ఇతర శారీరక రుగ్మతలతో బాధపడే అవకాశం ఉంటుంది. అందుకే కొందరు రాత్రిపూట ఆ చెట్టు వద్దకు వెళ్లి ఏదో చూసి భయపడి స్పృహ తప్పి పడిపోయాడని అనుకుంటారు. కానీ, అది నిజం కాదు. ఇదొక్కటే కాదు, అనేక జంతువులు ,పక్షుల కీటకాలు చెట్లపై తమ నివాసాలను ఏర్పరచుకుంటాయి. రాత్రిపూట అవి కూడా విశ్రాంతి తీసుకుంటుంటాయి..వీరు చెట్టు దగ్గరకు వెళ్లడం వల్ల అవి కూడా కలవరపడతాయి. మీమిల్ని కూడా కలవరానికి గురిచేస్తాయి. పూర్వీకులు వాటిని మనలాంటి జీవులుగా గౌరవించారు. అందుకే మన పెద్దలు రాత్రిపూట చెట్టు దగ్గరికి వెళ్లకూడదనే సంప్రదాయాన్ని పాటిస్తూ రాత్రిపూట చెట్లపై దెయ్యం ఉంటుందనే ప్రచారం ద్వారా చెట్టు కిందకు ఎవరూ వెళ్లకుండా చూసేవారు.

ఇవి కూడా చదవండి

ఇంకో విషయం ఏమిటంటే.. మన పూర్వీకులు ప్రాచీన కాలం నుంచి ప్రకృతి ఆరాధకులు. చెట్లు, మొక్కలతో సహా ప్రకృతిని దేవుళ్లుగా ఆరాధించారు. ఈ సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది. రాత్రిపూట మనం ఎలా నిద్రపోతామో మొక్కలు కూడా అలాగే విశ్రాంతి తీసుకుంటాయని చెబుతారు. మనం వారి దగ్గరికి వెళ్ళినప్పుడు లేదా వాటిని తాకినప్పుడు, వారు అసౌకర్యంగా భావిస్తారు. ఏ దేవతను నిద్ర నుండి లేపడం శుభపరిణామంగా భావించబడదు. చెట్లు కూడా దైవ స్వరూపమే. రాత్రిపూట చెట్ల దగ్గరికి వెళ్లకపోవడానికి, ముట్టుకోకపోవడానికి ఇది కూడా ఒక కారణం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…