AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astrology Tips: ఉడుత ఇంటికి వస్తే మంచిదా.. ? అరిష్టమా..? ఏం జరుగుతుంది.. తప్పక తెలుసుకోవాల్సిన విషయం..!

చనిపోయిన ఉడుతను మట్టిలో పాతిపెట్టాలి. మీరు ఎప్పుడూ ఉడుతను కొట్ట కూడదు. ఇంటి బయట పార్కులో చనిపోయిన ఉడుత గురించి చింతించాల్సిన పనిలేదు.

Astrology Tips: ఉడుత ఇంటికి వస్తే మంచిదా.. ? అరిష్టమా..? ఏం జరుగుతుంది.. తప్పక తెలుసుకోవాల్సిన విషయం..!
Squirrel
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 25, 2023 | 12:32 PM

చిన్న కాళ్ళు, చిన్న చేతులతో కనిపించే ఉడుత చూడటానికి అందంగా ఉంటుంది. ఉడుత తోక ముట్టుకుంటే ధన వర్షం కురుస్తుందని అంటారు. హిందూ మతంలో ఉడుతలను శుభప్రదంగా భావిస్తారు. మత విశ్వాసాల ప్రకారం, ఉడుతను శ్రీరాముని సహచరిగా పరిగణిస్తారు. ఉడుతను చూడటం, తాకడం ఆ వ్యక్తి అదృష్టాన్ని మారుస్తుందని నమ్ముతారు. ఉడుతలు మనకు కొంత సంకేతం ఇస్తాయని అంటారు. మీ ఇంటి పెరట్లో, పార్కులో చాలా ఉడుతలను చూస్తుంటారు. అయితే, అలాంటి ఉడుత ఇంటికి వస్తే శుభసూచకంగా భావిస్తారు..ఉడుతను లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. ఉడుత ఇంటికి సంపద, శ్రేయస్సును తెస్తుందని భావిస్తారు.

మీ పెరట్లో ఉడుత కనిపిస్తే మంచిది. త్వరలో మీకు శుభవార్త అందుతుంది. ఉడుత ఇంట్లోకి వచ్చి అక్కడక్కడ తిరుగుతుంటే దానిని మంగళంగా పరిగణిస్తారు. సంతానం ఆశించే వారికి సంతానం కలుగుతుందని నమ్మకం. రోజూ ఒక్క ఉడుత కంట పడితే లక్ష్మి అని పిలవలట. అలా అంటే లక్ష్మీ దేవి మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది.

ఇంట్లో ఉడుత ఉంటే ఆ ఇంటికి లక్ష్మిదేవి వచ్చిందని అర్థం. ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉడుత కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించిందని చెప్పవచ్చు. మీ వంటగదిలోని ఉడుత ఇంట్లోని అన్ని కొరతలను భర్తీ చేస్తుందని కూడా ఇది సూచిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఉదయం పూట ఉడుత కనిపిస్తే ఆ రోజంతా బాగుంటుందని అర్థం. తెల్లవారుజామున మీ కలలో ఉడుత కనిపిస్తే, మీకు త్వరలో డబ్బు వస్తుందని సంకేతం. తెల్లవారుజామున ఉడుత ఇంటికి వస్తే, ఆ రోజు మీకు శుభవార్త వస్తుందని అర్థం.

ఇంటి చుట్టుపక్కల ఉడుతలు ఉన్నా.. మనకు రోజూ కనిపించవు. అలాగే అవి ఎక్కువగా ఇంట్లోకి రావు.. అలాగే మనుషుల మీద పడవు. మీ ముఖంపై ఉడుత పడితే అది శుభ సూచకం. ఉడుత మిమ్మల్ని తాకినట్లయితే, మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తి పోయిందని అర్థం. ఒక ఉడుత మీ శరీరాన్ని అధిరోహిస్తే, అది విష్ణువు, ప్రత్యేక ఆశీర్వాదంగా పరిగణించండి. మీ తలపై ఉడుత పడటం కూడా శుభప్రదం. మీపై ధన వర్షం కురుస్తుందని సూచన. జీవితంలో ఆనందం లభిస్తుంది. సగంలో నిలిచిన పని పూర్తి కావడానికి సూచన. ఇంటి లోపల ఉడుత గూడు కట్టుకుంటే అది కూడా శుభప్రదమే. ధన సమస్యలు తీరి సంతోషం కలుగుతుంది.

ఇది అశుభం:

అదేవిధంగా, మీ ఇంట్లో లేదా పెరట్లో ఉడుత చనిపోతే, అది అశుభంగా పరిగణించబడుతుంది. దీని కారణంగా, ఆర్థిక నష్టం, కుటుంబ సభ్యుల అనారోగ్యం సంభవించవచ్చు. చనిపోయిన ఉడుతను మట్టిలో పాతిపెట్టాలి. మీరు ఎప్పుడూ ఉడుతను కొట్ట కూడదు. ఇంటి బయట పార్కులో చనిపోయిన ఉడుత గురించి చింతించాల్సిన పనిలేదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి..