AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pathaan Movie: షారూఖ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. పఠాన్‌ సినిమా విషయంలో వీహెచ్‌పీ యూ టర్న్‌.. ఇలా ఎలా..?

జనవరి 25వ తేదీ కోసం ముందస్తుగా 4.19 లక్షల టిక్కెట్లను విక్రయించగా.. అందులో దాదాపు 4.10 లక్షల అమ్మకాలు జరిగాయి. పఠాన్ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఇప్పటి వరకు దాదాపు 14 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టుగా తెలిసింది.

Pathaan Movie: షారూఖ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. పఠాన్‌ సినిమా విషయంలో వీహెచ్‌పీ యూ టర్న్‌.. ఇలా ఎలా..?
Shah Rukh Khan's Pathaan
Jyothi Gadda
|

Updated on: Jan 25, 2023 | 11:48 AM

Share

పఠాన్‌ సినిమాకు రిలీఫ్‌ లభించింది. సినిమా విడుదలకు ఒక రోజు ముందే.. ఊరట లభించినట్టైంది. షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె జంటగా నటించిన ఈ చిత్రం ఇటీవలి కాలంలో ఏ హిందీసినమాకు ఇవ్వనంతగా భారీ ఓపెనింగ్‌ను రాబడుతుందనే అంచనాల మధ్య విశ్వహిందూ పరిషత్ (VHP) గుజరాత్ యూనిట్ సంతృప్తి వ్యక్తం చేసింది. మంగళవారం పఠాన్‌కు వ్యతిరేకంగా తమ నిరసనను ఉపసంహరించుకుంది. పఠాన్ మూవీలోని అభ్యంతరకరమైన విషయాలను తొలగించడం పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తూ విడుదలకు ఒక రోజు ముందు తన నిరసనను ఉపసంహరించుకుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ( CBFC )ఈ సినిమాకు సవరణలు చేసింది. సినిమాలోని అశ్లీల పాట, అశ్లీల పదాలు సవరించబడింది. దీంతో దీంతో సంతృప్తిగా ఉన్నామని, సినిమా విడుదలకు తమకు ఎలాంటి అభ్యంతరమూ లేదని బజరంగ్ దళ్, వీహెచ్ పీ ప్రకటించింది.

ఈ పఠాన్ సినిమాపై దేశంలో విస్తృతమైన నిరసనలు, ఆగ్రహాల మధ్య సీబీఎఫ్ సీ 10 కంటే ఎక్కువ చోట్ల సీన్ లను కత్తిరించింది. బేషరమ్ రంగ్ అనే పాటలో కాషాయ బికినీలో నటి దీపికా పదుకొణె నటించినందుకు పఠాన్ హిందూత్వ హాక్స్ నుండి ఎదురుదెబ్బ తగిలింది. మతపరమైన మనోభావాలను దెబ్బతీశారని ఆరోపిస్తూ భజరంగ్ దళ్ అస్సాం, మేఘాలయ, నాగాలాండ్‌లలో 160 పోలీసు ఫిర్యాదులను దాఖలు చేయగా, VHP నుండి కొంతమందితో సహా పలువురు నాయకులు ఈ చిత్రంపై నిషేధం విధించారు.

నాలుగు సంవత్సరాల విరామం తర్వాత తెరపైకి వస్తున్న షారుక్ ఖాన్ సినిమా ఇది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీపికా పదుకొనే, జాన్ అబ్రహం ప్రముఖ పాత్రల్లో నటించారు. జనవరి 25వ తేదీ కోసం ముందస్తుగా 4.19 లక్షల టిక్కెట్లను విక్రయించగా.. అందులో దాదాపు 4.10 లక్షల అమ్మకాలు జరిగాయి. పఠాన్ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఇప్పటి వరకు దాదాపు 14 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టుగా తెలిసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..