AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇక చేపలు పట్టడం చాలా సులభం ..? మనోడి కొత్త యంత్రంతో ఇట్టే బుట్టలోపడుతున్నాయ్..! చూస్తే మీరు అవాక్కవాల్సిందే..

ఈ టెక్నిక్‌ సక్సెస్‌ చేసేందుకు గానూ అతడు రెండేళ్లపాటు అనేకసార్లు ప్రయోగించాడు.. ఎట్టకేలకు పరికరం సిద్ధం చేశాడు..దీని సాయంతో స్థానికంగా వాగులు, వంకలు చెరువుల్లో చేపలు పడుతూ, వాటిని అమ్ముకుంటూ ఉపాధి పొందుతున్నాడు.

ఇక చేపలు పట్టడం చాలా సులభం ..? మనోడి కొత్త యంత్రంతో ఇట్టే బుట్టలోపడుతున్నాయ్..! చూస్తే మీరు అవాక్కవాల్సిందే..
Fishing Machine
Jyothi Gadda
|

Updated on: Jan 25, 2023 | 9:10 AM

Share

మన దేశంలో జూగాడు చేసేవాళ్లు చాలా మందే ఉంటారు.. టాలెంట్‌ ఏ ఒక్కరి సొత్తు కాదన్నట్టుగా ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక టాలెంట్‌ దాగి వుంటుంది. అవసరం, సమయం వచ్చినప్పుడు మాత్రమే ఆ ప్రతిభ బయటపడుతుంది. దీనికి కావాల్సింది తెలివి ఒక్కటే.. ఎన్ని డిగ్రీలు ఉన్నా కూడా సొంతగా ఆలోచించే శక్తి లేనప్పుడు.. ఏ చదువు పనికిరాదు.. ఈ మాటలను నిజం చేసి చూపించాడు.. అంతే కాదు.. తన తెలివితో తను ఉపాధి పొందుతూ.. మరో నలుగురికి పని కల్పిస్తున్నాడు.. చదువుకున్నది నాలుగో తరగతే.. కానీ, ఓ వినూత్న పరికరాన్ని తయారు చేసి తాను ఉపాధి పొందడంతో పాటు.. మరో నలుగురికి ఉపాధి కల్పించాడు. వివరాల్లోకి వెళితే..

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం కొర్లకుంటకు చెందిన ముక్కెర చంద్రశేఖర్ నాలుగో తరగతి వరకే చదువుకున్నాడు. అంతటితోనే చదువు వాగిపోవటంతో.. ఎలక్ట్రిషియన్‌ పని నేర్చుకున్నాడు. స్వగ్రామంలోనే చిన్న చిన్న మరమ్మతులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. స్వతహాగా టీవీ మెకానిక్‌గా స్థిరపడ్డాడు. ఈ క్రమంలోనే చేపలు పట్టేందుకు గ్రామీణులు పడుతున్న ఇబ్బందులను చూసిన శేఖర్‌.. వారి పనిని ఎలా సులువుగా మార్చోలో ఆలోచించాడు.. అందుకోసం ఓ పరికరం తయారు చేయాలనుకున్నాడు.. ఇంటర్‌నెట్‌లో దాని కోసం తెగ సర్చ్‌ చేశాడు.. ఈ క్రమంలోనే బ్యాటరీతో పనిచేసే పరికరాన్ని కనుగొన్నాడు. దీంతో చేపల వేట సులువుగా మార్చేశాడు..

తాను తయారు చేసిన పరికరాన్ని పురుగు మందు పిచికారీ చేసే డబ్బాకు అమర్చాడు. పరికరం ద్వారా వచ్చే తీగలను రెండు పొడవైన వెదురు పుల్లల ద్వారా నీటి ప్రవాహంలో ఉంచి నీటిలో చేపలను ‘బెల్ బటన్ సాయంతో మూర్చపోయేలా చేస్తాడు. అయితే, వాళ్లకు నీటిలో కరెంట్‌ షాక్‌ కొట్టదా అనే సందేహం రావొచ్చు.. పరికరాన్ని పట్టుకున్న వారు నీటిలోనే ఉన్నప్పటికి ఎలాంటి షాక్ కొట్టకుండా దీన్ని రూపొందించాడు.

ఇవి కూడా చదవండి

ఈ టెక్నిక్‌ సక్సెస్‌ చేసేందుకు గానూ అతడు రెండేళ్లపాటు అనేకసార్లు ప్రయోగించాడు.. ఎట్టకేలకు పరికరం సిద్ధం చేశాడు..దీని సాయంతో స్థానికంగా వాగులు, వంకలు చెరువుల్లో చేపలు పడుతూ, వాటిని అమ్ముకుంటూ ఉపాధి పొందుతున్నాడు. ఈ వినూత్న పరికరం బ్యాటరీ, ఇతర పరికరాల తయారీ కోసం రూ.11,500 ఖర్చయిందని చెప్పాడు శేఖర్‌. ప్రభుత్వ ప్రోత్సాహం అందిస్తే మరిన్ని పరికరాలు తయారు చేస్తానని, దాంతో ఎంతో మంది జాలర్లకు ఆసరా అవుతుందని అంటున్నాడు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..