Hyderabad: హనీమూన్‌ కోసం ఇండోనేషియా వెళ్లిన హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ జంట.. ఇంతలోనే ఊహించని ఘటన..

హనీమూన్‌ కోసం ఇండోనేషియాకి వెళ్లిన హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి హఠాన్మరణం ఓ కుటుంబాన్ని అంతులేని విషాదంలోకి నెట్టింది. హైదరాబాద్‌లోని అల్కాపురి కాలనీకి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి..

Hyderabad: హనీమూన్‌ కోసం ఇండోనేషియా వెళ్లిన హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ జంట.. ఇంతలోనే ఊహించని ఘటన..
Scuba Diving Death
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 25, 2023 | 8:59 AM

హనీమూన్‌ కోసం ఇండోనేషియాకి వెళ్లిన హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి హఠాన్మరణం ఓ కుటుంబాన్ని అంతులేని విషాదంలోకి నెట్టింది. బాలిలో స్కూబా డైవింగ్ కు వెళ్లి హార్ట్ స్ట్రోక్ కు గురై హఠాత్తుగా మృత్యువాత పడ్డారు. హైదరాబాద్‌లోని నాగోలు బండ్లగూడ అల్కాపురి కాలనీకి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి వంశీకృష్ణకు గత ఏడాది జూన్‌లో శ్రావణితో వివాహమైంది. గ్రూప్‌ వన్‌ పరీక్షల్లో ప్రిలిమ్స్‌కి అర్హత సాధించి, మెయిన్స్‌ రాసేందుకు సంసిద్దమవుతున్నాడు వంశీ కృష్ణ. బిజీ జీవితంలో కాస్తంత ఊరట కోసం ఈ నెల 13న భార్య శ్రావణి తో కలిసి ఇండోనేషియా వెళ్ళారు వంశీ. బాలికి కొంత దూరంలో ఉన్న పెన్నిడా ఐలాండ్‌ని చూసేందుకు వెళ్ళిన ఈ యువ జంట అక్కడ బస చేశారు. ఈనెల 22న ఉదయం 20 మంది పర్యాటకులతో కలిసి పెన్నిడా ఐలాండ్‌ సముద్ర భాగంలో అక్వేరియం చేపలు చూసేందుకు వెళ్ళారు.

ముగ్గురు గైడ్‌లు ఒకేసారి సముద్రంలోకి దిగారు. అందులో వంశీకృష్ణ కూడా ఉన్నారు. ఆక్సిజన్‌ మాస్క్‌, డైవింగ్‌ షూస్‌ అన్నీ పెట్టుకొని వంశీ సముద్రంలోకి దిగాడు. అంతలోనే సముద్రంలో గల్లంతై ప్రాణాలు కోల్పోయాడు. అదే రోజు సాయంత్రం వంశీ మృతదేహాన్ని గుర్తించారు. రేపు సాయంకాలానికి వంశీ మృతదేహం హైదరాబాద్‌కి చేరుకోనున్నట్టు వంశీ కుటుంబ సభ్యులు తెలిపారు.

భవిష్యత్తు మీద అంతులేని ఆశలతో కష్టపడి చదివి, సివిల్స్‌ ప్రలిమినరీ ఎగ్జామ్‌లో అర్హత సాధించి.. అంతలోనే కనుమరుగైన వంశీకృష్ణ మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ఇవి కూడా చదవండి

నిజానికి పెన్నిడా ఐలాండ్‌ నుంచి ఆదివారమే తిరిగి వంశీ కృష్ణ బాలికి వచ్చేయాల్సి ఉంది. అయితే అక్కడి గైడ్‌ సముద్రంలోపలకి వెళితే ఆ అనుభూతి అద్భుతంగా ఉంటుందని పదే పదే చెప్పడంతో సముద్రలోకి దిగి, హార్ట్‌ ఎటాక్‌తో మృత్యువాత పడ్డారని కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?