AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఇలాంటి గేదె ఒక్కటి ఉన్నా చాలు.. నెలా నెలా లక్షల్లో ఆదాయం.. రోజుకు ఎన్ని లీటర్ల పాలు ఇస్తుందో తెలుసా..?

దేశంలో పాల వ్యాపారానికి డిమాండ్ ఎక్కువగా ఉంది. ఉదయం ప్రారంభమైన నాటి నుంచి ప్రతి ఇంటికి పాలు కావాల్సిందే. మనకుండే నిత్యావసర వస్తువుల్లో పాలు కూడా ఒకటి..

Andhra Pradesh: ఇలాంటి గేదె ఒక్కటి ఉన్నా చాలు.. నెలా నెలా లక్షల్లో ఆదాయం.. రోజుకు ఎన్ని లీటర్ల పాలు ఇస్తుందో తెలుసా..?
Murrah Buffalo
Shaik Madar Saheb
|

Updated on: Jan 24, 2023 | 10:41 AM

Share

దేశంలో పాల వ్యాపారానికి డిమాండ్ ఎక్కువగా ఉంది. ఉదయం ప్రారంభమైన నాటి నుంచి ప్రతి ఇంటికి పాలు కావాల్సిందే. మనకుండే నిత్యావసర వస్తువుల్లో పాలు కూడా ఒకటి.. అందుకే పాల వ్యాపారానికి డిమాండ్ బాగా ఉంది. సాధారణంగా టీ, కాఫీ, పాలు తాగేవారు తప్పనిసరిగా పాలను తీసుకుంటారు. పాలు తాగడం ద్వారా మన శరీరానికి అధిక మొత్తంలో పోషకాలు అందుతాయి. అందుకే పాలను చాలామంది తాగుతుంటారు. పట్టణ ప్రాంతాల్లో అయితే, ప్యాకెట్ పాలే దొరుకుతాయి. అదే, గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛమైన గేదె పాలు దొరుకుతాయి. డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ప్రస్తుతం నకిలీ దాందా కూడా కొనసాగుతోంది.

పాల డిమాండ్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో చాలామంది ఈ వ్యాపారం వైపు మొగ్గుచూపుతున్నారు. పాల పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతోందన్న నేపథ్యంలో కొంతమంది పెద్ద పెద్ద ఉద్యోగాలను వదిలిపెట్టి.. సొంత గ్రామాల్లో పాల వ్యాపారం చేస్తున్నారు. ఆవులు, గేదెలను పెంచుతూ.. భారీగా ఆదాయం ఆర్జిస్తున్నారు. ఏపీలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓ వ్యక్తి సైతం పాలవ్యాపారం మొదలు పెట్టి రూ. వేలు సంపాదిస్తున్నాడు. మండపేట రైతుకు చెందిన ఓ గేదె రోజుకు 26.59 లీటర్ల పాలిస్తుంది. ఈ గేదెతో ఓ కుటుంబం పాల వ్యాపారంలో గణనీయమైన లాభాలను ఆర్జిస్తోంది.

మండపేట పట్టణానికి చెందిన పాడి రైతు ముత్యాల సత్యనారాయణ అబ్బు మేలు జాతి పశుపోషణ చేస్తున్నారు. ముత్యాల సత్యనారాయణ కొన్నేళ్ల కింద ముర్రా జాతి పాడి గేదెను కొన్నారు. అప్పటి నుంచి గేదె రోజుకు 26.59 లీటర్లు పాలు ఇస్తున్నట్లు సత్యనారాయణ తెలిపారు. ఆ గేదె వయసు నాలుగేళ్లు మాత్రమేనని.. పాలు దిగుబడిలో తల్లిని మించిపోయిందని తెలిపారు. రోజుకు 26.59 లీటర్ల పాలు ఇస్తూ రికార్డు సృష్టించిందని సంతోషం వ్యక్తంచేశారు. ఎనిమిదేళ్ల కిందట తెలంగాణ నిజామాబాద్ జిల్లాలో ముర్రా జాతి పాడి గేదెను కొనుగోలు చేశానని రైతు వివరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..