Weather Update: వాయుగుండం ఎఫెక్ట్.. వచ్చే 3 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కక వర్షాలు కొనసాగుతున్నాయి. దీని ప్రభావంతో తెలంగాణలో వచ్చే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లోనూ అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. వచ్చే మూడు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం మంగళవారం ప్రకటనలో తెలిపింది. వాతావరణ కేంద్రం ప్రకారం.. రుతుపవన ద్రోణి ఈరోజు సగటు సముద్ర మట్టం వద్ద ఫిరోజ్‌పూర్, డెహ్రాడూన్, షాజహాన్‌పూర్, వారణాసి, దెహ్రీ, జార్ఖండ్, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర గంగానది పశ్చిమ బెంగాల్ ప్రాంతాలపై ఉన్న వాయుగుండం (Depression) కేంద్రం, దిఘా మీదుగా వెళుతూ అక్కడి నుండి ఆగ్నేయ దిశగా ఈశాన్య బంగాళాఖాతం వరకు కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉండి, దీనిలో ఉత్తర హర్యానా & దాని పరిసర ప్రాంతాలు, తూర్పు ఉత్తరప్రదేశ్ & దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనాలు (cyclonic circulations) ఇమిడి ఉన్నాయి.
సముద్ర మట్టానికి 3.1, 9.6 కిలోమీటర్ల ఎత్తు మధ్య, మధ్య, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ద్వీపకల్ప భారతదేశం మీదుగా సుమారుగా 22°N అక్షాంశం వెంబడి ఉన్న షియర్ జోన్ (Shear Zone) ఇప్పుడు బలహీనపడింది (less marked).
వాతావరణ సూచన (FORECAST)
వీటి ప్రభావంతో తెలంగాణలో మంగళవారం, బుధవారం కొన్ని జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. గురువారం తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రాగల రెండు రోజులు. రోజులలో క్రింది స్థాయి ఉపరితల గాలుల వేగం 30 నుంచి 40 కి.మీ వరకు కొన్ని ప్రాంతాలలో కొనసాగే అవకాశం ఉంది.
హెచ్చరికలు (WARNINGS)
ఈరోజు, రేపు ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాలలో ఉరుములు మెరుపులు, 30 నుండి 40 కి.మీ వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
ఏపీలో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని, అప్రమత్తంగా ఉండాలంటూ సూచించింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
