Hyderabad Police: హైదరాబాద్‌లో వ్యాపారస్తులకు షాకింగ్ న్యూస్.. ఇక పోలీస్ పర్మీషన్ తప్పనిసరి..
హైదరాబాద్‌లో వ్యాపారస్తులకు ఇది చేదు వార్త. ఇక ముందు వ్యాపారం చేయాలంటే తమ అనుమతి తప్పనిసరి అని తేల్చి చెప్పారు హైదరాబాద్ ఖాకీలు. కారణం ఏంటేంటే..
హైదరాబాద్‌లో వ్యాపారస్తులకు ఇది షాకింగ్ న్యూస్. అవును, వరుస ప్రమాదాల నేపథ్యంలో హైదరాబాద్‌లో వ్యాపారస్తులకు షాకిచ్చారు పోలీసులు. ఇకపై వ్యాపారాలకు పోలీస్ లైసెన్స్ తప్పనిసరి చేశారు. దాంతో, ట్రేడ్, ఫుడ్, ఫైర్‌తోపాటు పోలీస్ లైసెన్స్ కూడా తీసుకోవాల్సిందే. గతంలోనూ పోలీస్ లైసెన్స్ విధానం ఉంది. అయితే, 2014 తర్వాత దీన్ని రద్దు చేశారు. అయితే, వరుస ప్రమాదాల నేపథ్యంలో పోలీస్ లైసెన్స్ నిబంధనలను పునరుద్ధరించారు. పోలీస్ లైసెన్స్ తీసుకోవడానికి ఈ మార్చి 31వరకు టైమ్ ఇచ్చింది పోలీస్‌శాఖ.
ఈ చట్టం 2013 వరకు హైదరాబాద్ నగరంలో తప్పనిసరిగా ఉండేది. అయితే, 2014 తర్వాత లైసెన్స్‌లను సిటీ పోలీసులు రద్దు చేశారు. ఇప్పుడు తాజాగా తొమ్మిదేళ్ల తర్వాత పోలీస్ లైసెన్స్ నిబంధనలను మళ్లీ అమలు చేయాలని నిర్ణయించారు హైదరాబాద్ పోలీసులు. లైసెన్సు తప్పనిసరిగా తీసుకోవాలని పోలీస్ శాఖ ఆదేశించింది. అంతేకాదు, సినిమా థియేటర్ మాటోగ్రఫీ, ఫైర్ క్రాకర్స్, పెట్రోలియం ఉత్పత్తులు ఈ లైసెన్సులు తీసుకోవాలని వెల్లడించారు పోలీసులు.
లైసెన్సుల కోసం వ్యాపారస్తులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 1 నుంచి తదుపరి ఏడాది మార్చి 31 వరకు గడువుతో లైసెన్సులు జారీ చేయడం జరుగుతుందని తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం