Hyderabad: డీపీఎస్, పల్లవి గ్రూప్.. టీవీ9 సహాకారంతో.. రేపు భాగ్యనగరంలో 5K హెరిటేజ్ వాక్..
గణతంత్ర దినోత్సవం (జనవరి 26 ) సందర్భంగా గురువారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ అండ్ పల్లవి గ్రూప్ అఫ్ ఇనిస్టిట్యూట్స్ సంయుక్తంగా TV9 సహకారంతో చార్మినార్ నుండి ఫలక్‌నుమా వరకు 5K హెరిటేజ్ వాక్ నిర్వహించనున్నాయి.
గణతంత్ర దినోత్సవం (జనవరి 26 ) సందర్భంగా గురువారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ అండ్ పల్లవి గ్రూప్ అఫ్ ఇనిస్టిట్యూట్స్ సంయుక్తంగా TV9 సహకారంతో చార్మినార్ నుండి ఫలక్‌నుమా వరకు 5K హెరిటేజ్ వాక్ నిర్వహించనున్నాయి. ముత్యాల నగరం హైదరాబాద్ భారతదేశ ఘనమైన సాంస్కృతిక వారసత్వాన్ని విద్యార్థులకు పరిచయం చేసేందుకు రిపబ్లిక్ డే రోజున ఈ వాక్ నిర్వహిస్తున్నట్లు ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ అండ్ పల్లవి గ్రూప్ అఫ్ ఇనిస్టిట్యూట్స్ నిర్వాహకులు తెలిపారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు డిపిఎస్ పాఠశాలలు & పల్లవి గ్రూప్ అఫ్ ఇనిస్టిట్యూట్స్ ఛైర్మన్ ఎం కొమరయ్య ఆధ్వర్యంలో 5K హెరిటేజ్ వాక్ నిర్వహిస్తున్నారు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా విద్యార్థుల్లో, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అలాగే పింక్ రిబ్బన్స్ తో కాన్సర్ పేషెంట్ల కోసం ఈ వాక్ నిర్వహిస్తున్నామని DPS నాచారం ప్రిన్సిపాల్ సునీత రావ్ తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..