Republic Day 2023: గణతంత్ర వేడుకలను నిర్వహించాల్సిందే.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం..
రిపబ్లిక్ డే వేడుకల నిర్వహణలో ట్విస్ట్ చోటు చేసుకుంది. రాజ్‌భవన్ VS ప్రగతిభవన్‌గా మారిన ఈ ఎపిసోడ్‌లోకి ఇప్పుడు హైకోర్టు ఎంట్రీ ఇచ్చింది. గణతంత్ర వేడుకల నిర్వహణ పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
రిపబ్లిక్ డే వేడుకల నిర్వహణలో ట్విస్ట్ చోటు చేసుకుంది. రాజ్‌భవన్ VS ప్రగతిభవన్‌గా మారిన ఈ ఎపిసోడ్‌లోకి ఇప్పుడు హైకోర్టు ఎంట్రీ ఇచ్చింది. గణతంత్ర వేడుకల నిర్వహణ పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం పరేడ్‌తో కూడిన వేడుకలు నిర్వహించాల్సిందేనని స్పష్టం చేసింది . కేంద్రం ఇచ్చిన గైడ్ లైన్స్ తెలంగాణ పాటించాలని ఆదేశించింది. అయితే పరేడ్ ఎక్కడ నిర్వహించాలన్నది ప్రభుత్వ ఇష్టమని చెప్పింది న్యాయస్థానం. కరోనా కారణంగా పరేడ్ గ్రౌండ్‌లో వేడుకలు నిర్వహించడం లేదని ఏజీ చెప్పినా కోవిడ్ ప్రోటోకాల్ జీవో సమర్పించలేదని అభిప్రాయపడింది హైకోర్టు.
రిపబ్లిక్ డే వేడుకలను నిర్వహించాలంటూ శ్రీనివాస్ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. కేంద్ర ప్రభుత్వం జనవరి 19 న గణతంత్ర వేడుకలపై సర్క్యులర్ జారీ చేసిందని. కానీ వాటిని రాష్ట్ర ప్రభుత్వం పాటించడం లేదని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. కోవిడ్ కారణంగా గత 2 ఏళ్లుగా పరేడ్ గ్రౌండ్‌లో వేడుకలు నిర్వహించలేదని.. ఈ సారి రాజ్ భవన్‌లో జరుగుతాయని చెప్పారు అడ్వకేట్ జనరల్. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు ప్రభుత్వం రిపబ్లిక్ డే వేడుకుల జరపాల్సిందేనని స్పష్టం చేసింది.. దేశవ్యాప్తంగా 1950 నుంచి 26 జనవరి వేడుకలు జరుగుతున్నాయని అభిప్రాయపడింది.
ప్రగతి భవన్ వర్సెస్ రాజ్‌భవన్..
రిపబ్లిక్ డే వేడుకల విషయంలో రాజ్‌భవన్- ప్రగతిభవన్ మధ్య కూడా వివాదం నడిచింది. ఏర్పాట్ల విషయంలో గవర్నర్ తమిళిసై అసంతృప్తి వ్యక్తం చేశారు. వేడుకలు గ్రాండ్‌గా నిర్వహించాలని.. గతేడాది నవంబర్ 26నే ప్రభుత్వానికి తమిళిసై లేఖ రాశారు. దానికి ఈ నెల 21న రిప్లై ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. 2022లో మాదిరిగానే రాజ్‌భవన్‌లో జరపాలని నిర్ణయించింది.. సీఎస్, డీజీపీ స్థాయి అధికారులు హాజరవుతారని లేఖలో సమాచారం పంపింది. కరోనా కారణంగా గతేడాది రాజ్‌భవన్‌లోనే గణతంత్ర వేడుకలు జరిగాయి. అయితే ఈ ఏడాది కూడా సాదాసీదాగా జరపాల్సిన అవసరం ఏంటని గవర్నర్ ప్రశ్నించారు.
ప్రభుత్వానికి అంతా తెలుసు..
అంతకుముందు రిపబ్లిక్‌డే ఎలా జరపాలో ప్రభుత్వానికి తెలుసని చెప్పారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి.. సీఎం కేసీఆర్ ఏనాడూ గవర్నర్ తమిళిసై గురించి మాట్లాడలేదని.. కానీ గవర్నరే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. రిపబ్లిక్‌డే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున అవసరమైన ప్రోటోకాల్ పాటిస్తున్నామని, గవర్నర్‌కు బీజేపీ ప్రోటోకాల్ కావాలంటే ఏమి చేయలేమన్నారు పల్లా.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..