AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad Metro: మెట్రో ప్రయాణికులకు బిగ్ షాక్.. భారీగా పెరగనున్న ఛార్జీలు.. త్వరలోనే నిర్ణయం..!

హైదరాబాద్ నగరంలో రోజు రోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు మెట్రో రైలును అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎల్బీనగర్ – మియాపూర్, రాయదుర్గం – నాగోల్, ఎంజీబీఎస్ – జేబీఎస్ మార్గాల్లో మెట్రో సర్వీసులు నడుస్తున్నాయి.

Hyderabad Metro: మెట్రో ప్రయాణికులకు బిగ్ షాక్.. భారీగా పెరగనున్న ఛార్జీలు.. త్వరలోనే నిర్ణయం..!
Hyderabad Metro
Shaik Madar Saheb
|

Updated on: Jan 25, 2023 | 9:51 AM

Share

హైదరాబాద్ నగరంలో రోజు రోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు మెట్రో రైలును అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎల్బీనగర్ – మియాపూర్, రాయదుర్గం – నాగోల్, ఎంజీబీఎస్ – జేబీఎస్ మార్గాల్లో మెట్రో సర్వీసులు నడుస్తున్నాయి. ఈ క్రమంలో భాగ్యనగర వాసులకు బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది హైదరాబాద్ మెట్రో. ఈ మేరకు మెట్రో ఛార్జీలపై ఫేర్‌ ఫిక్సేషన్‌ కమిటీ అధ్యయనం చేస్తోంది. ఆ నివేదిక ఆధారంగా త్వరలో ఛార్జీల పెంపు ఉండనుందని ప్రచారం జరుగుతోంది. అయితే, విద్యుత్, నిర్వహణ భారం, ఖర్చులు పెరగడంతో మెట్రో చార్జీలను 25 నుంచి 30 శాతం వరకు పెంచేందుకు హైదరాబాద్ మెట్రో కసరత్తు చేస్తోందని తెలుస్తోంది. ప్రస్తుతం మెట్రో ప్రయాణ కనీస చార్జీ రూ.10 కాగా, గరిష్టంగా రూ. 60 గా ఉంది. ఇక తాజా పెంపు ప్రతిపాదనలో భాగంగా ఎంత పెంచుతారనేది త్వరలో తేలనుంది.

కాగా.. ఆర్థికంగా బలపడేందుకు ఎల్‌అండ్‌టీ హైదరాబాద్‌ మెట్రో సంస్థ దృష్టి పెట్టింది. ఆదాయం పెంచుకోవడంతోపాటు ప్రాజెక్ట్‌ను లాభాల వైపు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తోంది. కాగా, హైదరాబా్ మెట్రో నిర్మాణ ఖర్చు మొత్తం దాదాపు రూ.13 వేల కోట్లను ఎల్‌అండ్‌టీ సంస్థనే భరించింది. బ్యాంకుల కన్సార్షియం నుంచి రుణం తీసుకుని ప్రాజెక్ట్ పూర్తిచేసింది. ఈ క్రమంలోనే కరోనా లాక్‌డౌన్‌తో హైదరాబాద్ మెట్రో నష్టాల్లోకి కూరుకుపోయింది.

రుణాలకు వడ్డీ చెల్లించలేని పరిస్థితి ఏర్పడటంతో కమర్షియల్‌ లోన్లను ఎల్‌అండ్‌టీ గ్యారంటీ బాండ్లుగా మార్చి వడ్డీని 9 శాతం నుంచి 6.5 శాతానికి తగ్గించుకుని భరిస్తూ వచ్చింది. మరోవైపు రూ.3 వేల కోట్ల సాఫ్ట్‌ లోన్‌ ఇచ్చి ఆదుకోవాలని కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై సర్కారు సానుకూల స్పందించిందనట్లు మెట్రో వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో నష్టాలను తగ్గించుకునేందుకు చార్జీలను పెంచనున్నట్లు పేర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి

ఇదే జరిగితే.. మెట్రో ప్రయాణం మరింత భారంగా మారనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఛార్జీలను ఎంత పెంచుతారనేది ఇంకా తెలియాల్సి ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.