Watch Video: మంత్రిగారికి కోపం వస్తే అట్లుంటది మరి..! కార్యకర్తలు కుర్చీవేయటం లేటైందని రెచ్చిపోయి..
జనవరి25న భాషా పోరాట యోధుల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కూడా పాల్గొంటారు. ఇందుకోసం ముందుగానే 15 ఎకరాల స్థలంలో వేదికను ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏర్పాట్లను పరిశీలించేందుకు పాలు, పాడిపరిశ్రమాభివృద్ధి శాఖ మంత్రి..
ఒక ప్రజా కార్యక్రమానికి విచ్చేసిన మంత్రిగారికి అక్కడి స్థానిక ప్రజలు ఆగ్రహం తెప్పించారు. కార్యక్రమానికి విచ్చేసిన తనకు కుర్చీ తీసుకురావడానికి ఆలస్యం చేసినందుకు ఆగ్రహం తెచ్చుకున్నారు. పార్టీ కార్యకర్తలపై కోపంతో ఊగిపోతూ రాళ్లు రువ్వారు. ఈ ఘటనలతో అక్కడి ప్రజలకు ఒక్కసారిగా షాక్ తగిలినంతపనైంది. మంత్రిగారి కోపం చూసిన ప్రజలు భయపడిపోయారు. తమిళనాడులోని తిరువళ్లూరులో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. వీడియో చూసిన నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇంతకీ అక్కడ జరిగింది ఏంటంటే…
తమిళనాడులోని తిరువళ్లూరులో జనవరి25న భాషా పోరాట యోధుల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కూడా పాల్గొంటారు. ఇందుకోసం ముందుగానే తిరువళ్లూరు ఐసీఎంఆర్ సమీపంలో 15 ఎకరాల స్థలంలో వేదికను ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏర్పాట్లను పరిశీలించేందుకు పాలు, పాడిపరిశ్రమాభివృద్ధి శాఖ మంత్రి ఎస్‌ఎం నాసర్ తిరువళ్లూరు వచ్చారు. కానీ, మంత్రి గారికి కుర్చీ వేయటంలో కార్యకర్తలు కాస్త ఆలస్యం చేశారట.. ఇక అంతే.. మంత్రి గారికి మహా కోపం వచ్చేసింది…వెంటనే వారిపై రాళ్లు రువ్వారు. మంత్రి ప్రవర్తించిన తీరును స్థానికులు ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
#WATCH | Tamil Nadu Minister SM Nasar throws a stone at party workers in Tiruvallur for delaying in bringing chairs for him to sit pic.twitter.com/Q3f52Zjp7F
— ANI (@ANI) January 24, 2023
తమిళనాడు బీజేపీ చీఫ్ కె. అన్నామలై ఈ ఘటనపై ట్వీట్ చేస్తూ పార్టీ కార్యకర్తలను అగౌరవపరిచారని అన్నారు. దేశ చరిత్రలో ప్రజలపై రాళ్లు రువ్విన మంత్రి ఎవరైనా చూశారా? దీన్ని డీఎంకే ప్రభుత్వ మంత్రులే ప్రదర్శించారని మండిపడ్డారు. తమిళనాడు మంత్రులు నిరాశతో ప్రజలపై రాళ్లు రువ్వుతున్నారు. మర్యాద లేదు. ప్రజలను బానిసలుగా చూస్తున్నారని ఆయన ఘాటుగా స్పందించారు.
మంత్రి రాళ్లు రువ్వుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మంత్రి తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..