Tipper Disaster: భోజనం చేస్తున్న రైతులపైకి దూసుకెళ్లిన టిప్పర్.. ముగ్గురు మృతి.! ఎక్సక్లూసివ్ వీడియో.
కడప జిల్లాలో టిప్పర్ బీభత్సం సృష్టించింది. పాదచారులపైకి ఒక్కసారిగా దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. అనంతరం పొలాల్లోకి దూసుకెళ్లగా..
కడప జిల్లాలో టిప్పర్ బీభత్సం సృష్టించింది. పాదచారులపైకి ఒక్కసారిగా దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. అనంతరం పొలాల్లోకి దూసుకెళ్లగా.. టిప్పర్ డ్రైవర్ మృతిచెందాడు. జమ్మలమడుగు మండలం ధర్మాపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గొరిగినూరు దగ్గర భోజనం చేస్తున్న రైతులపై టిప్పర్ దూసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన రైత కూలీలను ధర్మాపురం గ్రామానికి చెందిన నాగ సుబ్బరాయుడు, గొరగనూరు గ్రామానికి చెందిన ఓబులేసులుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..
వామ్మో అంత రేటా..? కేజీ రూ. 83కి చేరిన సన్నబియ్యం..
ఇక మగాళ్లకూ ఫ్రీ బస్సే! రవాణా మంత్రి సంచలన ప్రకటన
కబోర్డ్ ఓపెన్ చేసిన మహిళ.. అందులో ఊహించని సీన్ చూసి హడల్
అర్ధరాత్రి ఉన్నట్టుండి ఇళ్లపై రాళ్ల వర్షం..
భారతీయ భార్యపై అమెరికన్ భర్త ప్రశంసల వర్షం..
చంపాక ఎలా ఏడవాలి అని చాట్‌జీపీటీని అడిగిన ప్రియురాలు
జింక కోసం మాటువేసిన పులి.. నెమలి ఎంట్రీతో..

