అమృత్‌సర్‌లో ప్రసవించిన పాకిస్థానీ మహిళ.. బిడ్డకు ఏం పేరు పెట్టారో తెలుసా..?

సరిహద్దు దాటిన తర్వాత గర్భిణి డెల్లాకు పురిటి నొప్పి రావడంతో అక్కడి సిబ్బంది ఆమెను సివిల్ ఆసుపత్రికి తరలించారు. మధ్యాహ్నం 2:30 గంటలకు మహిళను..

అమృత్‌సర్‌లో ప్రసవించిన పాకిస్థానీ మహిళ.. బిడ్డకు ఏం పేరు పెట్టారో తెలుసా..?
Baby
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 25, 2023 | 1:15 PM

భారతదేశానికి వచ్చిన పాకిస్తాన్ మహిళ జలియన్‌వాలా బాగ్ మెమోరియల్ సివిల్ హాస్పిటల్‌లో మగ బిడ్డకు జన్మనిచ్చింది. మహిళ పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ వైద్యులు ఆమెకు సాధారణ ప్రసవం చేశారు. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. పాకిస్థానీ మహిళ ఇక్కడ ప్రసవించడం ఇది రెండోసారి. అంతకుముందు, కరోనా కాలంలో అట్టారీ సరిహద్దులో పాకిస్తానీ మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. అప్పుడు పుట్టిన బిడ్డకు బోర్డర్ అని పేరు పెట్టారు. తాజాగా అలాంటి ఘటనే మళ్లీ చోటు చేసుకుంది. ఈ సారి ప్రసవించిన మహిళకు ఎలాంటి వైద్యపరమైన సమాచారం లేదని వైద్యులు తెలిపారు.

బాధిత మహిళకు ఇక్కడే అన్ని పరీక్షలు జరిగాయని వైద్యులు వెల్లడించారు. బిడ్డ తల్లి కడుపులోనే మలమూత్ర విసర్జన చేసిందని, దీంతో పరిస్థితి విషమంగా మారిందని డాక్టర్‌ ఆరిఫ్ తెలిపారు. అతి కష్టం మీద తల్లి బిడ్డలిద్దరినీ కాపాడినట్టుగా వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఇద్దరూ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. తన కొడుకు సరిహద్దు జిల్లాలో పుట్టాడని, అందుకే వాడికి బార్డర్-2 అని పేరు పెడతానని బిడ్డ తండ్రి కైలాష్ తెలిపారు.

సోమవారం, పాకిస్తాన్ నుండి 50 మంది హిందువుల బృందం జైపూర్‌కు అట్టారీ-వాహ్గా సరిహద్దు ద్వారా భారతదేశానికి వచ్చింది. కైలాష్ కుటుంబ సభ్యులు కూడా ఈ బృందంలో పాల్గొన్నారు. కైలాష్‌తో పాటు అతని భార్య డెలా బాయి, తల్లి సర్మితి మీరా ఉన్నారు. సరిహద్దు దాటిన తర్వాత గర్భిణి డెల్లాకు పురిటి నొప్పి రావడంతో అక్కడి సిబ్బంది ఆమెను సివిల్ ఆసుపత్రికి తరలించారు. మధ్యాహ్నం 2:30 గంటలకు మహిళను ఇక్కడికి తీసుకొచ్చామని ప్రసవం చేసేందుకు వచ్చిన డాక్టర్ ఆరీఫ్, డాక్టర్ ఐశ్వర్య తెలిపారు. ఆ తర్వాత ఆమెకు 3:14 గంటలకు సాధారణ ప్రసవం జరిగిందని చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..