Samatha Kumbh: ముచ్చింతల్‌లో ఘనంగా ‘సమతా కుంభ్ మహోత్సవాలు’.. తొలి రోజు స్నపనంతో ప్రారంభం
ఈ ఏడాది ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 12 వరకు సమతా కుంభ్ - 2023 జరగనుంది. ప్రతీ రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఐదు నలభై ఐదు వరకు శ్రీ విష్ణు సహస్రనామ స్త్రోత సామూహిక పారాయణం జరుగుతుంది.
బ్రహ్మ కడిగిన పాదానికి బహ్మోత్సవం … ఎంత రమణీయం.. ఎంత మనోహరం…. ఆ సొగసు చూడతరమా….తిరుమల సహా 108 దివ్య దేశాల వైభవం ఒక చోట..మనకళ్లెదుట ఎంత మహత్భాగ్యం. సమతా స్ఫూర్తి వర్ధిల్లేలా భగవ్రదామనుజ అభిషేకోత్సవం జరిగింది. రామానుజ సువర్ణ మూర్తికి పవిత్ర స్నపనంతో బ్రహ్మోత్సవం ప్రారంభమయ్యింది. అచంచల భక్తితో తన మదిని గెలిచిన రామానుజుడికి శ్రీరంగం నుంచి రంగనాథుడు తన మంగళశాసనాలుగా అభయహస్తాన్ని పంపించారు. మన రామానుజ ..గోదాగ్రజులు. తన మొక్కును తీర్చిన అన్నయ్య కోసం శ్రీవిల్లిపుత్తూరు నుంచి గోదమ్మ ..తన అభినందనగా చిలుకలను పంపించారు. తిరుకోష్టూరు నుంచి సాక్షాత్ నారాయణుడు మర్యాద కానుకగా మన రామానుజకు శేషవస్త్రాలను అనుగ్రహించారు. విశ్వేకసేన ఆరాధనతో సమతా కుంభ్ 2023 సమారంభం జరిగింది.
సామాన్యులకు..మాన్యులకే కాదు దేవతాలకూ..విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడికి కూడా ప్రతిబంధకాలు ఎదురువుతుంటాయి. వాటిని తొలిగించి భగవత్ కార్యాన్ని నిర్విఘ్నంగా దిగ్విజయం చేసే నాయకుడే విష్ఫక్సేనుడు. అదీ బ్రహ్మోత్సవాల్లో విష్వక్సేనుడి ప్రాముఖ్యత. బెత్తంపట్టి విఘ్నాలు తొలగించడం మాత్రమే కాదు, బ్రహ్మోత్సవాల అంకురారోపణలో మత్ససంగ్రహనం జరిగేదేది విష్షక్సేనుడి ఆధ్వర్యంలోనే.
ముచ్చింతల్ లోని సమతామూర్తి దివ్యక్షేత్రంలో సమతా కుంభ్ – 2023 మహోత్సవాలు గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. 10 రోజుల పాటు జరగనున్న ఉత్సవాల్లో భాగంగా 108 దివ్య దేశాల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. సమతా కుంభ్ 2023 మొదటి రోజు.. సువర్ణమూర్తి భగవద్రామానుజుల వారికి ఉత్సవారం స్నపనం మహోత్సవంతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజియర్ స్వామి ఆధ్వర్యంలో.. విశ్వక్సేనుడి ఆరాధన నిర్వహించారు. 10 రోజుల పాటు నిర్వహించే బ్రహ్మోత్సవాలకు ఎలాంటి విఘ్నాలు, ఆటంకాలు కలగకుండా.. విశ్వక్షేనుడి ఆరాధన నిర్వహించారు. అనంతరం.. యాగశాల వద్ద అంకురార్పణ కార్యక్రమం జరిపారు.
బ్రహ్మోత్సవం… 108 దివ్యదేశాలు కొలువైన మన రామానుజ భవ్య సన్నిధిలో కనులవిందైన మహోత్సవం.. ప్రతీరోజు పండగు..ప్రతీగడియ విశేషమే….ఇల వైకుంఠపురం మన కళ్లెదుట..ఎంత భవ్యం.. మనదెంత భాగ్యం… రండి..దర్శించండి..తరించండి…. వందే గురుపరంపరాం… ఓం నమో నారాయణ….
బ్రహ్మోత్సవ కార్యక్రమాలు..
- ఫిబ్రవరి 2న విశేషోత్సవాలు.
- ఫిబ్రవరి 3న ఉదయం సూర్యప్రభ వాహన సేవ, సాయంత్రం చంద్రప్రభ వాహన సేవ
- ఫిబ్రవరి 4న సమతామూర్తికి కృతజ్ఞతాంజలి కీర్తన,రామానుజ నూత్తాందాది సామూహిక పారాయణం.
- ఫిబ్రవరి 5న సాయంత్రం సకల లోక రక్షకుడికి 108 రూపాలలో చారిత్రాత్మక, అద్భుత శాంతి కళ్యాణ మహోత్సవం.
- ఫిబ్రవరి 6న ఉదయం వసంతోత్సవం, సాయంత్రం 18 గరుడసేవలు.
- ఫిబ్రవరి 7న ఉదయం డోలోత్సవం,హనుమ ద్వాహన సేవ,18 గరుడ సేవలు.
- ఫిబ్రవరి 8న ఉదయం కల్హారోత్సవం, సామూహిక పుష్పార్చన, సాయంత్రం లీలా విహారికి 18 రూపాల్లో తెప్పోత్సవం.
- ఫిబ్రవరి 9న ఉదయం సువర్ణ రామానుజులకు ఆచార్య వరి వస్య, సాయంత్రం అశ్వ వాహన సేవ,18 గరుడ సేవలు.
- ఫిబ్రవరి 10న ఉదయం సామూహిక ఉపనయనములు, సాయంత్రం గజవాహన సేవ 18 గరుడ సేవలు.
- ఫిబ్రవరి 11న ఉదయం రథోత్సవం, చక్ర స్నానం, మధ్యాహ్నం సకల లోక గురుడికి విశ్వశాంతి విరాట్ గీతా పారాయణం.
- ఫిబ్రవరి 12న చివరి రోజు ఉదయం ఉత్సవాన్త స్నపనము, సాయంత్రం మహా పూర్ణాహుతి,కుంభ ప్రోక్షణ తో పాటు వివిధ కార్యక్రమాలు.
ఫిబ్రవరి 3న కార్యక్రమాలు:
- ఉదయం 5:45 గంటలకు సుప్రభాతం.
- 6:00 – 6:30 – అష్టాక్షరీ మంత్రం జపం.
- 6:30 – 7 గంటల వరకు ఆరాధన, సేవా కాలం.
- 7.30 -7:30 గంటల వరకు శాత్తుముఱై, తీర్థ ప్రసాద గోష్ఠి.
- 9 -10 గంటల వరకు నిత్య పూర్ఱాహుతి & బలిహరణ.
- 10.30-11.30 గంటల వరకు 18 దివ్యదేశ మూర్తులకు తిరుమంజన సేవ.
- 11.30-1 గంట వరకు విశేష ఉత్సవములు.
- 1.30-4.30 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు.
సాయంత్రం..
- 5-5.45 గంటల వరకు శ్రీవిష్ణు సహస్ర నామ స్తోత్ర సామూహిక పారాయణం.
- 6-7.30 గంటల వరకు సాకేత రామచంద్ర స్వామి & 18 దివ్య దేశ మూర్తులు – 18 గరుడలపై యాగశాల ప్రవేశం
- 7.30-8 గంటల వరకు నిత్య పూర్ణాహుతి.
- 8-9 గంటల వరకు తిరువీధి సేవ, మంగళా శాసనం, తీర్థ, ప్రసాద గోష్ఠి
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి