AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahashivratri 2023: మహాశివరాత్రికి ముందు మీకు ఈ 6 సంకేతాలు వస్తే పరమేశ్వరుడి ఆశీస్సులు మీపై ఉన్నాయని అర్థం..!

మహాశివరాత్రి.. యావత్ హిందూ సమాజం ఎంతో భక్తిశ్రద్ధలతో దేవదేవుడైన శివుడిని పూజిస్తుంది. పరమేశ్వరుడి అనుగ్రహం కోసం ఉపవాసవ్రతాలు, జాగరణ పాటిస్తారు భక్తులు.

Mahashivratri 2023: మహాశివరాత్రికి ముందు మీకు ఈ 6 సంకేతాలు వస్తే పరమేశ్వరుడి ఆశీస్సులు మీపై ఉన్నాయని అర్థం..!
Maha Shivarathri
Shiva Prajapati
|

Updated on: Feb 02, 2023 | 12:53 PM

Share

మహాశివరాత్రి.. యావత్ హిందూ సమాజం ఎంతో భక్తిశ్రద్ధలతో దేవదేవుడైన శివుడిని పూజిస్తుంది. పరమేశ్వరుడి అనుగ్రహం కోసం ఉపవాసవ్రతాలు, జాగరణ పాటిస్తారు భక్తులు. తద్వారా స్వామివారి ఆశీస్సులు లభిస్తాయని, అంతా శుభం జరుగుతుందని విశ్వసిస్తారు. ఈ ఏడాది మహా శివరాత్రి ఫిబ్రవరి 18న రానుంది. శివరాత్రి పర్వదినాన.. స్వామివారి అనుగ్రహం కోసం భక్తులు ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటారు. అయితే, స్వామి అనుగ్రహం లభించింది అనడానికి కొన్ని సూచనలు కనిపిస్తాయని, శివరాత్రి వేళ ఈ 6 సంకేతాలు కనిపిస్తే శివుడి అనుగ్రహం మీపై ఉన్నట్లేనని అంటున్నారు వేదపండితులు. ఆ సంకేతాలు కనిపిస్తే.. శుభదాయకమని, మనసులోని కోరికలు నెరవేరుతాయని చెబుతున్నారు. మరి ఆ 6 సంకేతాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1. మహాశివరాత్రికి కొన్ని రోజుల ముందు కలలో శివలింగానికి పాలతో అభిషేకం చేసినట్లు కనిపిస్తే.. మీ కష్టాలన్నీ తొలగిస్తాడని, జీవితం ఆనందమయం అవుతుందని అర్థం.

2. మహాశివరాత్రికి ముందు కలలో బిల్వపత్రం, బిల్వ వృక్షం కనిపించినట్లే.. పరమేశ్వరుడు మీపై దయ చూపుతాడని, ఆర్థిక కష్టాలను తొలగిస్తాడని అర్థం.

ఇవి కూడా చదవండి

3. రుద్రాక్షను శివుడి స్వరూపంగా పరిగణిస్తారు. మహాశివరాత్రికి ముందు రుద్రాక్ష మాల, ఒక్క రుద్రాక్ష అయినా కలలో కనిపిస్తే అది శివుని అనుగ్రహంగా భావిస్తారు. పరమేశ్వరుడి అనుగ్రహంతో మీ దుఃఖాలు, రోగాలు, దోషాలు అన్నీ తొలగిపోయి అంతా శభమే జరుగుతుందని అర్థం.

4. మహాశివరాత్రికి ముందు కలలో శివలింగం దర్శనమిస్తే.. వారి ఉద్యోగంలో పురోగతికి చిహ్నంగా భావించొచ్చు. అదే సమయంలో ఉద్యోగాల కోసం వెతుకుతున్న వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి.

5. కలలో శివుడు-పార్వతి కలిసి కూర్చున్నట్లు కనిపిస్తే.. అది వైవాహిక జీవితంలో సంతోషంగా మారుతుంది. దాంపత్య సమస్యలన్నీ తీరిపోయి సంతోషం వెల్లివిరుస్తుంది.

6. మహాశివరాత్రికి ముందు కలలో నాగదేవత కనిపించడం సంపద పెరుగుదలకు సంకేతంగా పరిగణించబడుతుంది.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం ఊహాగానమే. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈ సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.

మరిన్ని ఆధ్మాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..