Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope: ఈ రాశి వారు డబ్బు అప్పుగా ఇవ్వొద్దు.. వారి రాక మీ సంతోషాన్ని రెట్టింపు చేస్తుంది..

Horoscope Today: పంచాంగం ప్రకారం.. 2 ఫిబ్రవరి 2023, గురువారం వృశ్చికరాశి వారికి శుభదినం. ఈ రోజు వృశ్చిక రాశి వారు చాలా సంతోషంగా ఉంటారు. ఉద్యోగం చేసే చోట పనికి సంబంధించి కొన్ని సవాళ్లు ఉంటాయి.

Horoscope: ఈ రాశి వారు డబ్బు అప్పుగా ఇవ్వొద్దు.. వారి రాక మీ సంతోషాన్ని రెట్టింపు చేస్తుంది..
Zodiac Signs
Follow us
Shiva Prajapati

|

Updated on: Feb 02, 2023 | 1:03 PM

పంచాంగం ప్రకారం.. 2 ఫిబ్రవరి 2023, గురువారం వృశ్చికరాశి వారికి శుభదినం. ఈ రోజు వృశ్చిక రాశి వారు చాలా సంతోషంగా ఉంటారు. ఉద్యోగం చేసే చోట పనికి సంబంధించి కొన్ని సవాళ్లు ఉంటాయి. దీని కారణంగా కొంత అలసట, ఒత్తిడి ఉంటుంది. అయితే, ఈ రాశివారు గురువారం నాడు ఎవరికీ అప్పుగా డబ్బు ఇవ్వకూడదని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. లేదంటే ఇచ్చిన డబ్బును తిరిగి పొందడంలో ఇబ్బంది ఏర్పడొచ్చు అంటున్నారు. వృశ్చిక రాశికి సంబంధించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

వృశ్చిక రాశి వారి గురించి చెప్పాలంటే.. ఈ రోజు వీరికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కానీ ఈ రోజు మీరు మీ అలవాట్లలో కొన్నింటిని మార్చుకోవలసి ఉంటుంది. లేదంటే ఆరోగ్య సంబంధిత సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఇవాళ(గురువారం) డబ్బును అప్పుగా ఇవ్వకూడదు.

ఇవాళ పనిభారం ఎక్కువగా ఉంటుంది. పని ఒత్తిడి మీ మనస్సును కాస్త ఇబ్బంది పెడుతుంది. పని ఒత్తిడి కారణంగా.. మీరు కుటుంబం, స్నేహితుల కోసం సమయాన్ని కేటాయించలేరు. ప్రేమికులు ఒకరి భావాలను ఒకరు అర్థం చేసుకుని కలిసిమెలిసి ఉంటారు. ఇంకా కీలకమైన విషయం ఏంటంటే.. ఇతరు మీ గురించి ఏం అనుకుంటున్నారనేది అస్సలు పట్టించుకోరు. మీకోసం మీరు కొంత సమయాన్ని కేటాయించుకుంటారు. ఖాళీ సమయం దొరికినా ఎవరినీ కలవడానికి ఇష్టపడరు. ఏకాంతంగా, సంతోషంగా గడుపుతారు. దీని వల్ల మీరు రిలాక్స్ అవుతారు.

ఇవి కూడా చదవండి

వైవాహిక జీవితం..

ఇక మీ వైవాహిక జీవితంలో శాంతి, ఆనందం ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. మీ పిల్లలతో కలిసి పిక్నిక్, విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. ఉద్యోగం వెతుకుతున్న వారికి ఉపాధి లభిస్తుంది. మీ ఇంటికి కొత్త అతిథి వచ్చే ఛాన్స్ ఉంది. దీని కారణంగా సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఈ రోజు మీరు ఒక పరిచయస్తుడిని కలుసుకోవచ్చు. వారి ద్వారా మీరు ఆదాయానికి కొన్ని అవకాశాలు కూడా పొందుతారు. దీంతో మీరు మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేసుకుంటారు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం ఊహాగానమే. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈ సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..