Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kalonji Seeds for Men: ఆ విషయంలో పురుషులకు డబుల్ స్టామినా కావాలంటే.. ఈ గింజలతోనే అది సాధ్యం..!

ఆధునిక జీవన శైలి కారణంగా కొందరు పురుషులు తమ శృంగార సామర్థ్యాన్ని కోల్పోతున్నారని నిపుణులు చెబుతున్నారు. ఇక ఇలాంటి పరిస్థితుల్లో నల్లగా ఉండే కలోంజీ విత్తనాలు పురుషులకు అమృతంలా..

Kalonji Seeds for Men: ఆ విషయంలో పురుషులకు డబుల్ స్టామినా కావాలంటే.. ఈ గింజలతోనే అది సాధ్యం..!
Kalonji Seeds
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Feb 02, 2023 | 7:00 AM

మారుతున్న జీవనశైలి,  చెడు ఆహారపు అలవాట్ల కారణంగా చాలామంది పలు రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. మరి కొందరు ఆయా అనారోగ్యాలకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే కొందరు పురుషులు తమ శృంగార సామర్థ్యాన్ని కోల్పోతున్నారని నిపుణులు చెబుతున్నారు. ఇక ఇలాంటి పరిస్థితుల్లో నల్లగా ఉండే కలోంజీ విత్తనాలు పురుషులకు అమృతంలా పనిచేస్తాయని, వారి సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కలోంజి గింజలు తీసుకోవడం వల్ల శరీరంలోని అనేక సమస్యలు తొలగిపోవడంతో పాటు వ్యాధులు కూడా దూరమవుతాయి. దీంతోపాటు శరీర రోగనిరోధక శక్తి కూడా బలోపేతం అవుతుంది. ముఖ్యంగా కలోంజి విత్తనాలు పురుషుల్లో శరీర శక్తిని పెంచేందుకు చాలా మేలు చేస్తాయి. నేటి కాలంలో పురుషులలో వంధ్యత్వ సమస్య బాగా పెరిగిపోయింది. అటువంటి పరిస్థితిలో వంధ్యత్వాన్ని తొలగించడానికి కలోంజి గింజల వినియోగం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కలోంజీని తీసుకోవడం వల్ల పురుషులకు ఎంత మేర మేలు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

వంధ్యత్వ సమస్య నుంచి ఉపశమనం: కలోంజి గింజలను తీసుకోవడం వల్ల శరీరంలో టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయి పెరుగుతుంది. టెస్టోస్టెరాన్ హార్మోన్‌ను సెక్స్ హార్మోన్ అంటారు. ఇలాంటి పరిస్థితుల్లో కలోంజి గింజలను కూడా తీసుకుంటే వంధ్యత్వ సమస్యను చాలా సులభంగా ఎదుర్కోవచ్చు. రోజూ తింటే పురుషుల్లో నపుంసకత్వం దూరమై.. లైంగిక ఆరోగ్యం మెరుగుపడుతుందని పేర్కొంటున్నారు నిపుణులు.

ప్రోస్టేట్ క్యాన్సర్‌ నుంచి కాపాడతాయి: కలోంజి గింజలను తీసుకోవడం వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్ సమస్య దూరమవుతుంది. ఇందులో ఉండే సాటివా ప్రొస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో చాలా మేలు చేస్తుంది. కావున ప్రోస్టేట్ క్యాన్సర్ కణాలను నాశనం చేయడానికి కలోంజి తీసుకోవడం మంచిది.

ఇవి కూడా చదవండి

సత్తువ పెంచడంలో సహాయపడతాయి: పురుషుల శారీరక దృఢత్వాన్ని పెంపొందించడానికి కలోంజి గింజల వినియోగం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కలోంజీని పాలలో కలిపి తాగడం వల్ల స్టామినా డబుల్ పెరుగుతుంది. వీటిని తీసుకోవడం ద్వారా బలహీనత సమస్య కూడా దూరమవుతుంది. అంతేకాకుండా శరీరంలో రక్తహీనత కూడా తొలగిపోతుంది.

జుట్టు రాలడం తగ్గుతుంది: జుట్టు రాలుతుంటే కలోంజి గింజలను తీసుకోవాలని సూచిస్తున్నారు. రోజూ జుట్టుకు కలోంజి ఆయిల్ వాడితే మంచిది. జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. ఇందులో ఉండే యాంటీ మైక్రోబియల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు జుట్టు రాలడాన్ని నిరోధిస్తాయి. జుట్టు ఒత్తుగా, దృఢంగా మారేలా చేస్తాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం..