Ajwain Seeds: ఇంత చిన్న వాము గింజలతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..? తెలిసాక తీసుకోకుండా ఉండలేరు..

వంటింటి సుగంధ ద్రవ్యాలు లేదా మసాలా దినుసులలో వాము కూడా ఒకటి. ప్రతి ఒక్కరి వంట గదిలో కనిపించే వామును నిత్యం తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

Ajwain Seeds: ఇంత చిన్న వాము గింజలతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..? తెలిసాక తీసుకోకుండా ఉండలేరు..
వాము: కూరలలో మసాలాదినుసుగా ఉపయోగించే వాము జీవక్రియను మెరుగుపరిచే లక్షణాలను కలిగి ఉంటుంది. దీనిని తీసుకోవడం ద్వారా సులువుగా బరువు తగ్గవచ్చు. జీర్ణశక్తిని మెరుగుపరిచేందుకు ప్రతి రోజూ ఉదయం పూట వాము నీటిని తాగాలి.
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Feb 01, 2023 | 7:30 AM

వంటింటి సుగంధ ద్రవ్యాలు లేదా మసాలా దినుసులలో వాము కూడా ఒకటి. ప్రతి ఒక్కరి వంట గదిలో కనిపించే వామును నిత్యం తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కాదు. కడుపు నొప్పి, గ్యాస్, గాలి, కడుపు నొప్పి, అజీర్ణం వంటి అనేక రకాల కడుపు సమస్యల నుంచి ఉపశమనం కలిగంచడంలో వాము ఉపయోగపడుతుంది. మన పూర్వీకులు, పెద్దలు పాటించిన ఆయుర్వేద వైద్యంలో కూడా వాముకు ప్రముఖ పాత్ర ఉంది. ఇక ఆయుర్వేద నిపుణుల ప్రకారం ఇది కడుపులో జీర్ణ ఎంజైమ్‌ల స్రావాన్ని మెరుగుపరచడంలో, అతిసారం, మలబద్ధకానికి చికిత్స చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. వాము జీర్ణశక్తికి మంచిది. చూడటానికి జీలకర్రలా అనిపించినా వాము గింజ జీలకర్ర కంటే పరిమాణంలో చిన్నదిగా ఉంటుంది. రుచి కొంచెం ఘాటుగా, కారంగా ఉంటుంది. రూపంలో చిన్నదైనా, ఇది చేసే మేలు మాత్రం అంతా ఇంతా కాదు. అసలు వామును తినడం వల్ల మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

  1. వామును రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిలో కొద్దిగా తేనే వేసుకుని తాగడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు కరుగుతాయి.
  2. శ్వాసకోస సమస్యలతో ఇబ్బంది పడే వారు వాము టీ చేసుకుని తాగడం మంచిది. అంతేకాదు వాము టీ తాగడం వల్ల క్యాన్సర్ వంటి రోగాలు దరిచేరవు.
  3. అసిడిటీ, జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడే వారు వాము నీటిని తాగితే.. ఈ సమస్యలు తగ్గుతాయి.
  4. వాము తినడం వల్ల మలబద్దకం, కడుపు ఉబ్బరం తగ్గుతాయి.
  5. గర్భిణీ, బాలింతలకు వాము మేలు చేస్తుంది. కీళ్ల నొప్పులను తగ్గించడంలో కూడా వాము కీలక పాత్ర పోషిస్తుంది.
  6. వాము నూనెను కీళ్లకు మర్దనా చేస్తే.. నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది.
  7. వాము శరీరంలో పేరుకు పోయిన కొవ్వును తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
  8. అంతేకాకుండా రకరకాల ఇన్ఫెక్షన్స్ సోకకుండా వాము దివ్యఔషధంలా పనిచేస్తుంది.
  9. తలనొప్పి, మైగ్రేన్, అలసటను కూడా తగ్గిస్తుంది.
  10. వాములో పీచు పదార్థం, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్లు ఎక్కువుగా ఉండటం వలన రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం