AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pesticides in Breast milk: తల్లి పాలలోనూ పురుగు మందులు! జాగ్రత్త తల్లి.. ఆ ఆహారం అస్సలు తినొద్దు..

అయితే అటువంటి ఔషధ గుణాలున్న తల్లిపాలే విషంగా మారుతున్నాయి. ఏమిటి? ఆశ్చర్యపోతున్నారా? మీరు చదువుతున్నది నిజమే. ఎక్కడో కాదు మన దేశంలో విషంగా మారుతున్న తల్లి పాలను గుర్తించారు. ఇదెలా సాధ్యం అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ కథనం చదవండి..

Pesticides in Breast milk: తల్లి పాలలోనూ పురుగు మందులు! జాగ్రత్త తల్లి.. ఆ ఆహారం అస్సలు తినొద్దు..
Milk
Madhu
| Edited By: Anil kumar poka|

Updated on: Feb 01, 2023 | 11:23 AM

Share

తల్లిపాలతో సంపూర్ణ పోషణ.. పుట్టిన బిడ్డకు తల్లిపాలతో సకల ఆరోగ్య ప్రయోజనాలు అంటూ నిపుణులు చెబుతుంటారు. నిజమే తల్లి గర్భం నుంచి ఈ భూమి మీదకు వచ్చిన బిడ్డకు తల్లి పాలను మించిన ఆహారం మరొకటి లేదు. సకల పోషకాలు అందులో ఉంటాయి. అయితే అటువంటి ఔషధ గుణాలున్న తల్లిపాలే విషంగా మారుతున్నాయి. ఏమిటి? ఆశ్చర్యపోతున్నారా? మీరు చదువుతున్నది నిజమే. ఎక్కడో కాదు మన దేశంలో విషంగా మారుతున్న తల్లి పాలను గుర్తించారు. ఇదెలా సాధ్యం అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ కథనం చదవండి..

111మంది నవజాత శిశువులు మృతి..

లక్నోలోని క్వీన్ మేరీ ఆసుపత్రి ఓ అధ్యయనం చేసింది. అక్కడి మహారాజ్‌గంజ్‌ జిల్లాలో గత పది నెలల్లో దాదాపు 111 మంది నవజాత శిశువులు చనిపోయారు. దీనికి కారణాలను అన్వేషించిన క్వీన్‌ మేరీ ఆస్పత్రి బృందం బిడ్డల మరణానికి ఆ బిడ్డల తల్లి పాలలో ఉన్న పురుగుమందులే కారణమని తేల్చారు. 130 మంది శాకాహార, మాంసాహార బాలింతలకు పరీక్షలు నిర్వహించి శిశువుల మరణానికి గల కారణాలను కనుగొన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఎన్విరాన్‌మెంటల్ రీసెర్చ్ జనరల్‌లో కూడా ప్రచురించారు. అంతేకాక మాంసాహారుల కంటే శాఖాహారం తీసుకునే మహిళల పాలలో పురుగుమందులు తక్కువగా ఉన్నాయని చెప్పింది.

తల్లి పాలలోకి పురుగు మందులు ఎలా..

తల్లి పాలలోకి పురుగుమందులు ఎలా వచ్చాయన్న ప్రశ్నకు ఈ అధ్యయనం జవాబిచ్చింది. వ్యవసాయం చేసే సమయంలో అతిగా వాడుతున్న రసాయనిక ఎరువులే దీనికి కారణమని నిర్ధారించింది. పచ్చి కూరగాయలు, పంటల్లో వివిధ రకాల పురుగుమందులు, రసాయనాలు వేస్తారు. వీటిని గర్భవతిగా ఉన్నప్పుడు తీసుకున్న మహిళల్లో పాలు కలుషితం అవుతున్నాయి. అలాగే మాంసాహారం తినే మహిళల పాలలో పురుగుమందులు ఏర్పడటానికి కారణం రసాయనాలతో కూడిని ఇంజెక‌్షన్లు జంతువులకు ఇవ్వడమే. ఈ ఇంజెక‌్షన్ల కారణంగానే అత్యధిక శాతం పురుగుమందుల అవశేషాలు తల్లి పాలలోకి చేరుతున్నట్లు వారి పరిశోధనలో తేల్చారు. అది ఎంత మోతాదులో అంటే దాదాపు శాకాహారుల పాలల్లో ఉండే పురుగు మందుల కన్నా మూడింతలు మాంసాహారుల పాలల్లో ఉన్నట్లు నిర్ధారించారు. .

ఇవి కూడా చదవండి

ప్రత్యేక కమిటీ..

నవజాత శిశువులకు కేవలం తల్లి పాలే ఆహారం. మీరు గర్భిణులుగా ఉన్న సమయంలో తీసుకున్న ఆహారంలోని ఈ పురుగుమందులు, పాలల్లో చేరి బిడ్డలకు అనారోగ్యం కలుగజేస్తున్నాయి. కొంతమంది మృత్యువాత పడుతున్నారు. కాగా ఈ మరణాల రేటు పెరగడానికి గల కారణాలను తెలుసుకోవడానికి అక్కడి జిల్లా మేజిస్ట్రేట్ చీఫ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (సిడిఓ) అధ్యక్షతన ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ CDO, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (SDM), మరియు చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ నేతృత్వంలో పని చేస్తుంది. మాతా, శిశు మరణాల సంఖ్య పెరుగుదలపై కూడా బృందం దర్యాప్తు చేస్తుంది. అందుకు గల కారణాలను కూడా వారు కనుగొంటారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం..