Winter Sleep: అవునా.. కాళ్లకు సాక్స్ వేసుకొని పడుకుంటే అంత జరుగుతుందా? అసలు సంగతేంటంటే?
చలికాలంలో కాళ్లను వేడిగా ఉంచేందుకు అనువైన, తేలికైన చిట్కా సాక్స్ ధరించడం. రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు కాళ్లకు సాక్స్ ధరించడం ద్వారా నిద్ర త్వరగా పట్టడంతో పాటు, గాఢనిద్ర పట్టేందుకు దోహదం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుత బిజీ ప్రపంచంలో మనిషిని వేధిస్తున్న ప్రధాన సమస్య నిద్రలేమి. దీనికి అనేక కారణాలు ప్రభావితం చేస్తాయి. జీవనశైలి, మితిమీరిన ఆలోచనలు, శారీరక శ్రమ లేకపోవడం వంటి సమస్యలు సాధారణంగా మనకు కనిపిస్తాయి. అయితే శరీరానికి అవసరమైన వేడి అందకపోవడం వల్ల కూడా నిద్ర పట్టదని చాలా మందికి తెలీదు. ఈ సమస్య సాధారణంగా చలి కాలంలోనే ఎక్కువ ఉంటుంది. చల్లగా ఉన్న వాతావరణంలో మన కాళ్లు ఎక్స్ పోజ్ అవడం వల్ల కాళ్ల దగ్గర ఉన్న బ్లడ్ వెసల్స్ స్తంభించి, రక్త ప్రసరణను సక్రమంగా చేయలేవు. అలాంటి సందర్భంగా కాళ్లను తగినంత వేడిని అందిస్తే మళ్లీ మమూలు స్థితికి కాళ్లు వచ్చి అది నిద్రపట్టేందుకు సాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే అందరికీ ఇది పనికి రాదని, కొందరు అసలు సాక్స్ వాడకూడని వారు కూడా ఉంటారని వివరిస్తున్నారు. ఆ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
కాళ్లను వేడిగా ఉంచేందుకు చిట్కా..
చలికాలంలో కాళ్లను వేడిగా ఉంచేందుకు అనువైన, తేలికైన చిట్కా సాక్స్ ధరించడం. రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు కాళ్లకు సాక్స్ ధరించడం ద్వారా నిద్ర త్వరగా పట్టడంతో పాటు, గాఢనిద్ర పట్టేందుకు దోహదం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఓ అధ్యయనం ప్రకారం..
నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్(ఎన్ఎల్ఎం) సంస్థ ఓ అధ్యయనం చేసింది. ఈ అధ్యయనంలో రోజూ రాత్రి సమయంలో సాక్స్ ధరించే వారు త్వరగా నిద్రపోతున్నట్లు గుర్తించారు. సాధారణంగా మనిషి టెంపరేచర్ సగటున 98.6 డిగ్రీల ఫారన్ హీట్ ఉండాలి. అయితే రాత్రి సమయంలో తగ్గుతుంది. తెల్లవారుజామున 4 గంటల సమయంలో కనిష్ట స్థాయికి చేరుకుంటుంది. అలాంటి సమయంలో సాక్స్ మరింత చల్లబడకుండా చేస్తుంది.
అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
సాక్స్ సాయంతో మంచి నిద్ర మాట అటుంచితే.. అందరూ ఈ చిట్కాను వాడటం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కాళ్లకు ఇన్ ఫెక్షన్స్ ఉన్నవారు, ఏదైనా ఓపెన్ గాయాలున్నవారు, రక్త ప్రసరణ సమస్యలు ఉన్న వారు వాటిని వాడకూడదని చెబుతున్నారు. అలాగే వేడి వాతావరణంలో నివసించే వారు సాక్స్ అస్సలు వాడకూడదని వివరిస్తున్నారు. అలాగే సాక్స్ ధరించేటప్పుడు దానిని పరిశుభ్రంగా ఉంచుకోవడం కూడా ముఖ్యమే. ఎప్పటికప్పుడు దానిని వాష్ చేసుకుంటూ ఉండాలి. లేకుంటే దాని ద్వారా ఇతర చర్మ ఇన్ ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం..