Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kanuma 2023: కనుమ రోజున రథం ముగ్గుని తప్పనిసరిగా వేయడం వెనుక ఆధ్యాత్మిక రీజన్ ఏమిటో తెలుసా

ధనుర్మాసం నెల రోజుల పాటు వివిధ రంగ వల్లులతో తమ ఇంటి ముంగిటను అలంకరించే మహిళలు.. ఈ కనుమ పండుగ రోజు రథం ముగ్గుని తప్పని సరిగా వేస్తారు.. ఇలా కనుమ రోజున రథం ముగ్గు వేయడానికి ఒక రీజన్ ఉందని పెద్దలు చెబుతారు. 

Kanuma 2023: కనుమ రోజున రథం ముగ్గుని తప్పనిసరిగా వేయడం వెనుక ఆధ్యాత్మిక రీజన్ ఏమిటో తెలుసా
Ratham Muggu On Kanuma
Follow us
Surya Kala

| Edited By: Ravi Kiran

Updated on: Jan 16, 2023 | 5:45 AM

హిందు సనాతన ధర్మంలో సంక్రాంతి పండగకు విశిష్ట స్థానం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఈ పర్వదినాన్ని భోగి, సంక్రాంతి, కనుమగా జరుపుకుంటే.. మరికొన్ని ప్రాంతాల్లో ముక్కనుమగా నాలుగు రోజుల పాటు అత్యంత ఘనంగా జరుపుకుంటారు. మూడవ రోజు కనుమను “పశువుల” పండుగ అని కూడా అంటారు. తమకు పాడిపంటలను సమృద్ధిగా అందించే పశువులకు కృతజ్ఞత తెలుపుకుంటూ..  రైతు కుటుంబ సభ్యులు జరుపుకునే పండుగ. ఈరోజు తమతో పాటు పశువులు, పక్షులకు కూడా ఆహారం అందాలని.. ఇంటి గుమ్మానికి ధాన్యపు కంకులను కడతారు. ఇప్పటికీ ఈ పద్దతిని పల్లెల్లో కొందరు పాటిస్తూనే ఉన్నారు. అంతేకాదు ధనుర్మాసం నెల రోజుల పాటు వివిధ రంగ వల్లులతో తమ ఇంటి ముంగిటను అలంకరించే మహిళలు.. ఈ కనుమ పండుగ రోజు రథం ముగ్గుని తప్పని సరిగా వేస్తారు.. ఇలా కనుమ రోజున రథం ముగ్గు వేయడానికి ఒక రీజన్ ఉందని పెద్దలు చెబుతారు.

రథం ముగ్గు విశిష్టత ఏమిటంటే..  ప్రతీ మనిషి శరీరం ఒక రథం అని .. ఈ దేహమనే రథాన్ని నడిపేవాడు  పరమాత్ముడు అని భావిస్తారు. తనను సరైన దారిలో నడిపించమని కోరుతూ పరమాత్మని ప్రార్థించటమే.. ఈ రథం ముగ్గులో దాగున్న ఆంతర్యం. ఉత్తరాయణ పుణ్యకాలంలో.. వచ్చిన “సంక్రాంతి” పురుషుడు శుభాలని కలిగించాలని కోరుతూ.. ఇంటి ముంగిట రథం ముగ్గుని వేసి..  వేసి పువ్వులు, పసుపు, కుంకుమతో పూజచేసి గౌరవంగా ఇంటి నుంచి పొలిమేర వరకూ సాగనంపుతారు.

ప్రచారంలో ఉన్న మరొక ఆధ్యాత్మిక..   బలిచక్రవర్తి.. పాతాళ లోకం నుంచి భూలోకానికి వచ్చి ఈ మూడు రోజులూ గడుపుతాడని పురాణాల కథనం. పండుగ పూర్తయిన తరవాత బలిచక్రవర్తిని తిరిగి అతడిని సాగనంపుటకు ఇంటింటా రథం ముగ్గువేస్తారని ఓ కథ

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)