Women health care: మహిళలూ ఒత్తిడితో చిత్తవుతున్నారా? అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి..

ఒక భార్యగా, తల్లిగా, కుమార్తెగా, ఉద్యోగస్తురాలిగా ఇలా విభిన్న పాత్రలను అలవోకగా పోషిస్తూ అన్నింటికీ సమన్యాయం చేయడానికి సర్వశక్తులా తాపత్రయ పడతారు. ఇటువంటి పరిస్థతుల్లో సహజంగా వారిపై అధిక ఒత్తిడి ఉంటుంది. పురుషుల కన్నా స్త్రీలలోనే ఈ ఒత్తిడి స్థాయిలు అధికంగా ఉంటాయి.

Women health care: మహిళలూ ఒత్తిడితో చిత్తవుతున్నారా? అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి..
Stress Life
Follow us
Madhu

|

Updated on: Jan 27, 2023 | 1:27 PM

మహిళలు మకుటం లేని మహరాణులు.. ఎందుకంటే పురుషునితో సరిసమానంగా.. ఒకరకంగా చెప్పాలంటే వారికంటే ఎక్కువ బాధ్యతలను మోస్తూ గృహ సీమను పాలిస్తారు. ఒక భార్యగా, తల్లిగా, కుమార్తెగా, ఉద్యోగస్తురాలిగా ఇలా విభిన్న పాత్రలను అలవోకగా పోషిస్తూ అన్నింటికీ సమన్యాయం చేయడానికి సర్వశక్తులా తాపత్రయ పడతారు. ఇటువంటి పరిస్థతుల్లో సహజంగా వారిపై అధిక ఒత్తిడి ఉంటుంది. పురుషుల కన్నా స్త్రీలలోనే ఈ ఒత్తిడి స్థాయిలు అధికంగా ఉంటాయి. అయితే వారి పరిస్థితిని అర్థం చేసుకునేవారు చాలా తక్కువగా ఉంటారు. మరో వైపు ఇంత కష్టంచి పనిచేస్తున్నా మన సమాజంలో వారిపై తేలికభావం ఉంది. ఇప్పటికీ మహిళలను కేవలం వంటగదికి, పడకగదికి పరిమితం అంటూ వాదిస్తూ.. అలాగే చూసే వారు కూడా ఉన్నారు. ఇలాంటివి వారిపై ఒత్తిడిని మరింత తీవ్ర తరం చేయండంతో పాటు మానసికంగా కుంగుబాటుకు గురయ్యేలా చేస్తుంది. ఈ నేపథ్యంలో వారు ఈ మానసిక ఒత్తిడిని జయించడానికి అవసరమైన ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.

మన దేశంలో ఇలా..

మన దేశంలో వివాహితలలో మూడింట రెండు వంతుల మంది మహిళలు గృహ హింసను అనుభవిస్తున్నారు. 50 నుంచి 80 శాతం మంది బాలింతలు ప్రసవానంతర ఇబ్బందులు అనుభవిస్తున్నారు. ఉద్యోగాన్ని, కుటుంబాన్ని బ్యాలెన్స్ చేసుకోలేక మానసిక సంఘర్షణకు లోనవుతున్నారు. ఉద్యోగాలు చేసే మహిళల్లో 90 శాతం దీని కారణంగా తీవ్ర మానసిక ఒత్తిడిని అనుభవిస్తున్నారు. ఇవి ఇంట్లో లేదా పని చేసే ప్రాంతంలో వ్యక్తుల మధ్య సంబంధాలను దెబ్బతీస్తున్నాయి.

మహిళలు ఇవి చేస్తే మేలు..

మహిళలు ఇలాంటి పరిస్థితుల కారణంగా కలుగుతున్న మానసిక ఒత్తిడి నుంచి బయటపడేందుకు ఇవి పాటిస్తే మేలు..

ఇవి కూడా చదవండి

ఏదైనా రాస్తూ ఉండాలి.. మీ మనసులో కలిగిన ఆలోచనలను పేపర్ పెట్టడం ద్వారా ఒత్తిడి నుంచి దూరం జరగొచ్చు. ఎందుకంటే ఇది మనిషి భావోద్వేగాలను మరింత స్పష్టమైన రీతిలో వ్యక్తీకరించడంలో బాగా సహాయపడుతుంది. ఫలితంగా పిచ్చి పిచ్చి ఆలోచనలు మదిలోకి రావు. ఇది మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది.

మీకంటూ కొంత టైం ఉంచుకోండి.. మహిళల మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ప్రాథమిక కారణాలలో ఒకటి స్వీయ-సంరక్షణ లేకపోవడం వల్ల కావచ్చు. ఒంటరిగా ప్రశాంతంగా గడిపే సమయం దొరకక ఇబ్బంది కలుగవచ్చు. అయితే భావోద్వేగాలను రీసెట్ చేసుకోవడానికి మీ కంటూ కొంత ప్రైవేటు టైంను ఏర్పాటు చేసుకోండి.

మరొకరి సాయం తీసుకోవచ్చు.. ఒకరితో ఒకరు నిజాయితీగా ఉండటం, వారికి సహాయం అవసరమని అంగీకరించడం అవసరం. ఒత్తిడితో ఒక ఒప్పందానికి సహాయం చేయడానికి, వారి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బహుశా వృత్తిపరమైన సహాయం పొందవచ్చు.

తగిన విశ్రాంతి అవసరం.. చివిరిగా చెప్పేది ఏంటంటే ప్రతి స్త్రీ తమకు వీలైనప్పుడల్లా విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నించాలి. సానుకూల జీవితాన్ని గడపడానికి, ఒకరి మానసిక, శారీరక ఆరోగ్యంపై దృష్టి సారించడానికి ప్రతిరోజూ సమయాన్ని కేటాయించడం చాలా ముఖ్యం. ఆశావాదంగా ఉండటం,ఆరోగ్యకరమైన మనస్తత్వం కలిగి ఉండటం వ్యక్తి మానసిక, శారీరక ఆరోగ్యానికి చాలా అవసరం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం