AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Oatmeal Water: ఈ నీటితో గుండె సమస్యలు దూరం.. అధిక బరువు సమస్య ఫసక్..

చాలా మంది అధిక బరువు నుంచి రక్షణకు కచ్చితంగా ఓట్స్ తింటుంటారు. ఇందులో చెడు కొలెస్ట్రాల్ లేకపోవడంతో దీన్ని ఇష్టంగా తింటారు. అయితే వోట్ వాటర్ అని మీరు ఎప్పుడైనా విన్నారా? మనం డైలీ తినే ఓట్స్ తో ఓట్ వాటర్ ను తయారు చేసుకోవచ్చు.

Oatmeal Water: ఈ నీటితో గుండె సమస్యలు దూరం.. అధిక బరువు సమస్య ఫసక్..
Water
Nikhil
|

Updated on: Jan 27, 2023 | 2:15 PM

Share

కరోనా తర్వాత ఆరోగ్య రక్షణపై ప్రజలు ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ముఖ్యంగా అందరూ ఊబకాయం, గుండె సమస్యల నుంచి రక్షణకు వివిధ చర్యలు తీసుకుంటున్నారు. అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ కారణంగా చాలా మంది గుండె సమస్యలకు గురవుతున్నారు. అయితే  చాలా మంది అధిక బరువు నుంచి రక్షణకు కచ్చితంగా ఓట్స్ తింటుంటారు. ఇందులో చెడు కొలెస్ట్రాల్ లేకపోవడంతో దీన్ని ఇష్టంగా తింటారు. అయితే వోట్ వాటర్ అని మీరు ఎప్పుడైనా విన్నారా? మనం డైలీ తినే ఓట్స్ తో ఓట్ వాటర్ ను తయారు చేసుకోవచ్చు. ఈ వాటర్ ను విరివిగాా తాగితే గుండె జబ్బుల నుంచి రక్షణ పొందవచ్చు. అలాగే అధిక బరువు సమస్య కూడా దూరం అవుతుంది. వోట్మిల్ వాటర్ ఇతర ఆరోగ్య ప్రయోజనాలను సమర్థవంతంగా గ్రహిస్తుంది. 

వోట్మిల్ నీరు ఎలా చేయాలి?

వోట్మిల్ వాటర్ అంటే కేవలం ఉడికించని, పచ్చి వోట్స్ మిశ్రమం. వోట్స్ ను నీటిలో నానబెట్టి నేరుగా తినాలి. ఉదయాన్నే వోట్స్ కలిపిన నీరు ఖాళీ కడుపుతో తీసుకుంటే ఉత్తమ ఫలితాలు ఉంటాయి. కేవలం కొలెస్ట్రాల్ కు మాత్రమే కాకుండా మెరుగైన ఆరోగ్య నిర్వహణకు కూడా సాయం చేస్తుంది. అలాగే ఈ నీటి వల్ల కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.

శరీర డిటాక్సిఫికేషన్

ఖాళీ కడుపుతో వోట్మిల్ నీటిని తీసుకుంటే శరీరాన్ని డిటాక్సిఫికేషన్ చేస్తుంది. అలాగే ఇది దీన్ని సేవించడం వల్ల శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. అలాగే అనవసర టాక్సిన్స్ ను బయటకు పంపుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ ప్రీరాడికల్స్ నుంచి శరీరానికి నష్టం లేకుండా చేస్తుంది. 

ఇవి కూడా చదవండి

కొలెస్ట్రాల్ నిర్వహణకు సాయం

వోట్మిల్ లోని ఫైబర్ అధిక కొలెస్ట్రాల్ ను తగ్గించేందుకు సాయం చేస్తుంది. వోట్మిల్ వాటర్ శరీరంలో హెచ్ డీఎల్ ను మెరుగుపర్చడంలో ఉపయోగపడుతుంది. అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్ డీఎల్ ను తగ్గిస్తుంది.

మెరుగైన జీర్ణశక్తి 

వోట్మిల్ లో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇదు పేగు కదిలికలను సున్నితం చేస్తుంది. అలాగే జీర్ణ క్రియను పెంచుతుంది. అలాగే శరీర శోషణ నెమ్మదిగా సాగేలా చేస్తుంది. అలాగే శరీరంలోని గుడ్ బ్యాక్టిరియాను పెంచుతుంది. 

బరువు తగ్గడానికి సాయం

వోట్మిల్ లో ఉన్న అద్భుతమైన ఫైబర్ కంటెంట్ కారణంగా ఆకలి బాధను దూరం చేస్తుంది. తద్వారా బరువు తగ్గడానికి సాయం చేస్తుంది. ఉత్తమ ఫలితాల కోసం ఖాళీ కడుపుతో తాగాలని గుర్తుంచుకోవాలి. అలాగే వోట్మిల్ వాటార్ లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. 

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం.. క్లిక్ చేయండి