Hair Fall Problem: డైటింగ్ చేస్తే జుట్టు ఊడిపోతుందా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..!
వివిధ విధానాలు అనుసరిస్తూ కష్టపడి బరువు సమస్యను అధిగమిస్తున్నారు. ఇలా బరువు తగ్గిన వారిని మరో సమస్య వేధిస్తుంది. అదే జుట్టు రాలిపోవడం. మీరు వింటున్నది నిజమే బరువు తగ్గిన చాలా మందిని హెయిర్ ఫాల్ సమస్య వేధిస్తుంది.

మారుతున్న జీవనశైలి కారణంగా ప్రస్తుతం అంతా విపరీతంగా బరువు పెరుగుతున్నారు. అయితే ఈ ఊబకాయం వల్ల ఇతర సమస్యలు వస్తుండడంతో అంతా బరువు తగ్గేందుకు వివిధ చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా యువతైతే డైటింగ్ తో పాటు శరీర వ్యాయామంపై కూడా దృష్టి పెడుతున్నారు. అయితే వివిధ విధానాలు అనుసరిస్తూ కష్టపడి బరువు సమస్యను అధిగమిస్తున్నారు. ఇలా బరువు తగ్గిన వారిని మరో సమస్య వేధిస్తుంది. అదే జుట్టు రాలిపోవడం. మీరు వింటున్నది నిజమే బరువు తగ్గిన చాలా మందిని హెయిర్ ఫాల్ సమస్య వేధిస్తుంది. ముఖ్యంగా బరువు తగ్గడానికి తీసుకునే చర్యలు శరీరంలో జుట్టు పెరుగుదలకు అవసరమయ్యే ప్రోటీన్ల లోపానికి కారణం అవుతాయి. అందువల్ల జుట్టు రాలే సమస్యను ఎదుర్కొంటున్నారని నిపుణులు చెబుతున్నారు. అలాగే వారు తెలిపే ఇతర కారణాలేంటో ఓ సారి చూద్దాం.
జుట్టు రాలడానికి కారణం ఏంటి?
సాధారణంగా ప్రతి ఒక్కరికీ రోజుకు 50 నుంచి 100 వెంట్రుకలు రాలుతుంటాయి. అయితే అంతకు మించి గనుక జుట్టు రాలితే పోషకాహార లోపంగా పరిగణించవచ్చు. చాలా మంది త్వరగా బరువు తగ్గడానికి చాలా తక్కువ తింటారు. అందువల్ల పోషకాహార లోపానికి దారి తీస్తుంటుంది. కిటో, డిటాక్స్ వంటి కొవ్వులు ఆకస్మాత్తుగా ఆహారంలో ఉండకపోవడంతో జుట్టు రాలే సమస్య తీవ్రం అవుతుంది. ముఖ్యంగా కెరాటిన్ ఉత్పత్తికి అవసరమైన ఆమైనో యాసిడ్ కూడా తక్కువైతే జుట్టు రాలడాన్ని మరింత పెంచుతుంది. క్రాష్ డైట్ లాగానే, నిర్బంధ ఆహారాలు ఐరన్, జింక్, ప్రొటీన్, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ లోపం జుట్టు రాలే సమస్యను పెంచుతుంది. బరువు తగ్గడం మంచిదే అయినా ఎలా తగ్గుతున్నామో? అనే విషయంపై దృష్టి పెట్టి శరీరానికి అవసరమైన ప్రోటీన్లు అందిస్తూ తగ్గాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యంతో పాటు జుట్టు రాలకుండా బరువు తగ్గే విధానాలేంటో ఓ సారి చూద్దాం
హైడ్రేటెడ్ గా ఉండడం
శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపడానికి తగినంత నీరు గడం చాలా ముఖ్యం. ఇది బరువు తగ్గడం, రక్త ప్రసరణను ప్రోత్సహించడంలో ఈ చర్య సహాయపడుతుంది. అలాగే జుట్టు పెరగడానికి సాయం చేస్తుంది.
సరైన ప్రోటీన్లు అందించడం
సరైన ఆరోగ్యాన్ని ఆస్వాదించడానికి ఆహారంలో మంచి మొత్తంలో ప్రోటీన్లను చేర్చాలి. ప్రొటీన్ మీ బరువు తగ్గించే ఆహారంలో మాత్రమే కాదు, జుట్టు మూలాల్లో కెరాటిన్ ఉత్పత్తికి కూడా సహాయపడుతుంది.
సీజనల్ పండ్లు, కూరగాయలు
సీజనల్ గా దొరికే ఆకుకూరలు తినాలి. అలాగే పండ్లు, కూరగాయలను కూడా అధిక మొత్తంలో తినాలి. ఇలా చేయడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి.
బరువు తగ్గడంలో జాగ్రత్తలు
చాలా మంది చాలా త్వరగా బరువు తగ్గాలనే కోరికతో ఆహారాన్ని అస్సలు తినరు. ఇది శరీరంతో పాటు జుట్టును కూడా ఇబ్బంది పెడుతుంది. ఇలా చేయడం వల్ల పోషకాహార లోపం వచ్చే అవకాశం ఉంది. అందువల్ల డైటింగ్ చేసే వాళ్లు క్రమక్రమంగా బరువు తగ్గాలి.
జంక్ ఫుడ్ కు దూరం
అదనపు నూనె, కేలరీలు, ట్రాన్స్ కొవ్వులు జుట్టు పెరుగుదలకు ఆటంకం కావచ్చు. జంక్ ఫుడ్స్ ను తరచుగా లేదా పెద్ద మొత్తంలో తీసుకున్నప్పుడు, ఫాస్ట్ ఫుడ్ డైట్ పోషకాల లోపానికి దారి తీస్తుంది, ఇది జుట్టు రాలడాన్ని, బరువు పెరగడానికి దారి తీస్తుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం.. క్లిక్ చేయండి..







