Hair Growth: ఒత్తైన జట్టు కావాలనుకునేవారు తప్పక పాటించవలసిన చిట్కాలు.. తీసుకోవలసిన ఆహారాలు.. అవేమిటంటే..

మ‌న ముఖానికి, అందం తీసుకురావ‌డంలో మ‌న జుట్టు ముఖ్య పాత్ర పోషిస్తుంది. మ‌న వెంట్రుక‌లు అందంగా ఉంటేనే మ‌నం అందంగా క‌నిపిస్తాము. జుట్టు ఒత్తుగా, న‌ల్ల‌గా, పొడ‌వుగా ఉండాల‌ని ప్ర‌తి ఒక్క‌రు..

Hair Growth: ఒత్తైన జట్టు కావాలనుకునేవారు తప్పక పాటించవలసిన చిట్కాలు.. తీసుకోవలసిన ఆహారాలు.. అవేమిటంటే..
Hair Growth Tips
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jan 18, 2023 | 2:15 PM

మ‌న ముఖానికి, అందం తీసుకురావ‌డంలో మ‌న జుట్టు ముఖ్య పాత్ర పోషిస్తుంది. మ‌న వెంట్రుక‌లు అందంగా ఉంటేనే మ‌నం అందంగా క‌నిపిస్తాము. జుట్టు ఒత్తుగా, న‌ల్ల‌గా, పొడ‌వుగా ఉండాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. మ‌న ముఖానికి ఎంతో అందాన్ని తెచ్చే వెంట్రుక‌లు పెరగడానికి పాటించవలసిన కొన్ని జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మ‌న త‌ల‌లో ల‌క్ష నుండి ల‌క్ష‌న్న‌ర వెంట్రుక‌ల వ‌ర‌కు ఉంటాయి. కొంద‌రిలో వెంట్రుక ప‌క్క‌కు వెంట్రుక ఉంటుంది. కొంద‌రిలో వాటి మ‌ధ్య దూరం ఎక్కువ‌గా ఉంటుంది. వెంట్రుక‌ల పొడువు, ఆకారం, మ‌న త‌ల‌పై వెంట్రుక‌ల సంఖ్య ఇలా అన్నీ కూడా మ‌న జీన్స్‌పై ఆధార‌ప‌డి ఉంటాయి. అలాగే ఒక వెంట్రుక 99 గ్రాముల బ‌రువు వ‌ర‌కు మోయ‌గ‌ల‌దు. వెంట్రుక కెరోటీన్ అనే ప్రోటీన్‌తో త‌యార‌వుతుంది. ఈ ప్రోటీన్ నిర్మాణం ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్లనే వెంట్రుకకు అంత గ‌ట్టిద‌నం ఉంటుంది.

మ‌నం చ‌క్క‌టి పోష‌కాలు క‌లిగిన ఆహారాన్ని తీసుకుంటూ, త‌ల‌ను చ‌క్క‌టి శుభ్రం చేసుకుంటూ ఉంటే ఒక్క‌సారి పుట్టిన వెంట్రుక ఐదు సంవ‌త్స‌రాల వ‌ర‌కు రాలిపోకుండా నిర్విరామంగా పెరుగుతూనే ఉంటుంది. అలాగే రాలిన వెంట్రుక స్థానంలో మ‌ర‌లా కొత్త వెంట్రుక కూడా వ‌స్తుంది. ఈ కొత్త వెంట్రుక రావ‌డానికి 20 రోజుల స‌మ‌యం ప‌డుతుంది. ఔషధ గుణాలు క‌లిగిన నూనెల‌ను రాయ‌డం వ‌ల్ల ఈ కొత్త వెంట్రుక‌లు 15 రోజుల్లోనే వ‌స్తాయి. ఇలా రాలిన వెంట్రుక స్థానంలో 20 సార్లు కొత్త వెంట్రుకలు వ‌స్తాయి. 20 సార్ల త‌రువాత రాలిన వెంట్రుక‌ల స్థానంలో మ‌ర‌లా వెంట్రుక‌లు రావు. అనారోగ్య స‌మ‌స్య‌ల కార‌ణంగా వెంట్రుక‌లు ఊడిన‌ప్ప‌టికి మ‌న జీవ‌న విధానాన్ని మార్చుకోవ‌డం వ‌ల్ల వాటి స్థానంలో మ‌ర‌లా కొత్త వెంట్రుక‌లు వ‌స్తాయి. అలాగే రోజుకు 50 నుంచి 150 వెంట్రుక‌లు సాధార‌ణంగా రాలిపోతూ ఉంటాయి. కొంద‌రిలో 50 వెంట్రుక‌లు ఊడిపోతే 50 వెంట్రుక‌లు మ‌ర‌లా తిరిగి వ‌స్తాయి. ఇలాంటి వారిలో జుట్టు ఒత్తుగా ఉంటుంది.

కొంద‌రిలో 100 వెంట్రుక‌లు ఊడితే పోష‌కాహార లోపం, ఇన్ ప్లామేష‌న్ కార‌ణంగా తిరిగి 50 మాత్ర‌మే వ‌స్తాయి. అలాగే కొంద‌రిలో విట‌మిన్ డి లోపం, విట‌మిన్ బి 12 వంటి వాటితో పాటు ఇత‌ర పోష‌కాల లోపం వ‌ల్ల అలాగే జ‌న్యుప‌రంగా, థైరాయిడ్, ర‌క్త‌హీనత‌ వంటి స‌మ‌స్య‌లు ఉండ‌డం వ‌ల్ల ఐడిన జుట్టు స్థానంలో కొత్త జుట్టు రాదు. ప్రోటీన్ ఎక్కువ‌గా ఉండే ఆహారాలు, శ‌రీరంలో ర‌క్తాన్ని పెంచే ఆహారాలను తీసుకోవ‌డం, ఆకుకూర‌లు, సోయా బీన్స్, మీల్ మేక‌ర్, బాదం ప‌ప్పు ఎక్కువ‌గా తీసుకోవ‌డం వంటి వాటిని తీసుకోవ‌డం, మొలకెత్తిన గింజ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల రాలిన జుట్టు స్థానంలో మ‌ర‌లా కొత్త వెంట్రుక‌లు వ‌స్తూ ఉంటాయి. అలాగే మందార ఆకుల పేస్ట్ ను జుట్టుకు రాయ‌డం, గుంట‌గ‌ల‌గ‌రాకు తైలాన్ని త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల రాలిన జుట్టు స్థానంలో మ‌ర‌లా కొత్త జుట్టు త్వ‌ర‌గా వ‌స్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
ఆసీస్‌పై సెన్సేషనల్ సెంచరీ.. నితీష్ రెడ్డికి భారీ నజరానా
ఆసీస్‌పై సెన్సేషనల్ సెంచరీ.. నితీష్ రెడ్డికి భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..