AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raw Carrot: క్యారెట్లను పచ్చిగానే తింటున్నారా..? అయితే మీరు తప్పనిసరిగా తెలుసుకుకోవలసిన విషయాలివే..

క్యారెట్‌ను ఉడకబెట్టి, లేదా వండుకొని తినేకన్నా పచ్చిగా తింటేనే దానిలోని పోషకాలు పుష్కలంగా శరీరానికి అందుతాయని సూచిస్తున్నారు నిపుణులు. ముఖ్యంగా మహిళలకు అధిక ప్రయోజనాలు..

Raw Carrot: క్యారెట్లను పచ్చిగానే తింటున్నారా..? అయితే మీరు తప్పనిసరిగా తెలుసుకుకోవలసిన విషయాలివే..
Health Benefits with Raw Carrot
శివలీల గోపి తుల్వా
|

Updated on: Jan 18, 2023 | 7:49 AM

Share

పిల్లలతో సహా మనలో చాలా మంది పచ్చి కూరగాయలు తినేస్తూ ఉంటారు. ఇలా తినేవాటిలో క్యారెట్, బీట్‌రూట్, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, టమోటో వంటివి ఎక్కువగా ఉంటాయి. అయితే ఇలా పచ్చిగానే కూరగాయలను, ఆకు కూరలను తినడం మన ఆరోగ్యానికి మంచిదేనా..? కాదా..? ఈ విషయంపై చాలా మందిలో అపోహలు ఉన్నాయి. అయితే ఈ విషయంలో నిపుణులు పచ్చి కూరగాయలతోనే ఎక్కువ లాభం ఉందని అంటున్నారు. ఇక పచ్చి కూరగాయలను తినే క్రమంలో క్యారెట్ ప్రథమ స్థానంలో ఉంటుంది. క్యారెట్‌ను ఉడకబెట్టి, లేదా వండుకొని తినేకన్నా పచ్చిగా తింటేనే దానిలోని పోషకాలు పుష్కలంగా శరీరానికి అందుతాయని సూచిస్తున్నారు నిపుణులు. ముఖ్యంగా మహిళలకు అధిక ప్రయోజనాలు చేకూరుతాయని వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పచ్చి క్యారెట్ ను తినడం ద్వారా ఆరోగ్యానికి చేకూరే ప్రయోజనాలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

  1. హార్మోన్ బ్యాలెన్స్‌: పచ్చి క్యారెట్‌ను తినడం వల్ల దానిలోని ఫైబర్ శరీరంలోని ఈస్ట్రోజెన్‌ ఉత్పత్తి క్రమబద్ధీకరిస్తుంది. వాస్తవానికి ఈస్ట్రోజెన్‌ అధికమైతే మొటిమలు, మూడ్ స్వింగ్స్ వంటి వాటితో సహా ఇతర హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుంది. ఈ సమస్యను అరికట్టడంలో క్యారెట్ మనకు ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే పచ్చి క్యారెట్లు పేగుల్లోని చెడు బ్యాక్టీరియాల సంఖ్యను తగ్గించడంలో సహాయపడతాయి.
  2. ఎండోటాక్సిన్‌ డిటాక్స్: శరీరంలోని ఎండోటాక్సిన్, బ్యాక్టీరియా, ఈస్ట్రోజెన్‌లను పచ్చి క్యారెట్లు బాగా నియంత్రిస్తాయి. రోజూ ఒక పచ్చి క్యారెట్ తీసుకోవడం ద్వారా అధిక మోతాదులో ఎండోటాక్సిన్‌, కార్టిసాల్, ఈస్ట్రోజెన్‌‌లు వృద్ధి చెందకుండా చేస్తుంది. ఎండోటాక్సిన్ల డిటాక్స్‌కు క్యారెట్లు దివ్యౌధంలా పనిచేస్తాయి.
  3. విటమిన్ ఏ: క్యారెట్లలో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ( FDA) లెక్కల ప్రకారం 4 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు రోజుకు కనీసం 700 నుంచి 900 మైక్రోగ్రాముల విటమిన్ A అవసరం. ఒక పచ్చి క్యారెట్‌ తింటే అందుకు తగిన విటమిన్ ఏ ఉంటుందని FDA చెబుతోంది.
  4. ఈస్ట్రోజెన్‌ నియంత్రణ: క్యారెట్‌లో ప్రత్యేకమైన ఫైబర్‌లు ఉంటాయి. ఇవి జీర్ణ ప్రక్రియను నియంత్రించడంతో పాటు ఇవి అదనపు ఈస్ట్రోజెన్‌ను తగ్గించడానికి సాయపడతాయి. అలాగే కాలేయం మరింత సమర్ధవంతంగా పనిచేయడానికి కూడా క్యారెట్ సాయపడుతుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. మెరిసే చర్మం: క్యారెట్లు విటమిన్ ఏ, బీటా కెరోటిన్‌తో నిండి ఉంటాయి. అందువల్ల పచ్చి క్యారెట్‌లను తినడం వల్ల మొటిమలు,మంటను తగ్గించడంతోపాటు సెల్ టర్నోవర్(సహజ ఎక్స్‌ఫోలియేషన్)ను ప్రోత్సహించడం ద్వారా మచ్చలను నివారించడంలో సహాయపడుతుంది.
  7. థైరాయిడ్ బ్యాలెన్స్‌: విటమిన్ ఏ థైరాయిడ్ పనితీరుపై అనుకూల ప్రభావం చూపుతుంది. క్యారెట్లో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. కాబట్టి హైపోథైరాయిడిజం ఉన్నవారికి క్యారెట్‌లు గొప్ప వరం లాంటిది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
వామ్మో.. అది ఇల్లా పాముల పుట్టా.. ఏకంగా 40 నాగుపాముల పడగ విప్పి
వామ్మో.. అది ఇల్లా పాముల పుట్టా.. ఏకంగా 40 నాగుపాముల పడగ విప్పి
గుడ్‌న్యూస్‌.. గ్యాస్‌ సరఫరాపై ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం
గుడ్‌న్యూస్‌.. గ్యాస్‌ సరఫరాపై ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం
రొనాల్డో ఆఖరి మ్యాచ్ చూసేందుకు స్టేడియానికి కోహ్లీ, ధోనీ వెళ్లారా
రొనాల్డో ఆఖరి మ్యాచ్ చూసేందుకు స్టేడియానికి కోహ్లీ, ధోనీ వెళ్లారా
రూ.3 వేల కోట్ల లంచం కేసు.. ఆ అధికారికి మరణశిక్ష విధించిన కోర్టు
రూ.3 వేల కోట్ల లంచం కేసు.. ఆ అధికారికి మరణశిక్ష విధించిన కోర్టు
ఆధార్ కార్డు ద్వారా బ్యాంక్ అకౌంట్లోని డబ్బులు విత్ డ్రా ఎలా..?
ఆధార్ కార్డు ద్వారా బ్యాంక్ అకౌంట్లోని డబ్బులు విత్ డ్రా ఎలా..?
జనాలకు పిచ్చెక్కించే సాంగ్.. రిజెక్ట్ చేసిన ఆ హీరోయిన్ ఎవరంటే..
జనాలకు పిచ్చెక్కించే సాంగ్.. రిజెక్ట్ చేసిన ఆ హీరోయిన్ ఎవరంటే..
అతి పురాతన ఆలయానికి అరుదైన గుర్తింపు
అతి పురాతన ఆలయానికి అరుదైన గుర్తింపు
కేటీఆర్ తనయుడు హిమాన్షుకు గాయం.. ఏఐజీ హాస్పిటల్‌కు మాజీ సీఎం
కేటీఆర్ తనయుడు హిమాన్షుకు గాయం.. ఏఐజీ హాస్పిటల్‌కు మాజీ సీఎం
యంగ్ సింగర్స్‌కు సూపర్ ఛాన్స్.. హైదరాబాద్‌లో సరిగమప ఆడిషన్స్
యంగ్ సింగర్స్‌కు సూపర్ ఛాన్స్.. హైదరాబాద్‌లో సరిగమప ఆడిషన్స్
చాక్లెట్ గురించి నమ్మలేని షాకింగ్ నిజాలు ఇవే!
చాక్లెట్ గురించి నమ్మలేని షాకింగ్ నిజాలు ఇవే!
వామ్మో.. అది ఇల్లా పాముల పుట్టా.. ఏకంగా 40 నాగుపాముల పడగ విప్పి
వామ్మో.. అది ఇల్లా పాముల పుట్టా.. ఏకంగా 40 నాగుపాముల పడగ విప్పి
గుడ్‌న్యూస్‌.. గ్యాస్‌ సరఫరాపై ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం
గుడ్‌న్యూస్‌.. గ్యాస్‌ సరఫరాపై ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం
అయ్యో.. ఆ ఊర్లో 12 ఏళ్లుగా ఒక్క పెళ్లీ జరగలేదట.. కారణం ఏంటంటే
అయ్యో.. ఆ ఊర్లో 12 ఏళ్లుగా ఒక్క పెళ్లీ జరగలేదట.. కారణం ఏంటంటే
ఉత్తర అమెరికాలో ‘మా ఇంటి బంగారం’ సరికొత్త రికార్డు!
ఉత్తర అమెరికాలో ‘మా ఇంటి బంగారం’ సరికొత్త రికార్డు!
నీ ‘సర్‌’ చల్లగుండ.. పెళ్లి కూడా చేసుకోనివ్వడంలేదుగా
నీ ‘సర్‌’ చల్లగుండ.. పెళ్లి కూడా చేసుకోనివ్వడంలేదుగా
నాన్‌వెజ్ ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన చికెన్‌, ఎగ్స్‌ ధర
నాన్‌వెజ్ ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన చికెన్‌, ఎగ్స్‌ ధర
రెప్పపాటులో తప్పిన పెను ప్రమాదం..
రెప్పపాటులో తప్పిన పెను ప్రమాదం..
పరుగులు తీస్తున్న రైలు ఇంజిన్‌లో చిక్కుకున్న నెమలి.. కట్ చేస్తే
పరుగులు తీస్తున్న రైలు ఇంజిన్‌లో చిక్కుకున్న నెమలి.. కట్ చేస్తే
అయ్యబాబోయ్‌.. అపార్ట్‌మెంట్ పక్కన ఒళ్ళు గగుర్పొడిచే దృశ్యం!
అయ్యబాబోయ్‌.. అపార్ట్‌మెంట్ పక్కన ఒళ్ళు గగుర్పొడిచే దృశ్యం!
116 ఏళ్ల నవనీతమ్మ సంకల్పం వెతికి మరీ VIP దర్శనం కల్పించిన టీటీడీ
116 ఏళ్ల నవనీతమ్మ సంకల్పం వెతికి మరీ VIP దర్శనం కల్పించిన టీటీడీ