Dental Care: చలికాలంలో పంటినొప్పితో బాధపడుతున్నారా..? అయితే ఈ హోమ్ రెమిడీస్‌తో సమస్యకు చెక్ పెట్టేయండిలా..!
చలికాలంలో ఉండే విపరీతమైన చలి కారణంగా దంత సమస్యలతో పాటు పంటినొప్పితో కూడా చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. సాధారణంగా అయితే ఎన్ని మందులు వాడినా ఈ సమస్య అంత త్వరగా తగ్గదు. సమస్య పెద్దది అయ్యే..
చలికాలంలో ఉండే విపరీతమైన చలి కారణంగా దంత సమస్యలతో పాటు పంటినొప్పితో కూడా చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. సాధారణంగా అయితే ఎన్ని మందులు వాడినా ఈ సమస్య అంత త్వరగా తగ్గదు. సమస్య పెద్దది అయ్యే వరకు మనలో చాలామంది మన నోటి ఆరోగ్యంపై శ్రద్ధ వహించరు. అలా చలిలో పంటి నొప్పులతో బాధపడుతూనే ఉంటారు. వర్షకాలంలో, ఎండాకాలంలో కూడా చాలా మందిని ఈ సమస్య వెంటాడుతుంది. బిజీబిజీగా ఉండే జీవనశైలి కారణంగా కూడా ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. మనం తినే తినే ఫుడ్ కూడా ఇందుకు కారణంగా మారే అవకాశం ఉంది.
అయితే చలికాలంలో కాకుండా ఇతర కాలలో ఈ సమస్యకు ప్రధాన కారణం ఆహారం తిన్న తర్వాత నోటిని శుభ్రం చేయకపోవడంతో ఇలాంటి సమస్య వస్తుంది. రాత్రి సమయంలో బ్రష్ చేయకపోవడం కూడా ఇందుకు ఒక కారణం. ఫలితంగా దంతాలలో పురుగులు చేరుతాయి. మీరు కూడా పంటినొప్పి, పంటి తీపులతో ఇబ్బంది పడుతుంటే.. మీరు తక్షణమే పాటించవలసిన చిట్కాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
- కొబ్బరి నూనె: కొబ్బరి నూనెను పంటి కావిటీస్‌ను వదిలించుకోవడానికి ఉపయోగించవచ్చు. దీని కోసం మీరు ఒక చెంచా స్వచ్ఛమైన కోల్డ్ ప్రెస్డ్ కొబ్బరి నూనెను తీసుకోండి. ఈ నూనెను పుక్కిట పట్టండి. ఈ నూనెను సుమారు 10 నుంచి 15 నిమిషాల పాటు పుక్కిలించండి. ఆ తరువాత ఉమ్మేయండి.
- లిక్కర్ రూట్: లైకోరైస్ రూట్ సమస్యను తగ్గించడానికి అద్భుతమైన పరిష్కారం అని చెప్పవచ్చు. దీని కోసం లిక్కరిస్ ముక్క తీసుకొని పౌడర్ చేయండి. బ్రష్‌తో ఈ పొడిని పంటికి అప్లై చేయడం ద్వారా దంతాలను శుభ్రం చేసి.. ఆపై నీటితో శుభ్రం చేసుకోండి.
- వేప పుళ్ళ: మీరు దంతాలను శుభ్రం చేయడానికి వేప పుళ్ళను కూడా ఉపయోగించవచ్చు. దంతాలు శుభ్రంగా ఉంచుకునేందుకు వేప ఎంతగానో సహాయపడుతుంది. మీరు ఈ వేప పుళ్లను బ్రష్‌గా కూడా ఉపయోగించవచ్చు. నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు వేప కొమ్మలతో దంతాలను శుభ్రం చేసుకుంటారు. అందుకు వేపలోని ఔషధ గుణాలే కారణం.
- లవంగ నూనె: లవంగ నూనె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. లవంగ నూనె 2-3 చుక్కలను పత్తిని ఉపయోగించి జోడించండి. మీరు రాత్రికి లవంగ నూనెను అప్లై చేయవచ్చు. ఇది కాకుండా లవంగం నూనెలో కాటన్ వేసి పిప్పి పన్ను మీద ఉంచండి. ఈ రెమెడీని క్రమం తప్పకుండా చేయడం ద్వారా సమస్య త్వరగా నయమవుతుంది.
- వెల్లుల్లి: పిప్పి పన్ను సమస్య,పంటి నొప్పిని తొలగించడానికి వెల్లుల్లి నూనెను ఉపయోగించవచ్చు. దీని కోసం మీరు 7 నుంచి 8 మొగ్గలు వెల్లుల్లిని మెత్తగా చేసి, పిప్పి పన్ను ఉన్న చోట లేదా నొప్పి ఉన్న చోట అప్లై చేయండి. 10 నుంచి 15 నిమిషాలు అలాగే ఉంచి. ఆ తర్వాత కడిగేయాలి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..