Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anti Aging Diet: చర్మంలోని వృద్ధాప్య ఛాయలను నివారించేందుకు తప్పక తీసుకోవలసిన ఆహారం.. తింటే సమస్య మటుమాయమే..

చర్మ సంరక్షణలో భాగంగా కొన్ని జాగ్రత్తలను పాటించడం ద్వారా చర్మంపై వృద్ధాప్య సంకేతాలు కనిపించకుండా చేయవచ్చు. చర్మంపై కనిపించే ముడతల సమస్యను వదిలించుకోవడానికి..

Anti Aging Diet: చర్మంలోని వృద్ధాప్య ఛాయలను నివారించేందుకు తప్పక తీసుకోవలసిన ఆహారం.. తింటే సమస్య మటుమాయమే..
Health Diet For Anti Aging
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jan 16, 2023 | 11:31 AM

మన వయసు పెరుగుతున్న కొద్దీ దాని ప్రభావం మన చర్మంపై కనిపించడం సాధారణమైన విషయం. చర్మంపై కనిపించే ముడతలు, గీతలు మెల్లగా వృద్ధులు అవుతున్నామని సూచిస్తాయి. మానవ జీవన క్రమంలో వృద్ధాప్యం అనేది ఎవరూ ఆపలేని సహజ ప్రక్రియ. అయితే చర్మ సంరక్షణలో భాగంగా కొన్ని జాగ్రత్తలను పాటించడం ద్వారా చర్మంపై వృద్ధాప్య సంకేతాలు కనిపించకుండా చేయవచ్చు. చర్మంపై కనిపించే ముడతల సమస్యను వదిలించుకోవడానికి కెరాటిన్ చాలా ముఖ్యమైనదిగా డెర్మటాలజీ నిపుణులు చెబుతున్నారు. కెరాటిన్ మన చర్మం, జుట్టు, గోళ్ళలో ఉంటుంది. చర్మానికి చాలా ప్రయోజనకరంగా ఉండే ఇది ఒక రకమైన ప్రోటీన్. శరీరంలోకి ఎలాంటి ఇన్ఫెక్షన్‌ ప్రవేశించకుండా నివారించడమే కాక చర్మంపై ముడతలు కనిపించకుండా చేస్తుంది. అందుకోసం కెరాటిన్ సమృద్ధిగా లభించే కొన్ని రకాల ఆహారాలను తీసుకుంటే చక్కని ఫలితాలు ఉంటాయి. మరి కెరాటిన్ పుష్కలంగా లభించే ఆహార పదార్థాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..

పొద్దుతిరుగుడు విత్తనాలు: పొద్దుతిరుగుడు విత్తనాలు చాలా రుచికరమైనవి, ఇంకా పుష్టికరమైనవి. ఇవి శరీరంలో కెరాటిన్ ఉత్పత్తిని పెంచడమే కాక జుట్టును బలోపేతం చేస్తాయి. పొద్దుతిరుగుడు విత్తనాలలో పాంతోతేనిక్ యాసిడ్, సెలీనియం, కాపర్ , విటమిన్ ఇ ఉంటాయి. మీరు ఈ పొద్దు తిరుగుడు విత్తనాలను నేరుగా లేదా జావా రూపంలో తీసుకోవచ్చు.

గుడ్లు: గుడ్లు తినడం వల్ల శరీరానికి ఎన్నో రకాల ప్రయోజనాలు చేకూరడంతో పాటు కెరాటిన్ ఉత్పత్తి జరుగుతుంది. కెరాటిన్ ఉత్పత్తికి అవసరమైన బయోటిన్‌కు గుడ్లు మంచి మూలం. ఒక గుడ్డులో 6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది కెరాటిన్ ఏర్పడటానికి సహాయపడుతుంది.  ఇంతేకాకుండా గుడ్లలో విటమిన్లు A, B12, రిబోఫ్లావిన్, సెలీనియం వంటి వివిధ పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

వెల్లుల్లి: వెల్లుల్లిలో N-ఎసిటైల్‌సిస్టీన్ అనే మొక్కల ఆధారిత యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది జుట్టు కణాలని సూర్యరశ్మి నుంచి రక్షించడమేకాక ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.  వెల్లుల్లిలో ఎల్– సిస్టీన్ అనే అమైనో ఆమ్లం, విటమిన్ సి, బి6, మాంగనీస్ వంటి పలు పోషకాలు కూడా ఉంటాయి.

ఉల్లిపాయ: ఉల్లిపాయని తీసుకోవడం వల్ల శరీరంలో కెరాటిన్ ఉత్పత్తి పెరుగుతుంది.  అదనంగా, ఉల్లిపాయలలో ఫోలేట్ ఉంటుంది. ఇది జుట్టు కుదుళ్లను బలోపేతం చేయడానికి ముఖ్యమైన విటమిన్.

ఆకుకూరలు: బచ్చలికూర, క్యాలీఫ్లవర్, క్యాబేజీ, పాలకూర వంటి ఆకుకూరలలో కెరాటిన్‌ పుష్కలంగా ఉంటాయి. 1 కప్పు వండిన ఆకు కూరల్లో 15.3 మి.గ్రా కెరాటిన్ ఉంటుంది. అంతేకాక ఇందులో ప్రోటీన్, విటమిన్లు, మినరల్స్, ఐరన్ వంటి పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి.

చిలగడదుంప: అనేక రకాల పోషకాలకు చిలగడదుంప నిలయం వంటిది. అందుకే దీనిని సూపర్‌ఫుడ్ అంటారు. ఇందులో బీటా కెరోటిన్, ప్రొవిటమిన్ ఎ ఉంటుంది. ఇది కెరాటిన్‌ను తయారు చేస్తుంది. శరీరం కెరాటిన్‌ను ఉపయోగించినప్పుడు, అది విటమిన్ ఎ గా మారుతుంది. దీని వల్ల మీ జుట్టు చాలా ఆరోగ్యంగా మారుతుంది. బంగాళదుంపల కంటే చిలగడదుంప చాలా ప్రయోజనకరం అని కూడా పెద్దలు చెబుతుంటారు

క్యారెట్:  విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ బి-8, పాంతోతేనిక్ యాసిడ్, ఫోలేట్, పొటాషియం, ఐరన్, కాపర్, మాంగనీస్ వంటి పలు పోషకాలు క్యారెట్‌ ద్వారా లభిస్తాయి. క్యారెట్‌లో చాలా ఫైబర్, బీటా కెరోటిన్ లభిస్తాయి. ఇది సూర్యుని నుంచి వచ్చే హానికరమైన అతినీలలోహిత కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. దెబ్బతిన్న చర్మాన్ని సరిచేయడంలో కూడా క్యారెట్లోని పోషకాలు సహాయపడుతాయి.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..