Sesame Laddus: వావ్.. ఒక్క నువ్వుల లడ్డూ తింటే 5 వ్యాధుల నుంచి ఉపశమనం.. ఇంకెన్నో ప్రయోజనాలు..!

సంక్రాంతి పండుగ నాడు లేదా చలికాలంలో నువ్వుల లడ్డూలను తినడం మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఢిల్లీకి చెందిన సీనియర్ డాక్టర్ అజయ్ కుమార్ అందిస్తున్నసూచనల ప్రకారం నువ్వులు, బెల్లంతో..

Sesame Laddus: వావ్.. ఒక్క నువ్వుల లడ్డూ తింటే 5 వ్యాధుల నుంచి ఉపశమనం.. ఇంకెన్నో ప్రయోజనాలు..!
Sesame Laddus Benefits In Winter
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jan 16, 2023 | 10:19 AM

నువ్వుండలు లేదా నువ్వుల లడ్డూల గురించి తెలియని వారుండరు. ఎంతో ఇష్టంగా ఆరగించే ఈ లడ్డూలకు మకర సంక్రాంతి లేదా లోహ్రి వంటి పలు పర్వదినాలలో ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. నేటికీ భారతదేశంలోని చాలా ఇళ్లలో ప్రజలు పండుగ సందర్భంగా నువ్వుల లడ్డూలను సాంప్రదాయ పద్ధతిలో తయారు చేసి తింటారు. ఇంకా చెప్పుకోవాలంటే నువ్వులతో చేసిన లడ్డూలను తినడం చాలా మందికి ఉన్న ఆహారపు అలవాట్లలో అంతర్భాగం. ముఖ్యంగా చలికాలంలోనే వచ్చే సంక్రాంతి పండుగ నాడు లేదా చలికాలంలో నువ్వుల లడ్డూలను తినడం మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఢిల్లీకి చెందిన సీనియర్ డాక్టర్ అజయ్ కుమార్ అందిస్తున్నసూచనల ప్రకారం నువ్వులు, బెల్లంతో తయారుచేసిన లడ్డూలు చలికాలంలో మన శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి. శరీరాన్ని సీజనల్ వ్యాధుల నుంచి నయం చేయడమే కాకుండా, నువ్వుల నుంచి శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

నువ్వుల లడ్డులోని పోషకాలు:

నువ్వులలో ఐరన్, ప్రొటీన్, విటమిన్ బి, ఇ పుష్కలంగా ఉన్నాయి. ఈ పోషకాలు మన శరీరంలో అంతర్భాగాలైన కళ్ళు, కాలేయం, ఇతర ప్రధాన అవయవాలకు ప్రయోజనకరంగా ఉంటాయి. నువ్వులు మెరుగైన సూపర్ ఫుడ్. ఈ కారణంగానే ప్రజలు దాని నుంచి నూనెను తీసిన తర్వాత కూడా తింటారు. అదే సమయంలో నువ్వుల లడ్డూల కోసం వాడే బెల్లం మన రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. చలికాలంలో రక్తనాళాలు కుంచించుకుపోతాయి, బెల్లం వాటిని తెరిచి రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. ఇది తక్కువ కేలరీల ఆహారం కావడంతో బరువు తగ్గేవారు దీనిని తీసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

నువ్వుల లడ్డూలతో ఈ 5 వ్యాధులకు చెక్:

  1. నువ్వుల లడ్డూలను శీతాకాలంలో తినడం మంచిది. ఎందుకంటే ఈ నువ్వులు, వాటితో చేసిన లడ్డూలు మన రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఫలితంగా చలికాలంలో వచ్చే దగ్గు, జలుబు వంటి సీజనల్ సమస్యల నుంచి సురక్షితంగా ఉండవచ్చు.
  2. నువ్వుల లడ్డూలో క్యాల్షియం ఉండటం వల్ల ఎముకల దృఢంగా మారతాయి. తద్వారా చలికాలంలో వచ్చే ఎముకల నొప్పి మనల్ని ఇబ్బంది పెట్టదు.
  3. మలబద్ధకం వంటి కడుపు వ్యాధులు ఉన్నవారు శీతాకాలంలో నువ్వుల లడ్డూలను తప్పనిసరిగా తినాలి. ఎందుకంటే ఇందులో ఫైబర్ కూడా ఉంటుంది. ఫలితంగా మలబద్ధకం సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.
  4. శరీరానికి కావలసిన శక్తిని అందించడంలో కూడా నువ్వుల లడ్డూ ప్రభావవంతంగా ఉంటుందని, ఆస్తమా రోగులకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని డాక్టర్ అజయ్ కుమార్ చెబుతున్నారు.
  5. చలికాలంలో గుండెజబ్బులు, హార్ట్ ఎటాక్‌లు ఎక్కువగా వస్తుంటాయి. అటువంటి పరిస్థితిలో నువ్వులు తీసుకోవాలి. ఎందుకంటే వాటిలోని పోషకాలు, మూలకాలు మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రణలో ఉంచుతాయి. తద్వారా గుండె పనితీరు మెరుగుపడడమే కాక సురక్షితంగా ఉంటుంది.
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే