Supplements for Women: ముప్ఫై సంవత్సరాలు దాటిన స్త్రీలు సప్లిమెంట్స్ తీసుకోవాల్సిందేనా..? నిపుణులు ఏమంటున్నారంటే..

ముప్పై ఏళ్లు దాటిన తర్వాత.. పురుషులలో, మహిళలో హార్మోన్లు క్షీణించడం ప్రారంభమవుతుంది. మహిళల్లో దాని ప్రభావం కారణంగా.. ఊబకాయం, లైంగిక కోరికలు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వయసులో.. హార్మోన్‌ మార్పుల..

Supplements for Women: ముప్ఫై సంవత్సరాలు దాటిన స్త్రీలు సప్లిమెంట్స్ తీసుకోవాల్సిందేనా..? నిపుణులు ఏమంటున్నారంటే..
Supplements For Women
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jan 14, 2023 | 1:41 PM

ముప్పై ఏళ్లు దాటిన తర్వాత.. పురుషులలో, మహిళలో హార్మోన్లు క్షీణించడం ప్రారంభమవుతుంది. మహిళల్లో దాని ప్రభావం కారణంగా.. ఊబకాయం, లైంగిక కోరికలు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వయసులో.. హార్మోన్‌ మార్పుల వల్ల కలిగే పరిణామాలు తగ్గించడానికి, మహిళలు కొన్ని రకాల విటమిన్‌ సప్లిమెంట్లు (Supplements) తీసుకోవాలని ప్రముఖ హోమియోపతి వైద్యురాలు స్మితా భోయిర్‌ పాటిల్‌ అన్నారు. మహిళల్లో గర్భధారణ, నెలసరి వంటి కారణాల వల్ల.. మగవారి కంటే ఆడవారిలో శరీరక మార్పులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ముఫ్పై ఏళ్లు దాటిన తర్వాత.. మహిళల పీరియడ్స్‌ నియంత్రించే  ఈస్ట్రోజన్‌ ఉత్పత్తి బాగా క్షీణీంచడం ప్రారంభమవుతుంది. 35 సంవత్సరాలు దాటిన తర్వాత దాని ప్రభావం గణనీయంగా పడిపోతుంది. మరి దాని కారణంగా అనేక విధమైన సమస్యలు మహిళలు ఎదుర్కొంటారు. మరి ఆ సమస్యలను అధిగమించడానికి మహిళలు ఎటువంటి సప్లిమెంట్స్ తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

డాక్టర్ స్మితా పాటిల్ సూచనలకు సంబంధించిన వీడియోను ఇక్కడ చూడండి.. 

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Dr. Smita Bhoir Patil | Homeopath (@drsmitabhoirpatil)

  1. విటమిన్ బీ: బీ గ్రూప్‌ విటమిన్లు స్త్రీ శరీరంలోని అనేక ప్రక్రియలకు సహాయపడతాయి. బీ విటమిన్లు స్త్రీలకు తగిన శక్తిని అందించడానికి, డిప్రెషన్‌ను దూరం చేయడానికి, మానసిక స్థితిని మెరుగుపరచడానికి తోడ్పడతాయి. విటమిన్ బీ సప్లిమెంట్స్‌ తీసుకోవడం వల్ల మహిళల్లో.. మానసిక రుగ్మతులు దూరం అవుతాయి.
  2. విటమిన్‌ D3 + K2 (Vitamin D3 and K2): విటమిన్‌ D3 నిజానికి శరీరంలోని పోషకం కంటే హార్మోన్ లాగా పనిచేస్తుంది. స్త్రీ శరీరం కాల్షియాన్ని శోషించడానికి విటమిన్ D, K2 చాలా ముఖ్యం. విటమిన్ D లోపం కారణంగా కొన్ని రకాల క్యాన్సర్లు, ఆటో ఇమ్యూన్‌ డిస్‌ఆర్డర్స్‌, మానసిక రుగ్మతుల ముప్పు పెరుగుతుంది. విటమిన్ D3 + K2 ప్రతి రోజు 600-800 IU మొత్తంలో స్త్రీ శరీరానికి అవసరం.
  3. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌: మహిళల శరీరం ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌ను సొంతంగా తయారు చేసుకోలేదు. దాన్ని ఆహారం, సప్లిమెంట్స్‌ ద్వారా మాత్రమే తీసుకోగలరు. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ నిరాశ, అందోళనను తగ్గించడానికి సహాయపడుతుంది. కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. గుండె సమస్యల ముప్పును తగ్గిస్తుంది. మెటబాలిక్ సిండ్రోమ్ లక్షణాలను తగ్గించడానికి, దీర్ఘకాలిక ఇన్ప్లమేషన్‌తో పోరాడటానికి సహాయపడుతుందని అనేక అధ్యయనాలు స్పష్టం చేశాయి. ప్రతిరోజు శరీరానికి 1.59 గ్రాముల ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అవసరం.
  4. మెగ్నీషియం: 35 సంవత్సరాలు దాటిన ఆడవారి శరీరానికి ఎంతో ముఖ్యమైన ఖనిజం మెగ్నిషియం. స్త్రీ శరీరం 300 కంటే ఎక్కువ శారీరక ప్రక్రియలకు కోఫాక్టర్‌గా మెగ్నీషియంపై ఆధారపడుతుంది. మెగ్నీషియం లోపం ఉన్న వ్యక్తులు కండరాల తిమ్మిరి, , అలసట, మానసిక రుగ్మతలు, హైపర్‌టెన్షన్‌, వికారం, కండాల బలహీనత వంటి సమస్యలతో బాధపడతారు. ఆడవారి శరీరానికి ప్రతి రోజు 320-400 mg మెగ్నీషియం అవసరం.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..