Health Tips: ఒత్తిడి, ఆందోళనలతో బాధపడుతున్నారా..? వాటిని అధిగమించేందుకు ఈ చిట్కాలు పాటించండి..!

ఆందోళన, టెన్షన్‌ అనే మానసిక సమస్యలకు వీలైనంత దూరంగా ఉండడం చాలా మంచిది. లేకపోతే హార్ట్ ఎటాక్, అధిక రక్తపోటు వంటి సమస్యలు తీవ్రతరం అయ్యే అవకాశం ఉంది. మరి ఈ ఒత్తిడి..

Health Tips: ఒత్తిడి, ఆందోళనలతో బాధపడుతున్నారా..? వాటిని అధిగమించేందుకు ఈ చిట్కాలు పాటించండి..!
Tips To Reduce Pressure And Tention
Follow us

|

Updated on: Jan 12, 2023 | 8:49 AM

ప్రస్తుత జీవన శైలిలో, ఉద్యోగ జీవితంలో ఒత్తిడి, ఆందోళన అనేవి అంతర్భాగంగా మారిపోయాయి. వివరంగా చెప్పుకోవాలంటే ఉద్యోగ జీవితంలోని బాధ్యతల కారణంగా మనకు ఆందోళన, టెన్షన్‌ అనే మానసిక సమస్యలు తలెత్తుతున్నాయి. వీటి కారణంగా అనేక రకాల ఆరోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం కూడా ఉంది. ఈ సమస్యల కారణంగా నెగటివ్‌ థింకింగ్‌, హృదయ స్పందనలో మార్పులను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ సమస్యలు ఉన్నప్పుడు వాటి వెనుక చాలా కారణాలు ఉంటాయి. వీటికి వీలైనంత దూరంగా ఉండడం చాలా మంచిది. లేకపోతే హార్ట్ ఎటాక్, అధిక రక్తపోటు వంటి సమస్యలు తీవ్రతరం అయ్యే అవకాశం ఉంది. మరి ఈ ఒత్తిడి, ఆందోళన సమస్యలను ఎలా అధిగమించాలో, అందుకోసం ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

  1. దీర్ఘ శ్వాస: ఆందోళన సమస్య ఏర్పడినప్పుడు మనం వేగంగా శ్వాస తీసుకుంటాం. ఈ పరిస్థితిలో శ్వాసను నియంత్రించడం చాలా అవసరం. ఇందు కోసం మీరు 1 నుంచి 4 వరకు లెక్కించి లోతైన దీర్ఘ శ్వాస తీసుకోవాలి. దీనివల్ల హృదయ స్పందన రేటు కంట్రోల్‌ అవుతుంది. శ్వాసపై దృష్టి పెట్టడం వల్ల క్రమంగా ఆందోళనను అధిగమించవచ్చు.
  2. వ్యాయామం, యోగా: ఆందోళన సమస్య ఉన్నప్పుడు మనుషులు నెగటివ్‌గా ఆలోచిస్తారు. ఈ పరిస్థితిలో వాటిని ఆపడానికి క్రమం తప్పకుండా కొంత సమయం వ్యాయామం లేదా యోగా చేయాలి. దీంతో మానసిక స్థితిని చక్కదిద్దుకోవడమేకాక మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. యోగా చేయలేకపోతే రోజుకు 15 నిమిషాల వాకింగ్‌ అయినా చేయాలి. దీనివల్ల ఆందోళన సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
  3. ఆలోచనలను పేపర్‌లో రాయడం: రకరకాల కారణాల వల్ల ఆందోళన, టెన్షన్‌ సమస్యలు ఎదురవుతాయి. అప్పుడు మన మనస్సులో కలిగిన ఆలోచనలను కాగితంపై రాయాలి. ఇలా చేయడం వల్ల మనసు విశ్రాంతి తీసుకోవడమే కాకుండా దానిలో వచ్చే నెగటివ్‌ ఆలోచనలను దూరంగా ఉంచుతుంది.
  4. చెడు అలవాట్లకు దూరం: ధూమపానం, కెఫిన్, ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఆందోళన చెందుతుంటే వాటికి దూరంగా ఉండడం మంచిది. ఉదాహరణకు కెఫిన్ తీసుకున్న తర్వాత ఆందోళనను అనుభవిస్తున్నట్లయితే కెఫిన్‌ తక్కువ మొత్తంలో ఉండే ఆహారాన్ని తీసుకోండి. ఈ సమస్య దీర్ఘకాలికంగా ఉంటే తప్పనిసరిగా థెరపిస్ట్ సలహా తీసుకోవాలి.
  5. ఇవి కూడా చదవండి
  6. ఇతరులతో పంచుకోవడం: ఒత్తిడితో కూడిన భావాలను నిజాయితీగా ఇతరులకు తెలియజేయడం ద్వారా కూడా మనలోని సమస్యను అధిగమించవచ్చు. మనకు ఇతర వ్యక్తులు అందించే సహాయంతో మరింత చురుకుగా ఉండవచ్చు. ఇంకా ఇలా చేయడం ద్వారా ఇతరులతో మనకున్న సంబంధాలను మెరుగుపరుచుకోవచ్చు.
  7. జీవనశైలి: ఆరోగ్యంగా ఉంటే ఒత్తిడిని సులభంగా నివారించవచ్చు. శరీర బలం, సమతుల్యతను కాపాడుకోవడానికి ఇంకా రోజువారీ జీవితంలో సవాళ్లను ఎదుర్కోవడానికి పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం చాలా అవసరం. అందుకోసం రోజూ వ్యాయామం చేయండి. ఇంకా ప్రశాంతంగా నిద్ర పోండి. తద్వారా మీపై ఒత్తిడిని తగ్గుతుంది. ముఖ్యంగా ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవరుచుకోండి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..