Ramphal Benefits: రామఫలం నిజంగా ఆరోగ్యానికి శ్రీరామ రక్ష.. దీనిలో ఉండే పోషకాలు గురించి తెలిస్తే తినకుండా ఉండలేరంతే..
సీతాఫలంతో పోలిస్తే రామఫలంలో గింజలు తక్కువగా ఉంటాయి. రామ ఫలంతో చేసిన రసం శరీరానికి తేజాన్ని ఇస్తుంది. ఇది ఇతర పండ్ల కంటే ఎక్కువ యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. మలేరియా, క్యాన్సర్‌కు కారణమయ్యే..
శరీర ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు దానికి కావలసిన పోషకాలను అందించడం ఎంతో అవసరం. అన్ని రకాల విటమిన్లు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేడ్స్ శరీరానికి సరిపాళ్ల అందితే పోషకాహార లోపానికి గురికాకుండా మన ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చు. అంతేకాక అనేక రకాలుగా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. పోషకాహార లోపం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు మనల్ని వెంటాడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకు పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లను, కూరగాయలను తినాలి. ఇక అలాంటి పండ్లలో రామఫలం కూడా ఒకటి. దీనిలో ఉండే పోషకాలు నిజంగా మన ఆరోగ్యానికి శ్రీరామ రక్ష వంటివి. కర్నాటక, తమిళనాడు, కేరళ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో విస్తారంగా పండించే రామఫలం.. గుండె ఆకారంలో, ఎరుపు రంగులో ఉండడమే కాక జాక్‌ఫ్రూట్ కంటే మెత్తగా ఉంటుంది. దీనిని నెట్టెడ్ సీతాఫలం, బుల్లాక్ హార్ట్, బుల్ హార్ట్ అని కూడా అంటారు.
ఈ తియ్యటి రామఫలం మన దేశంలోనే కాకుండా మధ్య అమెరికా, యూరప్‌లో కూడా పండిస్తారు. సీతాఫలంతో పోలిస్తే రామఫలంలో గింజలు తక్కువగా ఉంటాయి. రామ ఫలంతో చేసిన రసం శరీరానికి తేజాన్ని ఇస్తుంది. ఇది ఇతర పండ్ల కంటే ఎక్కువ యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. మలేరియా, క్యాన్సర్‌కు కారణమయ్యే కణాలను నివారించే శక్తి కూడా ఈ పండులో ఉందని వైద్యులు చెబుతున్నారు. రామఫలంతో ఆరోగ్యానికి ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
రామ ఫలం ప్రయోజనాలు:
100 గ్రాముల రామఫలం నుంచి 75 కేలరీల శక్తి లభిస్తుంది. అంతేకాక 17.7 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 1.5 గ్రాముల ప్రోటీన్, 3 గ్రాముల ప్రోటీన్ కూడా శరీరానికి పోషకాలుగా అందుతాయి. రామఫలంలో ఫైబర్ కూడా సమృద్ధిగా ఉంటుంది. రామఫలంలో శరీరానికి కావలసిన కార్బోహైడ్రేట్లు, డైటరీ ఫైబర్, కొవ్వు, ప్రోటీన్, విటమిన్ B1, B2, B5, B3, B6, విటమిన్ సి, కాల్షియం, ఐరన్, పొటాషియం, సోడియం, విటమిన్ బి, విటమిన్ సి వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.
మధుమేహం ఉన్నవారికి ఎంతో మేలు:
మధుమేహంతో బాధపడేవారికి ఎన్నో ఆహార నియమాలు. ఇక వారు వేటిని తినాలి, వేటిని తినకూడదనే విషయంపై చాలా రకాల అనుమానాలు ఉంటాయి. అయితే రామ ఫలం ఒక హైపర్ లోకల్ ఫ్రూట్. రక్తంలోని గ్లూకోజ్‌ని తగ్గించే గుణం రామఫలానికి ఉన్నందున ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తుందని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది మధుమేహాన్ని నియంత్రణలో పెట్టేందుకు కావలసిన మినరల్స్ ఈ రామఫలంలో సమృద్ధిగా ఉంటుంది. ఇందులో క్యాన్సర్ నిరోధక గుణాలు కూడా ఉన్నాయి. తీపి విషయానికి వస్తే సీతాఫలం కంటే రామ్ ఫ్రూట్ తక్కువ తీపిగా ఉంటుంది. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ పండును తినవచ్చు. ఇందులోని పోషకాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి.
చర్మం, జుట్టు సంరక్షణ:
చిట్లిన జుట్టు, మొటిమలతో బాధపడుతున్నవారికి రామ ఫలం ఒక వరం. ఇది చర్మం, జుట్టు రెండింటినీ ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇందులో బి-కాంప్లెక్స్, విటమిన్ సి, పిరిడాక్సిన్ పుష్కలంగా ఉన్నాయి. మొటిమలను తగ్గించడంలో కూడా రామ పండు మేలైనది. ఈ పిరిడాక్సిన్ మెదడు కణాలలో అవసరమైన రసాయనాలను స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది. శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడంలో ఇది బాగా పనిచేస్తుంది.
కీళ్ల నొప్పులకు ఉపశమనం:
కీళ్ల నొప్పులతో బాధపడేవారికి రామ ఫలం ఔషధంగా పనిచేస్తుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ, శరీరంలో ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టంతో పోరాడటానికి సహాయపడుతుంది. తద్వారా కీళ్ల నొప్పులకు ఉపశమనాన్ని కలిగిస్తుంది రామ ఫలం.
రోగనిరోధక శక్తి:
విటమిన్ సితో పాటు, రామ ఫలంలో విటమిన్ ఎ, బి విటమిన్లు ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అంతేకాక శరీరంలోని మంటను కూడా తగ్గిస్తుంది రామ ఫలం.
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..