Hair Loss: జుట్టు రాలిపోతోంది.. మనోధైర్యం సన్నగిల్లుతోంది.. యువతలోనే ఈ పరిస్థితి మరింత అధికం..

ప్రస్తుతం మారిపోతున్న లైఫ్ స్టైల్ కారణంగా రకరకాల వ్యాధులు చుట్టుముడుతున్నాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది జుట్టు రాలిపోవడం గురించి. ఇప్పుడు చాలా మంది యువకులు జుట్టు రాలడంతో బాధపడుతున్నారు....

Hair Loss: జుట్టు రాలిపోతోంది.. మనోధైర్యం సన్నగిల్లుతోంది.. యువతలోనే ఈ పరిస్థితి మరింత అధికం..
Hair Loss In Young Age
Follow us

|

Updated on: Jan 17, 2023 | 7:50 AM

ప్రస్తుతం మారిపోతున్న లైఫ్ స్టైల్ కారణంగా రకరకాల వ్యాధులు చుట్టుముడుతున్నాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది జుట్టు రాలిపోవడం గురించి. ఇప్పుడు చాలా మంది యువకులు జుట్టు రాలడంతో బాధపడుతున్నారు. ఫలితంగా సమాజంలో నలుగురితో కలిసేందుకు జంకుతున్నారు. ఆత్మవిశ్వాసం మందగిస్తోంది. జుట్టు రాలడం వల్ల వచ్చే అవమానాన్ని అనుభవించడానికి ఇష్టపడడం లేదు. దీంతో అత్మనూన్యతా భావంతో మానసిక సంఘర్షణతో మదనపడిపోతున్నారు మగ మహారాజులు. అటువంటి వారందరికీ.. జుట్టు పునరుద్ధరణ శస్త్రచికిత్సలు, విధానాలు వరంలా మారాయి. చికిత్సల కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు. అనుసరించే సామాజిక ఆమోదం. యువకులు తాము అసురక్షితంగా ఉన్న విషయాన్ని సరిదిద్దడం పెద్ద సమస్య కాదనే విషయాన్ని గుర్తించలేకపోతున్నారు. తద్వారా మనసులో బాధను పైకి చెప్పుకోలేక ఇబ్బంది పడుతున్నారు.

అయితే.. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన హెయిర్ రీ ప్లాంటేషన్ పద్ధతులు మంచి ప్రయోజనాలు ఇస్తున్నాయి. కాబట్టి ఎలాంటి సంకోచం లేకుండా డాక్టర్లను సంప్రదించడం చాలా అవసరం. వారికి సమస్యను వివరించాలి. మనసులో బాధను ఎలాంటి సందేహం లేకుండా చెప్పగలగాలి. ఇలా చేయడం ద్వారా చికిత్స లో మెరుగైన ఫలితాలు రాబట్టే అవకాశం ఉంది. రాలిపోయిన జుట్టు స్థానంలో అమర్చాల్సిన ఫోలికల్స్ సంఖ్య ఆధారంగా ఈ ప్రక్రియ 1 లేదా 2 రోజుల పాటు జరుగుతుంది.

ఆ తర్వాత జుట్టు పునురుద్ధరణ ప్రక్రియను ప్రారంభిస్తారు. కొన్ని రోజులు డాక్టర్ల అబ్జర్వేషన్ లో ఉంచి.. అవసరమైన సలహాలు సూచనలు ఇస్తారు. ఇబ్బందులు తలెత్తితే వాటిని పరిష్కరిస్తారు. అంతా బాగుందనుకున్నాక ఇంటికి పంపిస్తారు. కాబట్టి జుట్టు రాలిపోతోందని బాధ పడకుండా.. చికిత్స పద్ధతులు ఉన్నాయనే విషయాన్ని గుర్తుంచుకోవడం చాలా అవసరం.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం