High BP: హైబీపీని కంట్రోల్ చేయలేకపోతున్నారా..? నిద్రపోయేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకుంటే సరి.. అవేమిటంటే..
రక్తపోటు అనేది నేడు చాలా మందిలో కనిపించే సాధారణ ఆరోగ్య సమస్యగా మారింది. అయితే ఉన్నట్లుండి లేదా హఠాత్తుగా రక్తపోటు పెరగడం ఆరోగ్యానికి మంచిది కాదు. అలా రక్తపోటు ఒక్కసారిగా పెరగడం వల్ల..
రక్తపోటు అనేది నేడు చాలా మందిలో కనిపించే సాధారణ ఆరోగ్య సమస్యగా మారింది. అయితే ఉన్నట్లుండి లేదా హఠాత్తుగా రక్తపోటు పెరగడం ఆరోగ్యానికి మంచిది కాదు. అలా రక్తపోటు ఒక్కసారిగా పెరగడం వల్ల గుండెపోటు వస్తుంది. ఈ సమస్యతో బాధపడవారు దీనిపై నియంత్రణ సాధించాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అందుకోసం రక్తపోటు ఉన్నవారు తమ ఆహారపు అలవాట్లు, జీవనశైలి, నిద్ర విధానాలపై కూడా శ్రద్ధ పెట్టాలి. కారణం ఏమిటంటే ఈ మూడు విషయాలే ప్రధానంగా అధిక రక్తపోటుకు దారితీస్తాయి. నిజానికి నిద్రలో రక్త ప్రసరణ వేగవంతంగా సాగుతుంది. అలాంటి పరిస్థితిలో రక్త ప్రసరణకు వ్యతిరేక దిశలో నిద్రపోవడం ఆరోగ్యానికి హానికరం. ఇక నిద్రవేళలో కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా BP పెరగకుండా నిరోధించవచ్చు.
నిద్రా భంగిమ: రక్తపోటును అదుపులో ఉంచేందుకు పడుకునేటప్పుడు రక్తప్రసరణకు అనువైన దిశ వైపు తిరిగి పడుకోవాలి. అధిక రక్తపోటు ఉన్నవారు ఎడమవైపు తిరిగి పడుకోవాలి. ఇలా నిద్రపోవడం వల్ల రక్తనాళాలు రిలాక్స్ అవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. ఇలా నిద్రాభంగిమలో జాగ్రత్తలు తీసుకోవడం వల్ల హైబీపీకి దూరంగా ఉండవచ్చు.
పాదాల కింద దిండు: బీపీ ఎక్కువగా ఉన్నవారు తలకు బదులు పాదాల కింద దిండు పెట్టుకుని పడుకోవడం శ్రేయస్కరం. ఇలా నిద్రపోవడం వల్ల రక్తనాళాలు ఉపశమనం పొందుతాయి. పాదాలకు కింద దిండును పెట్టి పడుకోవడం వల్ల వాటికి విశ్రాంతి లేకపోవడాన్ని నివారిస్తుంది. అలాగే రక్తపోటు కూడా పెరగదు. పాదాల దగ్గర దిండు పెట్టుకోవడం వల్ల కూడా మంచి నిద్ర వస్తుంది.
టైట్ సాక్స్ వేసుకోకండి: హై బీపీ ఉన్నవారు నిద్రపోయేటప్పుడు టైట్ సాక్స్ వేసుకోకూడదు. ఇది రక్త ప్రసరణపై చెడు ప్రభావాన్ని చూపుతుంది, ఇంకా అధిక రక్తపోటుకు దారితీస్తుంది. అధిక రక్తపోటు ఉన్నవారు వదులుగా ఉండే సాక్స్‌లను మాత్రమే ధరించి నిద్రపోవాలి.
తగినంత నిద్ర: మంచి ఆరోగ్యానికి మంచి నిద్ర అవసరం. తక్కువ సమయం నిద్రపోతే అది మన ఆరోగ్యానికే హానికరం. హైపర్‌టెన్సివ్ రోగులు తగినంత నిద్ర పొందాలి. నిద్ర లేకపోవడం వల్ల అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం ఉంది.
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..