- Telugu News Photo Gallery Green peas will show side effects if these people eat too much know more in Telugu
Green Peas Side Effects: పచ్చి బఠానీలను ఎక్కువగా తింటున్నారా..? అయితే ఈ సమస్యల బారిన పడినట్లే.. అవేమిటంటే..
బిర్యానీ, కూరలలో ఉపయోగించే పచ్చి బఠానీల రుచి ఎంతో బాగుంటుంది. అందుకే ప్రత్యేకంగా తినాలని కంచంలోని బఠానీలను ఒక పక్క పెట్టి మరీ చివరలో తింటాం. ఇక ఈ పచ్చి బఠానీలలో అనేక రకాల విటమిన్లు, అమైనో ఆమ్లాలు అధికంగా ఉంటాయి. అయితే వీటిని అధికంగా తీసుకోవడం వల్ల కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి.
Updated on: Jan 18, 2023 | 11:59 AM

Green Peas

యూరిక్ యాసిడ్: యూరిక్ యాసిడ్ అనేది మన శరీరంలో ఉండే ఒకరకమైన ద్రవం. శరీరంలో దీని స్థాయి పెరిగినప్పుడు కీళ్ల నొప్పులు మొదలవుతాయి. పచ్చి బఠానీల్లో యూరిక్ యాసిడ్‌ను పెంచే అమినో యాసిడ్స్, విటమిన్ డి, ప్రొటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. అందువల్ల కీళ్ల నొప్పులు ఉన్నవారు పచ్చి బఠానీలను తక్కువగా తినాలి.

అధిక బరువు: పచ్చి బఠానీలలో ప్రోటీన్, పిండి పదార్థాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అందువల్ల బఠానీలను అధికంగా తీసుకుంటే బరువు పెరిగే అవకాశం కూడా ఎక్కువగానే ఉంది. రుచిగా ఉన్న కారణంగా అధికంగా తినేసి ఆరోగ్య సమస్యలకు గురికాకండి.

కిడ్నీ సమస్యలు: కిడ్నీ మన శరీరంలోని ముఖ్యమైన భాగం. శరీరం నుంచి వ్యర్థ, విష పదార్థాలను తొలగించడం దీని విధి. అయితే పచ్చిబఠానీ వంటి అధిక ప్రోటీన్‌ను కలిగిన ఆహారాలను తీసుకోవడం వల్ల కిడ్నీ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

గ్యాస్ట్రిక్ సమస్య: తరచుగా గ్యాస్ లేదా అసిడిటీ సమస్యతో బాధపడుతున్నవారు పచ్చి బఠానీలను తక్కువ పరిమాణంలో మాత్రమే తినాలి. పచ్చి బఠానీలతో చేసిన కూరలను రాత్రిపూట తినడం మానేయాలి, ఎందుకంటే ఇవి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది.





























