Headache: భరించలేని తలనొప్పిని 10 సెకన్లలో తగ్గించే చిట్కా.. ఏ మందులు అవసరం లేకుండానే..
చాలా మంది ట్యాబ్లెట్లు వాడుతుంటారు. అవి వేసుకున్న ఓ పావు గంటకో అరగంటకో ఆ నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే మితిమీరిన ట్యాబ్లెట్ల వాడకం కూడా మంచిది కాదు. ఇటువంటి పరిస్థితుల్లో తలనొప్పిని అది వచ్చిన వెంటనే తగ్గించుకొనే చిట్కా ఉంటే బాగుండు అని మీకు అనిపించి ఉంటుంది.
తలనొప్పి.. చాలా సాధారణమే అయినా చాలా ఇబ్బంది పెడుతుంది. ఏ పనినీ సక్రమంగా చేయనివ్వదు.. దేని మీద ఫోకస్ పెట్టనివ్వదు. ఆలోచనా విధానాన్ని కూడా దెబ్బతీస్తుంది. ఫలితంగా విసుగు, చిరాకు, కోపం వంటివి వస్తాయి. దీని వల్ల మనతోటి వారు కూడా ఇబ్బందులు పడతారు. దీనిని వీలైనంత త్వరగా తగ్గించుకోవడం అవసరం. అందు కోసం చాలా మంది ట్యాబ్లెట్లు వాడుతుంటారు. అవి వేసుకున్న ఓ పావు గంటకో అరగంటకో ఆ నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే మితిమీరిన ట్యాబ్లెట్ల వాడకం కూడా మంచిది కాదు. ఇటువంటి పరిస్థితుల్లో తలనొప్పిని అది వచ్చిన వెంటనే తగ్గించుకొనే చిట్కా ఉంటే బాగుండు అని మీకు అనిపించి ఉంటుంది. అదిగో అలాంటి వారి కోసమే ఈ కథనం. కేవలం సెకన్ల వ్యవధిలో ఎంతటి తలనొప్పినైనా చిటికెలో తగ్గించేసే చిట్కా ఇది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
చాలా కారణాలు..
తలనొప్పి వెనుక అనేక కారణాలు ఉండవచ్చు. ఇది టెన్షన్, డీహైడ్రేషన్, నిద్ర లేకపోవడం, మైగ్రేన్ లేదా కొన్ని సందర్భాల్లో కొన్ని తీవ్రమైన ఆరోగ్య సమస్యల వల్ల కూడా తలనొప్పి రావచ్చు. జీవన శైలి సక్రమంగా లేకపోయినా కూడా తలనొప్పి వస్తుంది. లేదా నిద్రపోయేటప్పుడు సరైన భంగిమలో పడుకోకపోవడం, ఎక్కువ కాంతినిచ్చే దీపాలను తదేకంగా చూడటం, కొన్ని రకాల సువాసనలను పీల్చడం ద్వారా, అధిక కెఫిన్, అధిక ఆల్కాహాలం తీసుకోవడం వంటి ప్రధాన కారణాలు తలనొప్పిని ప్రేరేపిస్తాయి. తలనొప్పులను తగ్గించుకోవడానికి మార్కెట్‌లో చాలా మందులు అందుబాటులో ఉన్నాయి. అయితే అలాంటి మందులను తరచుగా తీసుకోవడం వల్ల కూడా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
ఇలా చేస్తే పది సెకన్లలో మాయం..
విపరీతమైన తలనొప్పిని అనుభవిస్తున్నప్పుడు తక్షణ ఉపశమనం కోసం మీ వేళ్లతో చెంప ఎముక కింద మస్సెటర్ కండరం మీద సున్నితంగా లోపలికి నొక్కుతూ మసాజ్ చేసుకోవాలి. అలా చేసేటప్పుడు కొద్దిగా నోరు తెరుస్తూ మూస్తూ ఉండాలి. కొన్ని సెకన్ల తర్వాత ఈ కండరం రిలాక్స్ అవుతుంది. తలనొప్పి తగ్గుతుంది. ఆరోగ్య నిపుణులు అభిప్రాయం ప్రకారం చాలా మంది ఒత్తిడికి గురైనప్పుడు దవడలు బిగిస్తారు. అలాంటి వాళ్ళు ఈ టెక్నిక్ పాటిస్తే అద్భుతంగా పని చేస్తుంది. త్వరగా ఉపశమనం లభిస్తుంది.
- నిద్రలో పళ్ళు కోరికే వాళ్ళకి కూడా తలనొప్పి వస్తుంది. వాళ్ళు కూడా ఈ టెక్నిక్ పాటిస్తే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
- అలాగే ఎక్కువగా టెన్షన్ వల్ల తలనొప్పి వస్తుంది. ఇది కొద్ది కొద్దిగా మొదలై తీవ్రంగా మారుతుంది. తల రెండు వైపులా వ్యాపించే ఈ నొప్పి వల్ల కంటి నొప్పి కూడా వస్తుంది. టెన్షన్ వల్ల వచ్చే తలనొప్పి దీర్ఘకాలికంగా ఉంటుంది. దీనికి సకాలంలో చికిత్స చేయకపోతే మైగ్రేన్ గా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
మరికొన్ని ఇంటి చిట్కాలు..
తలనొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు కొన్ని ఇంటి చిట్కాలు కూడా ఉపకరిస్తాయి. అవేంటంటే.. శరీరం డీ హైడ్రేట్ అయితే తలనొప్పి వస్తుంది.. దీనిని నివారించడానికి రోజూ తగిన మోతాదులో నీరు తాగుతుండాలి. ప్రతి రోజూ కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటల సుఖ నిద్ర అవసరం. సరైన సమతుల్య ఆహారం తీసుకోవాలి. కంప్యూటర్ స్క్రీన్‌లకు ఎక్కువ గంటలు ఎక్స్‌పోజర్ చేయడం వల్ల మన కళ్లలో ఒత్తిడి పెరుగుతుంది. చివరికి తలనొప్పికి దారితీస్తుంది. కాబట్టి స్క్రీన్ టైమింగ్ తగ్గించుకోవడం మంచిది. వ్యాయామం మిమ్మల్ని ఫిట్‌గా, సరైన ఆకృతిలో ఉంచుతుంది. మనస్సును, శరీరాన్ని తాజాగా ఉంచడంలో సాయపడుతుంది.
నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం..