Bloating Remedies: కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్య వేధిస్తుందా..? ఈ చిట్కాలతో ఇక ఆ సమస్యే ఉండదు..
ధారణంగా తక్కువ తిన్నా కడుపు నిండినట్లు అనిపిస్తే దాన్ని కడుపు ఉబ్బరం సమస్యగా భావించవచ్చు. నిద్రలేమి సమస్య కూడా ఉబ్బరం, మలబద్ధకం సమస్యలకు కారణంగా నిలుస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

మారుతున్న జీవన శైలి, ఆహార అలవాట్ల కారణంగా వివిధ ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం. శీతాకాలంలో జలుబు, దగ్గు మాదిరిగానే చాలా మంది కడుపు ఉబ్బరం, మల బద్ధకంతో బాధపడుతున్నారు. సాధారణంగా తక్కువ తిన్నా కడుపు నిండినట్లు అనిపిస్తే దాన్ని కడుపు ఉబ్బరం సమస్యగా భావించవచ్చు. నిద్రలేమి సమస్య కూడా ఉబ్బరం, మలబద్ధకం సమస్యలకు కారణంగా నిలుస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే రోజుగా వేధించే ఈ సమస్యకు ఓ చిన్న చిట్కా ద్వారా దాదాపు పరిష్కారం లభిస్తుందంటే నమ్ముతారా? కానీ నిజం.. భోజనం చేసిన తర్వాత పాటించే చిన్న చిట్కాతో ఉబ్బరం, మలబద్ధకం సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఆ చిట్కా ఏంటో ఓ సారి తెలుసుకుందాం.
అరటి పండే దివ్య ఔషధం
నిజమే..మన ఇంట్లో ఎప్పుడూ ఉండే అరటిపండుతో ఉబ్బరం, మల బద్ధకం సమస్యకు చెక్ పెట్టవచ్చు. రోజూ భోజనం చేసిన ఓ అరటి పండును తింటే చాలా వరకూ సమస్య నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. అరటి పండును ముక్కలుగా చేసుకుని, నల్ల మిరియాల పొడి, లైట్ గా ఉప్పు చల్లుకుని తింటే అసాధారణ ఫలితాలు ఉంటాయని పేర్కొంటున్నారు.
మల బద్ధకం నుంచి బయటపడడానికి వంటింటి చిట్కాలు ఇవే
- చిలకడదుంపలను విరివిగా ఆహారంలో తీసుకుంటే మల బద్ధకం నుంచి బయటపడవచ్చు. ఎందుకంటే ఇందులో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల జీర్ణక్రియకు సాయం చేస్తుంది.
- పెరుగు ఉబ్బరం, మలబద్ధక సమస్యను సూపర్ గా నివారిస్తుంది. ఓట్స్ తో పాటు భోజనంలో కచ్చితంగా పెరుగుతో తినేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
- ఫైబర్ అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు జీర్ణక్రియకు సాయం చేస్తాయి. కాబట్టి కచ్చితంగా ఫైబర్ ఉండే ఆహార పదార్థాలను ఆహారం చేర్చుకోవాలి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.