Jaggery benefits: బెల్లం ను ఇలా తీసుకుంటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. ముఖ్యంగా వింటర్ సీజన్‌లో..
బెల్లం గురించి ప్రత్యేకంగా వర్ణించాల్సిన అవసరం లేదు. నోట్లు వేసుకుంటే ఇట్టే కరిగిపోయే బెల్లంను ప్రతి ఒక్కరు ఎంతో ఇష్టంగా లొట్టలేసుకుంటూ తినేస్తారు. అయితే, ఈ బెల్లం టేస్ట్‌లోనే కాదు..
బెల్లం గురించి ప్రత్యేకంగా వర్ణించాల్సిన అవసరం లేదు. నోట్లు వేసుకుంటే ఇట్టే కరిగిపోయే బెల్లంను ప్రతి ఒక్కరు ఎంతో ఇష్టంగా లొట్టలేసుకుంటూ తినేస్తారు. అయితే, ఈ బెల్లం టేస్ట్‌లోనే కాదు.. ఆరోగ్యాన్ని కాపాడటంలోనూ బెస్ట్. బెల్లంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనే విషయం మనందరికీ తెలిసిందే. ఎందుకంటే.. ఇందులో ఐరన్, విటమిన్ సి, ప్రోటీన్స్, పొటాషియం, మెగ్నీషియం వంటి ఆరోగ్యకరమైన పోషకాలు ఉన్నాయి. అయితే, వీటి వలన కలిగే ప్రయోజనాలన్నీ పొందాలంటే ముందుగా బెల్లంను ఎలా తీసుకోవాలనేది తెలిసి ఉండాలి. బెల్లంను తీసుకునే విధానం.. మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. మరి బెల్లం ఎలా తీసుకోవాలి? ఎలా తింటే హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయనేది ఈ వార్తలో తెలుసుకుందాం.
పాలలో కలిపి తీసుకుంటే..
చాలా మందికి రోజూ పాలు తాగే అలవాటు ఉంటుంది. అయితే, పాలలో చక్కెర వేసుకుని తాగుతుంటారు. ఇక నుంచి చక్కెరకు బదులుగా బెల్లం వేసుకోవడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే.. బెల్లం కలిపిన పాలు తాగడం వల్ల అనేక విధాలుగా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. బెల్లం కలిపిన పాలు తాగడం వల్ల మహిళలు పీరియడ్స్ టైమ్‌లో క్రాంప్స్, కడుపు నొప్పి సమస్య తగ్గుతుంది. జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది.
తాటి బెల్లం..
ఖర్జూరం, తాటిపండ్ల ద్వారా కూడా బెల్లం తయారు చేస్తారు. ఈ బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది. మంచి రుచి కూడా కలిగి ఉంటుంది. ఇందులో ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఈ మూలకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పీరియడ్స్ సమయంలో వచ్చే తిమ్మిర్ల సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. గొంతు నొప్పి, మలబద్ధకం, మెగ్రైన్ నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
బెల్లంతో చేసిన హల్వా..
చాలా మంది చక్కెరతో హల్వా చేస్తుంటారు. అయితే, చక్కెరకు బదులుగా బెల్లం ను వినియోగించడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. దీంతోపాటు.. పిస్తా, బాదం, ఎండుద్రాక్షను హల్వాలో వేయడం వలన శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా అందుతాయి.
నువ్వుల లడ్డూ..
బెల్లంను కొద్దిగా నెయ్యిలో కరిగించాలి. ఆపై తెల్ల నువ్వులను కూడా కొద్దిగా వేయించాలి. తరువాత బెల్లం పాకంలో నువ్వులను వేసి మిక్స్ చేయాలి. బాగా కలిపి లడ్డూలు చేసుకోవాలి. వాటిని తినడం ద్వారా అధిక రక్తపోటు సమస్య తగ్గుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులు ధరిచేరకుండా ఉంటాయి.
మిక్స్‌డ్ బెల్లం పట్టీ..
అవిసె గింజలు, నువ్వులు, ఎండు కొబ్బరి, పల్లీలు, పిస్తా, బాదం, జీడిపప్పు వంటి వాటిని బెల్లంతో కలిపి తయారు చేస్తారు. ఇందులో ఉండే పోషకాలు.. ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు, దగ్గు వంటి సమస్యలను తగ్గిస్తుంది.
మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..