Horoscope: శనీశ్వరుడి కొత్త అవతారం.. ఈ 5 రాశులవారి జీవితాల్లో సమూల మార్పులు.. అవేంటంటే.?

ఈ రోజు నుంచి శనీశ్వరుడు మకర రాశిని వదిలిపెట్టి రెండున్నర ఏళ్ల పాటు కుంభరాశిలో సంచరిస్తాడు. కుంభరాశి శనికి స్వక్షేత్రం మాత్రమే కాదు. మూల త్రికోణరాశి కూడా.

Horoscope: శనీశ్వరుడి కొత్త అవతారం.. ఈ 5 రాశులవారి జీవితాల్లో సమూల మార్పులు.. అవేంటంటే.?
Shani Gochar
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Ravi Kiran

Updated on: Jan 18, 2023 | 9:10 AM

ఈ రోజు నుంచి శనీశ్వరుడు మకర రాశిని వదిలిపెట్టి రెండున్నర ఏళ్ల పాటు కుంభరాశిలో సంచరిస్తాడు. కుంభరాశి శనికి స్వక్షేత్రం మాత్రమే కాదు. మూల త్రికోణరాశి కూడా. స్వక్షేత్రం కంటే మూల త్రికోణ రాశిలోనే శని శక్తివంతంగా పనిచేస్తాడు. కుంభరాశిలో 2025 జూలై చివరి వరకు ఉండే శనిశ్వరుడు వివిధ రాశుల వారి జీవితాల్లో అనేక మార్పులు చేర్పులు తీసుకువస్తాడు. మేషం నుంచి ప్రారంభించి మీన రాశి వరకు వివిధ రాశుల వారి జీవితాలను సమూలంగా మార్చేస్తాడు. అన్ని రాశుల వారి కోరికలను తీర్చడం సాధారణంగా జరుగుతుంది. వారి వారి వ్యక్తిగత జాతక చక్రాలను బట్టి శని ఇచ్చే అదృష్టం ఆధారపడి ఉంటుంది. అయితే, ఈ 12 రాశులలోనూ ఐదు రాశుల వారి జీవితాలను శనీశ్వరుడు తప్పకుండా అనేక కష్టనష్టాల నుంచి తప్పించడం జరుగుతుంది.

శనీశ్వరుడు కుంభ రాశిలోకి మారటం వల్ల ప్రధానంగా మేషం, మిధునం, తుల, ధనస్సు, మకర రాశి వారికి ఉద్యోగంలో స్థిరత్వం ఇవ్వడం, ప్రమోషన్లు ఇవ్వడం, అధికార యోగం పట్టడం, ఇష్టమైన ప్రాంతాలకు బదిలీ చేయడం, మంచి కంపెనీల నుంచి ఆఫర్లు రావడం, విదేశీ అవకాశాలు పెరగటం, వృత్తి వ్యాపారాల్లో అనూహ్యంగా రాణించడం వంటివి చోటు చేసుకుంటాయి. శని ముఖ్యంగా జీవన కారకుడు. ఉద్యోగ కారకుడు. అంతకుమించి ఐశ్వర్యానికి కూడా కారకుడు. అందువల్ల శని కుంభరాశి ప్రవేశం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది.

మేషం

చాలాకాలంగా ప్రమోషన్ల కోసం, అధికార యోగం కోసం ఎదురుచూస్తున్న మేష రాశి వారికి ఈ ఏడాది తప్పకుండా కోరిక తీరే అవకాశం ఉంది. విదేశాల నుంచి గానీ, విదేశీ సంస్థల నుంచి గానీ మంచి ఆఫర్లు అందే సూచనలు ఉన్నాయి. ఆర్థికంగా ఎదుగుదల కనిపిస్తుంది. ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. పెళ్లి కాని వారికి బంధు వర్గంలోని మంచి సంబంధం కుదిరే సూచనలు ఉన్నాయి. ఇక ప్రేమ వ్యవహారాలలో విజయాలు సాధించడం జరుగుతుంది. సంతాన యోగం ఉంది. ఇవే కాకుండా కొన్ని శుభ పరిణామాలు కూడా చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

మిథునం

ఈ రాశి వారు ఏ రంగంలో ఉన్నా ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందడం జరుగుతుంది. గృహ, వాహన యోగాలకు అవకాశం ఉంది. పెళ్లికి సంబంధించి విదేశీ సంబంధాలు నిశ్చయం అవుతాయి. వృత్తి వ్యాపారాల్లో లాభాల పంట పండుతుంది. రాజకీయ, మద్య, రియల్ ఎస్టేట్, ఐటీ రంగాల్లో దూసుకుపోవడం జరుగుతుంది. ఉన్నత విద్య కోసం, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లి స్థిరపడే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్య చాలావరకు పరిష్కారం అవుతుంది. ప్రేమ వ్యవహారాలు పెళ్ళికి దారితీస్తాయి.

తుల

వ్యాపారులు, వృత్తి నిపుణులు అనూహ్యంగా పురోగతి సాధిస్తారు. ఆకస్మిక ధనలాభాలకు అవకాశం ఉంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. ఆస్తి సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో తప్పకుండా అధికార యోగం పడుతుంది. ప్రత్యేక బాధ్యతలను స్వీకరించాల్సి వస్తుంది. సునాయాసంగా ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. ఐ టి వారికి విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. మంచి చోట పెళ్లి సంబంధాలు కుదురుతాయి. పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. ఆరోగ్యానికి డోకా ఉండదు.

ధనుస్సు

ఈ రోజుతో ఈ రాశి వారికి ఏడున్నర ఏళ్ల శని తొలగిపోతుంది. క్రమక్రమంగా కష్టనష్టాలు తగ్గిపోతాయి. వ్యక్తిగత, కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఈ రాశి వారు ఈ ఏడాది జీవితంలో ఒక వెలుగు వెలుగుతారు. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. అధికార యోగానికి, గృహ, వాహన యోగాలకు అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలు చాలావరకు అనుకూలిస్తాయి. వృత్తి నిపుణులు కొత్త పుంతలు తొక్కుతారు. ఇంతవరకు స్తబ్దుగా ఉన్న జీవితం ఒక్కసారిగా ఊపందుకుంటుంది. కొద్దిపాటి ప్రయత్నంతో ఈ రాశి వారు తమ మనసులోని కోరికలను, ఆశయాలను, ఆకాంక్షలను నెరవేర్చుకోగలుగుతారు.

మకరం

చాలా కాలంగా అనుభవిస్తున్న కొన్ని మానసిక, శారీరక కష్టనష్టాల నుంచి క్రమంగా విముక్తు లభిస్తుంది. కొన్ని ముఖ్యమైన కోరికలు చిన్న ప్రయత్నంతో నెరవేరుతాయి. విదేశీయాన సూచనలు ఉన్నాయి. గృహ యోగం, వాహనయోగం పట్టే అవకాశం ఉంది. పిల్లలు ఎంతగానో ప్రయోజనం పొందుతారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. మంచి పెళ్లి సంబంధాలు కుదురుతాయి. సమాజంలో ఒక ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు పొందుతారు. రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి. ప్రేమ వ్యవహారంలో విజయం సాధిస్తారు.

ఈ రాశుల వారికి శని మార్పు ఒక విధంగా మహారాజ యోగం పట్టిస్తుండగా, ఇతర రాశులయిన వృషభం, సింహం, వృశ్చికం, మీన రాశుల వారికి కూడా వారి జీవితాలలో కొన్ని ముఖ్యమైన శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఆర్థిక సమస్యలు పరిష్కారం కావడం, ఆర్థిక పరిస్థితి మెరుగుపడటం, ఉద్యోగంలో ప్రమోషన్లు రావడం, అనారోగ్యాల నుంచి కోలుకోవటం, రాదనుకున్న డబ్బు చేతికి అందడం, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడం, దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరగటం వంటివి సంభవిస్తాయి. ఈ రాశుల వారికి కొన్ని అవాంఛనీయ పరిణామాలు చోటుచేసుకునే అవకాశం కూడా ఉంది. వీరు ఈ ఏడాది అనవసర పరిచయాలకు, స్నేహాలకు, వ్యసనాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. అంతేకాక, ఆర్థికపరంగా వాగ్దానాలు చేయకపోవడం, హామీలు ఉండకపోవడం చాలా అవసరం.

ఈ 12 రాశుల్లో ఏ రాశి వారైనప్పటికీ ఉత్తమ ఫలితాల కోసం కొద్దిపాటి ప్రయత్నం తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. ప్రయత్నం చేస్తేనే శనీశ్వరుడు అనుగ్రహిస్తాడు. అహంకారమన్నా, సోమరితనమన్నా శనీశ్వరుడికి ఏ మాత్రం ఇష్టం ఉండదు. ఈ లక్షణాలను ఎంత దూరంగా ఉంచితే అంతగా ప్రయోజనం ఉంటుంది. వినయ విధేయతలు ఉన్నవారిని శని ఎంతగానో అభిమానించి, వరాల వర్షం కురిపిస్తాడు. శని అనుగ్రహం కలగడానికి ఏ రాశి వారైనా ఏదైనా శివాలయానికి వెళ్లి అర్చన చేయించడం మంచిది. దీనివల్ల శనీశ్వరుడి అనుగ్రహం మరింతగా కలుగుతుంది.

మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..