Toxic brain foods: జ్ఞాపకశక్తి బాగుండగాలంటే ఈ 5 ఆహారాలు అస్సలు తీసుకోవద్దు..
మనం తినే ఆహారమే మన ఆరోగ్యాన్ని, శరీర భాగాలను ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా శరీరంలో గుండె తరువాత మెదడు అత్యంత కీలకమైది. కొన్ని రకాల ఆహారాలు మెదడుపై ప్రభావం చూపుతాయి.
మనం తినే ఆహారమే మన ఆరోగ్యాన్ని, శరీర భాగాలను ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా శరీరంలో గుండె తరువాత మెదడు అత్యంత కీలకమైది. కొన్ని రకాల ఆహారాలు మెదడుపై ప్రభావం చూపుతాయి. ఇవి మానసిక స్థితి, మానసిక ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. మెదడు ఆరోగ్యాన్ని కాపాడే వాటిలో ఆకు కూరలు, పండ్లు, ఇతర కూరగాయలు, సీఫుడ్స్, నట్స్, బీన్స్ వంటివి ఉన్నాయి.
అయితే, కొన్ని ఫుడ్స్ మాత్రం జ్ఞాపక శక్తిని తగ్గిస్తాయి. వాటిని తినడం వలన జ్ఞాపక శక్తి తగ్గడమే కాకుండా.. దృష్టి లోపం సమస్యలు కూడా వస్తాయి. ముఖ్యంగా ఐదు రకాల ఆహారాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. మరి ఆ ఆహారాలేంటి అనేవి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ప్రాసెస్ చేసిన నూనెలు..
సోయాబీన్, మొక్కజొన్న, రాప్‌సీడ్, పొద్దుతిరుగుడు, కుసుమపువ్వు గింజల ద్వారా తీసి, అధికంగా ప్రాసెస్ చేసిన నూనెలలో ఒమెగా-6 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఈ ఒమేగా -6 లు శరీరం రసాయనాలను ఉత్పత్తి చేయడానికి కారణమవుతాయి. దీనిని అధికంగా వినియోగించడం వలన మెదడులో మంట కలుగుతుంది. అందుకే కొబ్బరి, అవకాడో, ఆలివ్ నూనెను ఉపయోగించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
ఫ్రైడ్ ఫుడ్స్..
బాగా వేయించిన, ఫ్రైడ్ ఫుడ్స్ తినడానికి టేస్టీగానే ఉంటాయి కానీ, మెదుడుపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఇవి మెదడుకు చాలా హానీకరం. వేయించిన ఆహారాలకంటే.. ఉడకబెట్టిన ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.
కృత్రిమ స్వీటెనర్లతో చేసిన ఆహారం..
పోషక విలువలు లేని కృత్రిమ స్వీటెనర్లు బ్యాడ్ గట్ బ్యాక్టీరియాను పెంచుతాయి. ఇది మీ మానసిక స్థితిపై దుష్ప్రభావం చూపుతుంది. ఈ స్వీటెనర్లలో స్టెవియా, సాచరిన్, సుక్రలోజ్ ఉంటాయి. చాలా పరిశోధనల్లో వీటి వినియోగం వల్ల మానసిక ఆందోళన, మానసిక అస్పష్టత ఎదుర్కొన్నట్లు తేలింది.
ప్రాసెస్ చేసిన ఆహారాలు..
ప్రాసెస్ చేసిన ఆహారాలు అధికంగా తీసుకోవడం వలన అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా.. మెదడుపై దుష్ప్రభావం చూపుతుంది. మెదడు పనితీరును నెమ్మదిస్తుంది. వృద్ధాప్యం ఛాయలు పెరుగుతాయి.
మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..