Bloated Stomach In Winter: చలికాలంలో ఉబ్బరం సమస్య వేధిస్తుందా? ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే ఉబ్బరం ప్రాబ్లమ్ ఫసక్ అవ్వాల్సిందే..
నిపుణులు మాత్రం కడుపు ఉబ్బరం సమస్య కాలానుగుణంగా వచ్చే సమస్య కాదని చెబుతున్నారు. కానీ చలికాలంలో ఈ సమస్యతో ఎక్కువ మంది బాధపడుతుంటారని పేర్కొంటున్నారు. పొట్టంతా బిగుతుగా ఉండడం, బొడ్డు వద్ద పట్టేసినట్టుగా పొత్తి కడుపు వద్ద లైట్ గా నొప్పిని అనుభవిస్తుంటారని చెబుతున్నారు.
మనలో చాలా మంది చలికాలంలో కూల్ వెదర్ ను ఆశ్వాదిస్తుంటాం. అయితే ఇదే కాలంలో కొంతమంది మాత్రం తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. ముఖ్యంగా ఊబకాయం ఉన్న వారి సమస్యలు వర్ణనాతీతం. ఎక్కువ ఊబకాయం ఉన్నవారు కడుపు ఉబ్బరం సమస్యతో బాధపడుతుంటారు. పొట్ట పట్టేసినట్టు ఉండడం. ఆకలి వేయకుండా కొంచెం అన్ ఈజీగా ఉంటున్నట్లు ఫీలవుతారు. అయితే నిపుణులు మాత్రం కడుపు ఉబ్బరం సమస్య కాలానుగుణంగా వచ్చే సమస్య కాదని చెబుతున్నారు. కానీ చలికాలంలో ఈ సమస్యతో ఎక్కువ మంది బాధపడుతుంటారని పేర్కొంటున్నారు. పొట్టంతా బిగుతుగా ఉండడం, బొడ్డు వద్ద పట్టేసినట్టుగా పొత్తి కడుపు వద్ద లైట్ గా నొప్పిని అనుభవిస్తుంటారని చెబుతున్నారు. ఈ ఉబ్బరం సమస్య ఎక్కువగా వృద్ధులకు, అలాగే పిల్లలున్న ఆడవారిని వేధిస్తుంటుంది.
ఉబ్బసం అనేది వివిధ కారణాల వల్ల సంభవిస్తుందని వైద్యులు చెబుతున్నారు. అలాగే చలికాలంలో తక్కువ నీరు తాగడం వల్ల డీహైడ్రేషన్ కు గురైతే ఉబ్బరం సమస్య వస్తుందని చెబుతున్నారు. అలాగే చలికాలంలో వ్యాయామం విషయంలో అలసత్వంతో ఎక్కువ నిద్రపోతుంటారు. ఈ విధానం వల్ల ఉబ్బరం సమస్యలను గురవుతారని తెలుపుతున్నారు. అలాగే శీతాకాలంలో మనం తీసుకునే ఆహారం వల్ల కూడా జీర్ణక్రియ అంతరాయం చెంది ఉబ్బరం సమస్యలు వస్తాయంటున్నారు. చలికాలంలో వెచ్చదనం కోసం చాలా మంది టీ, కాఫీలు ఎక్కువగా సేవిస్తుంటారు. ఎక్కువగా టీ, కాఫీలు సేవించే వారిలో ఉబ్బరం సమస్యలు అధికంగా ఉంటాయి.
ఉబ్బరం సమస్య నివారణకు సూచనలు
- శీతాకాలంలో శరీరానికి అవసరమైన మేర కచ్చితంగా నీరు తీసుకోవాలి. అలాగే శరీరం డీ హైడ్రేషన్ కు గురికాకుండా చూసుకోవాలి. ఇలా చేస్తే చాలా వరకూ ఉబ్బరం సమస్య పరిష్కారం అవుతుంది.
- ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే కాలానుగుణంగా దొరికే పండ్లు, కూరగాయలను ఆహారంలో చేర్చుకోవాలి.
- కచ్చితంగా శారీరక వ్యాయామం చేయాలి
- అతిగా నిద్రపోకుండా రోజంతా చురుగ్గా ఉండాలి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.