Kulhad Tea: వణికించే చలిలో.. పొగలు కక్కే కుల్హాడ్ చాయ్.. రుచిలోనే కాదు ఆరోగ్యంలోనూ అమోఘమే..

శీతాకాలపు ఉదయాలు చాలా మనోహరంగా ఉంటాయి. వణికించే చలితో పాటు.. పొగలు కప్పే టీ, కాఫీలు మనల్ని రా..రమ్మని ఊరిస్తూ ఉంటాయి. సూర్యోదయాన్ని ఆస్వాదిస్తూ వేడి వేడి టీ లేదా కాఫీ ని సిప్ చేస్తే ఆ హాయే వేరు....

Kulhad Tea: వణికించే చలిలో.. పొగలు కక్కే కుల్హాడ్ చాయ్.. రుచిలోనే కాదు ఆరోగ్యంలోనూ అమోఘమే..
Kulhad Tea
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jan 05, 2023 | 12:17 PM

శీతాకాలపు ఉదయాలు చాలా మనోహరంగా ఉంటాయి. వణికించే చలితో పాటు.. పొగలు కప్పే టీ, కాఫీలు మనల్ని రా..రమ్మని ఊరిస్తూ ఉంటాయి. సూర్యోదయాన్ని ఆస్వాదిస్తూ వేడి వేడి టీ లేదా కాఫీ ని సిప్ చేస్తే ఆ హాయే వేరు. మన దేశంలో టీ రకాలకు కొదవే లేదు. కశ్మీర్ నుంచి కన్యా కుమారి వరకూ ఎన్నో రకాల చాయ్ లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా తందూరీ చాయ్ ప్రస్తుతం ట్రెండింగ్ గా మారింది. వేడిగా పొగలు కక్కుతున్న టీని అంతకంటే వేడిగా ఉన్నా మట్టి కుండలో పోసి సర్వ్ చేసిన టీ రుచి గురించి చెప్పాలంటే మాటలు చాలవు. గ్రామాల నుంచి నగరాల వరకు మట్టి కుండలోని టీ అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరేమో.. సాధారణంగా టీ షాప్ లలో పేపర్ కప్పులు లేదా గాజు గ్లాసుల్లో టీ అందిస్తుంటారు. కానీ కొన్ని ప్రాంతాల్లో మట్టితో చేసిన కప్పుల్లోనూ టీ అందిస్తుంటారు. దీని వల్ల వినియోగదారులకు మాత్రమే కాకుండా దుకాణ యజమానులకు కూడా ప్రయోజనం ఉంటుంది, ఎందుకంటే మట్టితో చేసిన కప్పులు పర్యావరణానికి ప్రయోజనకరంగా ఉంటుంది. పలు రెస్టారెంట్లల్లో మట్టి కుండలో చాయ్ అందించే మాక్ టీ స్టాల్స్‌ కార్యక్రమాలను నిర్వహిస్తుంటాయి.

మట్టికుండలో చాయ్ తాగడం వల్ల మానసికంగా ఆనందంగా ఉండటమే కాకుండా అద్భుతమైన శారీరక ప్రయోజనాలూ అందుతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పేగు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది ఎసిడిటీ సమస్యను దూరం చేస్తుంది. ప్లాస్టిక్ కప్పులు లేదా శుభ్రం చేయని గ్లాసుల్లో టీ తాగడం వల్ల ఇన్ఫెక్షన్లు వస్తాయి. కానీ మట్టికప్పుల ద్వారా ఆ సమస్యలు వచ్చే అవకాశం లేదు. వీటిలో ఉండే ఆల్కలీన్ జీర్ణాశయంలో ఆమ్లాల అధిక ఉత్పత్తిని నిరోధిస్తుంది. ప్లాస్టిక్ కప్పులలో టీ తాగడం ద్వారా పొట్టకు హాని కలిగించే రసాయనాలు శరీరంలోకి వస్తాయి. అదే మట్టి పాత్రలో టీ తాగితే అనారోగ్య సమస్యలు వస్తాయన్న భయం లేకుండా హాయిగా టీ ఆస్వాదించవచ్చు.

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి